భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ

దక్షిణ అండమాన్ సముద్రం ఉపరితలం పైన మరియు ఆగ్నేయ బంగాళాఖాతాన్ని అనుకుని అల్పపీడనం ఆవరించి ఉంది.

Posted On: 01 MAY 2020 12:39PM by PIB Hyderabad

దక్షిణ అండమాన్ సముద్రం ఉపరితలం పైనా, ఆగ్నేయ బంగాళా ఖాతం ఆనుకుని ఈరోజు (01.05.2020 తేదీ) ఉదయం అల్పపీడనం ఏర్పడినట్లు భారతవాతావరణ శాఖ, తుఫాను హెచ్చరికల విభాగం తెలియజేసింది. ఇది చాలా నెమ్మదిగా, ఆలస్యంగా బలపడే అవకాశం ఉంది

దీని ప్రకారం, వచ్చే 48 గంటల్లో ఇదే ప్రాంతంలో ఇది మరింతగా గుర్తింపబడే అవకాశముంది. ఆ తర్వాత 48 గంటల్లో ఇది మరింత బలపడి అండమాన్ సముద్రం మరియు ఆగ్నేయ బంగాళా ఖాతం ఆనుకుని వాయుగుండంగా మారి ఆ తర్వాత మరింతగా తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది.  మే 5వ తేదీ వరకు ఇది క్రమంగా ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. 

దీని ప్రభావంతో, వచ్చే ఐదు రోజుల్లో,  దక్షిణ అండమాన్ సముద్రం పైనా  మరియు ఆగ్నేయ బంగాళాఖాతం ఆనుకుని  అలాగే అండమాన్, నికోబార్ దీవుల్లో దిగువ పేర్కొన్న విధంగా వాతావరణ ప్రతికూలతలు ఏర్పడవచ్చు. 

హెచ్చరికలు: 

(i)  వర్షపాతం (దీవుల పైన): 

మే నెల ఒకటి, రెండు తేదీలలో అండమాన్, నికోబార్ దీవుల్లో చాలా చోట్ల తేలికపాటి నుండి ఓ మాదిరి వర్షాలు కురుసే సూచనలున్నాయి. మే నెల మూడు, నాలుగు తేదీల్లో  కూడా చాలా ప్రదేశాల్లో వర్షం పడే అవకాశం ఉంది.  నికోబార్ దీవుల్లో అక్కడక్కడా మే నెల రెండు, మూడు తేదీల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయి.  కాగా, మే నెల నాలుగు, ఐదు తేదీల్లో, అండమాన్, నికోబార్ దీవుల్లో అక్కడక్కడా భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. 

(ii)  ఈదురు గాలుల హెచ్చరిక:  

మే నెల ఒకటవ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతం లో గంటకు 40-50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.  మే నెల రెండు, మూడు తేదీలలో ఆగ్నేయ బంగాళాఖాతం తో పాటు దక్షిణ అండమాన్ సముద్రంపై కూడా గంటకు 40-50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.   మే నెల 4వ తేదీన దక్షిణ అండమాన్ సముద్రం మరియు ఆగ్నేయ బంగాళా ఖాతం తీరం వెంబడి గంటకు 45-55 నుండి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.   అదేవిధంగా, మే నెల 5వ తేదీన దక్షిణ అండమాన్ సముద్రం మరియు ఆగ్నేయ బంగాళా ఖాతం తీరం వెంబడి గంటకు 50-60 నుండి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.   

(iii) సముద్రం పరిస్థితి :

2020 మే నెల ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు దక్షిణ అండమాన్ సముద్రం మరియు ఆగ్నేయ బంగాళా ఖాతం అల్లకల్లోలంగా ఉంటుంది

(iv) మత్స్యకారులకు హెచ్చరిక: 

మత్స్యకారులు 2020 మే నెల ఒకటవ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలోకి చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు.  అదేవిధంగా 2020 మే నెల రెండు, మూడు తేదీల్లో దక్షిణ అండమాన్ సముద్రం మరియు ఆగ్నేయ బంగాళాఖాతంలోనూ, 2020 మే నెల నాలుగు, ఐదు తేదీల్లో అండమాన్ సముద్రం మరియు ఆగ్నేయ బంగాళాఖాతంలోనూ చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను హెచ్చరిస్తున్నారు. 

తాజా సమాచారం కోసం దయచేసి చూడండి : 

     www.rsmcnewdelhi.imd.gov.in   

     www.mausam.imd.gov.in 

*****



(Release ID: 1619991) Visitor Counter : 199