ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 అప్‌డేట్స్
Posted On:
01 MAY 2020 5:37PM by PIB Hyderabad
భారత ప్రభుత్వం, కోవిడ్ -19 సంక్షోభ తీవ్రతకు అనుగుణంగా , ముందస్తు చర్యలు, సానుకూల వైఖరి ద్వారా రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలతో కలసి సమిష్టి కృషితో వైరస్ నివారణ, నియంత్రణ, నిర్వహణ కోసం అనేక చర్యలు తీసుకుంటోంది. వీటిని క్రమం తప్పకుండా ఉన్నత స్థాయిలో సమీక్షిస్తున్నారు.
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ , ఈరోజు బీహార్ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ మంగళ్ పాండేతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి అశ్విన్ కుమార్ చౌబే , కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పలువురు సీనియర్ అధికారులు, పాల్గొన్నారు. ఆక్యూట్ ఎన్‌సెఫలైటిస్ సిండ్రోమ్ (ఎఇఎస్) నియంత్రణ, బీహార్‌లో కోవిడ్ -19 పరిస్థితి తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.
దేశంలోని అన్ని జిల్లాలను గ్రీన్, ఆరంజ్, రెడ్ జోన్లుగా విభజించారు. కేసులు ఎక్కువగా వచ్చిన రెడ్,ఆరంజ్ జోన్లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సంబంధిత జిల్లా పాలనా యంత్రాంగాలతో కలిసి వైరస్ వ్యాప్తికి కారణాలను కనిపెట్టి , వ్యాధి విస్తరించకుండా ప్రత్యేక దృష్టిపెట్టాలని,కఠినమైన కంటైన్‌మెంట్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
కేసుల మ్యాపింగ్‌ను, కాంటాక్టులను కేసుల భౌగోళిక వ్యాప్తి ,కాంటాక్టులు; స‌్పష్టంగా గుర్తించిన ప్రాంతాలు; అమలు చేయగల సామర్థ్యం వంటి వాటిని పరిగణనలోకి తీసుకొని కంటైన్‌మెంట్ జోన్‌లను వివరించాలి.,
కంటైన్‌మెంట్ జోన్లుగా,పట్టణ ప్రాంతాలలో రెసిడెన్షియల్ కాలనీ , మొహల్లాలు, మునిసిపల్ వార్డులు లేదా పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతం, మునిసిపల్ జోన్లు ఉండవచ్చని రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల విషయంలో, మండలాలు గ్రామం , గ్రామ సమూహాలు లేదా పోలీసు స్టేషన్ల సమూహం , గ్రామ పంచాయతీలు , బ్లాక్ మొదలైనవి ఉండవచ్చు.
రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలు బఫర్ జోన్లు, కంటైన్మెంట్ జోన్లను స్పష్టంగా గుర్తించాల్సిన అవసరం ఉంది. కంటైన్‌మెంట్ జోన్లలో, ఆయా ప్రాంతాలలో కఠిన నియంత్రణ, ఇందుకోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక బృందాల ద్వారా ఇంటింటికి పరిశీలన, నమూనా మార్గదర్శకాల ప్రకారం అన్ని కేసులను పరీక్షించడం, బఫర్ జోన్లలోకాంటాక్ట్ ట్రేసింగ్ ధృవీకరించిన అన్ని కేసుల క్లినికల్ పరీక్షల నిర్వహణ , ఆరోగ్య సదుపాయాలలో ILI / SARI కేసులను పర్యవేక్షించడం ద్వారా కేసులపై విస్తృత నిఘాచర్యలు తీసుకోవాలి..
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 8,888 మందికి వ్యాధి నయమై ఆస్పత్రులనుంచి డిశ్చార్జి అయ్యారు. దీనితో మొత్తం రికవరీ రేటు 25.37 శాతానికి పెరిగింది. కోవిడ్ నిర్ధారిత కేసులు 35,043 కు చేరుకున్నాయి. నిన్నటి నుంచి 1993 కోవిడ్ -19 నిర్దారిత కేసులు పెరిగాయి.
కోవిడ్ వైరస్ వ్యాప్తి ని నిరోధించడానికి చేతుల పరిశుభ్రత పాటించడం, సబ్బుతో, నీటితో తరచూ చేతులు కడుగుకోవడం, శానిటైజర్ వాడడం, చేతులతో తాకే అవకాశమున్న టేబుల్ టాప్, కుర్చీ చేతులు, కీబోర్డులు, మౌస్, మౌస్ ప్యాడ్ తదితరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటివి పాటించాలని ప్రభుత్వం పునరుద్ఘాటించింది. అలాగే ప్రతి ఒక్కరూ ముఖానికి తగిన మాస్క్ ధరించడం, కరోనాట్రాకర్ యాప్ ఆరోగ్య సేతును డౌన్‌లోడ్ చేసుకోవడం, సామాజిక దూరం పాటించడం
అవసరమని ప్రభుత్వం సూచించింది.
కోవిడ్ -19 కి సంబంధించి తాజా , అధీకృత సమాచారం , దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, ఇతర సూచనల కోసం క్రమం తప్పకుండా గమనించండి : https://www.mohfw.gov.in/.
కోవిడ్ -19 కి సంబంధించి సాంకేతిక అంశాలపై తమ ప్రశ్నలను technicalquery.covid19[at]gov[dot]in ఈమెయిల్‌కు పంపవచ్చు. ఇతర ప్రశ్నలను ncov2019[at]gov[dot]in .కు పంపవచ్చు.
కోవిడ్ -19పై ఏవైనా ప్రశ్నలకు సమాధానాల కోసం కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్‌లైన్ నెంబర్ : +91-11-23978046 లేదా 1075 (టోల్ ఫ్రీ) కు ఫోన్ చేయవచ్చు. కోవిడ్ -19 పై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల హెల్ప్‌లైన్ ల జాబితా కోసం కింది లింక్‌ను గమనించవచ్చు.
https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .
*****
(Release ID: 1620172)
Visitor Counter : 274
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam