గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 నిర్వహణ కోసం 24 గంటలూ పనిచేస్తున్న - విశాఖపట్నం స్మార్ట్ సిటీ ఆపరేషన్స్ సెంటర్.

ట్రాకింగ్, పర్యవేక్షణ, అవగాహన కల్పనా కార్యకలాపాలు నిర్వహిస్తున్న - ఆపరేషన్స్ సెంటర్.

Posted On: 01 MAY 2020 3:44PM by PIB Hyderabad

కోవిడ్-19 నిర్వహణ కోసం విశాఖపట్నం లోని ది స్మార్ట్ సిటీ ఆపరేషన్స్ సెంటర్ ప్రతీరోజు మూడు షిఫ్టుల్లో 24 గంటలూ పనిచేస్తోంది.  ఈ కేంద్రంలో చేపడుతున్న వివిధ కార్యక్రమాలు ఈ విధంగా ఉన్నాయి : 

·      నగరంలో 90 ప్రదేశాల్లో ఏర్పాటుచేసిన పబ్లిక్ అనౌన్సమెంట్ విధానం ద్వారా కోవిడ్-19 కు సంబంధించి తీసుకోవలసిన జాగ్రత్తలు, సమాచారాన్ని తెలియజేయడం. 

·       నగరంలో 10 కీలక ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ సైన్ బోర్డుల ద్వారా కోవిడ్-19 సమాచారాన్ని( వివిధ సందేశాలను) ప్రదర్శించడం. 

·       నగరవ్యాప్తంగా ముఖమైన ప్రాంతాలు, కీలక కూడళ్లలో ఏర్పాటుచేసిన 500 కెమెరాల ద్వారా నిఘా వ్యవస్థ నిర్వహణ. 

·       సి.ఎం.ఓ.హెచ్ & డి.ఎం.ఓ.హెచ్. ల సమన్వయంతో రోజువారీ ప్రాతిపదికన విదేశాల నుండి తిరిగి వచ్చిన పౌరుల వివరాలను సి.ఓ.సి. వద్ద ఉన్న కోవిడ్ హెల్ప్ డెస్క్ / కాంటాక్ట్ సెంటర్ సేకరించి, పర్యవేక్షిస్తుంది.  ప్రజా ఆరోగ్యం వంటి విభాగాలకు చెందిన నగర, జిల్లా స్థాయి అధికారులతో ఈ  కోవిడ్ హెల్ప్ డెస్క్ / కాంటాక్ట్ సెంటర్ ప్రతీ రోజు 24 గంటలు పనిచేస్తుంది. 

·       సి.ఓ.సి. వద్ద ఏర్పాటు చేసిన ఉచిత హెల్ప్ లైన్ నెంబర్ కు వచ్చిన అత్యవసర ఫోన్ కాల్స్ ను స్వీకరించితదనుగుణంగా లైన్ విభాగాలకు సమాచారాన్ని తెలియజేస్తుంది. 

·       విదేశాలనుండి తిరిగి వచ్చినవారిని గుర్తించి, వివరాలు సేకరించేందుకు ఒక మొబైల్ అప్లికేషన్ను అభివృద్ధి చేయడం జరిగింది. మొబైల్ అప్లికేషన్ ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా, క్లస్టర్ మాపింగ్, ప్రమాదం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను రంగులతో గుర్తించి డిజిటల్ మ్యాప్ ను తయారుచేస్తారు. సి.ఓ.సి. లోని జి.ఐ.ఎస్. ని ఉపయోగించి కేటగిరీ వారీగా అంటే 0-14, 15-28 మరియు 28 రోజులకంటే ఎక్కువ క్లస్టర్లు గా  రూపొందిస్తారు.   జిల్లా పరిపాలనా యంత్రాంగం రూపొందించిన ఈ విశ్లేషణ ఆధారంగా అక్కడక్కడా నమూనాలను కూడా సేకరిస్తారు

·       పాజిటివ్ గా గుర్తించిన ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పనిచేసే ఏ. ఎన్.ఎమ్. / ఆశా / కార్యకర్తలు కంటైన్మెంట్ క్లస్టర్ సర్వే నిర్వహించడానికి ఒక మొబైల్ అప్లికేషన్లను అభివృద్ధి చేశారు.   

·       విశాఖపట్నంలో 20 అత్యవసర స్పందన బృందాలను (ఆర్.ఆర్.టి.) ఏర్పాటు చేశారు.  వీటికి సంబంధించిన అంబులెన్సులలో బిగించిన మొబైల్ టాబ్స్ ద్వారా ఈ బృందాల కదలికలను గమనిస్తూ ఉంటారు 

·       ఒక ఆర్.ఆర్.టి. అప్లికేషన్ను అభివృద్ధి చేశారు. సంబంధిత బృందంలోని వైద్యులందరూ అనుమానితులు / క్షేత్రాలనుండి నేరుగా హాజరైన పౌరుల వివరాలను ఈ ఆర్.ఆర్.టి. అప్లికేషన్ లో పొందుపరుస్తారుదీన్ని సి.ఓ.సి. మరియు సంబంధిత కమిటీలు పర్యవేక్షిస్తాయి. 

·       వ్యాధి లక్షణాలు కలిగిన పౌరుల నుండి నమూనాలను సేకరించడానికి నాలుగు మొబైల్ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలను సి.ఓ.సి. ద్వారా, మొబైల్ టాబ్ ఆధారిత ట్రాకింగ్ ద్వారా పర్యవేక్షిస్తారు.  ఆ తర్వాత సంబంధిత వైద్యులు పౌరుల వివరాలను మొబైల్ అప్లికేషన్ ద్వారా పొందుపరుస్తారు

·       ఇంటింటికీ తిరిగి కార్యకర్తలు సేకరించిన సమాచారాన్ని పర్యవేక్షించినివేదికలను సంబంధిత కమిటీ ఇంచార్జ్ లకు ఎప్పటికప్పుడు అందజేస్తారు.  

·       కంటైన్మెంట్ ప్రాంతాల్లో బ్లీచింగ్ వంటి ఇతర పారిశుధ్య కార్యక్రమాలను పర్యవేక్షించడానికి ప్రజా ఆరోగ్య విభాగం ఒక మొబైల్ అప్లికేషన్ను అభివృద్ధి చేస్తోంది

·    అత్యవసర కిరాణా సరుకులు విక్రయించే దుకాణాల వివరాలను సామాజిక మాధ్యమం ద్వారా తెలియజేస్తున్నారు. అవసరమైన, కిరాణా సరుకులకు సంబంధించిన పిర్యాదులు స్వీకరించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక హెల్ప్ డెస్క్ ఫోన్ నెంబర్లు 0891 - 2869106, 2869110 అందరికీ తెలియజేయడమైంది.  

·       ట్విట్టర్ / ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా హెచ్చరికలు / జాగ్రత్తల సందేశాలు ప్రచారం చేయడం జరుగుతోంది.  

****


(Release ID: 1620155) Visitor Counter : 229