పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
కోవిడ్ 19పై భారతదేశం సాగిస్తున్న పోరాటానికి మద్దతుగా లైఫ్ లైన్ ఉడాన్ కింద తిరిగిన 415 విమానాలు
Posted On:
30 APR 2020 6:54PM by PIB Hyderabad
లైఫ్‌లైన్ ఉడాన్ కింద ఎయిర్ ఇండియా,అలయెన్స్ ఎయిర్, ఐఎఎఫ్, ప్రైవేటు విమానయాన సంస్థలు 415 విమానాలను నడిపాయి. ఇందులో 241 విమానాలను ఎయిర్ ఇండియా, అలయెన్స్ ఎయిర్ నడిపాయి. ఇప్పటివరకు రవాణా చేసిన కార్గో 779.86 టన్నుల. లైఫ్ లైన్ ఉడాన్ విమానాలు ఇప్పటివరకూ తిరిగిన గగనతల దూరం 4,07,139 కిలోమీటర్లకు పైనే ఉంది. లైఫ్ లైన్ ఉడాన్ విమానాలను పౌరవిమానయాన మంత్రిత్వశాఖ కోవిడ్ -19 పోరాటంలో భాగంగా, అత్యావశ్యక మందులకు సంబంధించిన సరకు రవాణాను దేశంలోని మారుమూల ప్రాంతాలకు రవాణా చేస్తోంఇ.
పవన్ హన్స్ 2020 ఏప్రిల్ 29 వరకు 7,257 కిలోమీటర్ల దూరం తిరిగి 2.0 టన్నుల సరుకును గమ్యస్థానాలకు చేర్చింది. ఈశాన్య ప్రాంతం, ద్వీప భూభాగాలు ,కొండ రాష్ట్రాలపై ఈ సందర్భంగా ప్రత్యేక దృష్టి పెట్టారు. పవన్ హన్స్ లిమిటెడ్‌తో సహా హెలికాప్టర్ సేవలు జమ్ము కాశ్మీర్, లద్దాక్,కొన్ని ద్వీపాలు ఈశాన్య ప్రాంతాలలో క్లిష్టమైన వైద్య సరుకులను, రోగులను తరలించడానికి వినియోగిస్తున్నారు. ఎయిర్ ఇండియా , ఐఎఎఫ్, ప్రధానంగా జమ్ము కాశ్మీర్ ,లద్దాక్ ఈశాన్య , ఇతర ద్వీప ప్రాంతాలకు తమ సేవలు అందించాయి.
దేశీయ కార్గో ఆపరేటర్లయిన స్పైస్‌జెట్, బ్లూడార్ట్, ఇండిగో, విస్తారాలు వాణిజ్య పరంగా కార్గో విమానాలు నడుపుతున్నాయి. స్పైస్ జెట్ 683 కార్గో విమానాలు 11,84,107 కిలోమీటర్ల దూరం ప్రయాణించి 4,940 టన్నుల సరుకును చేరవేశాయి.. వీటిలో 245 అంతర్జాతీయ కార్గో విమానాలు ఉన్నాయి. బ్లూ డార్ట్ 235 కార్గో విమానాలు 2,53,631 కిలోమీటర్ల దూరం ప్రయాణించి 3,932 టన్నుల సరుకును చేరవేశాయి. వీటిలో 12 అంతర్జాతీయ కార్గో విమానాలున్నాయి. ఇండిగో 64 కార్గో విమానాలు 1,01,989 కిలోమీటర్ల దూరం తిరిగి 269 టన్నుల సరుకును చేరవేశాయి. ఇందులో 18 అంతర్జాతీయ విమానాలు. ప్రభుత్వం కోసం ఉచితంగా తీసుకు వెళ్లిన వైద్య సామాగ్రి కూడా ఇందులో ఉంది. విస్టారా 17 కార్గో విమానాలు 24,141 కిలోమీటర్ల దూరం ప్రయాణించి 123 టన్నుల సరుకును తీసుకువెళ్లాయి..
అంతర్జాతీయ రంగంలో,ఔషధాలు, వైద్య పరికరాలు కోవిడ్ -19 మహమ్మారిపై పోరాటానికి సహాయం చేసేందుకు ఉద్దేశించిన సరకుల రవాణా కోసం తూర్పు ఆసియాతో కార్గో ఎయిర్ బ్రిడ్జ్ ని ఏర్పాటు చేశారు. ఎయిర్ ఇండియా తీసుకువచ్చిన వైద్య సరుకుల పరిమాణం 729 టన్నులు.
పైన పేర్కొన్న వాటికి అదనంగా, గ్వాంగ్జౌ , షాంఘైల నుండి ఏప్రిల్ 14 నుండి 2020 ఏప్రిల్ 29 వరకు బ్లూ డార్ట్ 114 టన్నుల వైద్య సామాగ్రిని తరలించింది. స్పైస్‌జెట్, షాంఘై గ్వాంగ్జౌ నుండి 153 టన్నుల వైద్య సామాగ్రిని 29 ఏప్రిల్ 2020 వరకు తరలించింది. అలాగే 13 టన్నుల వైద్య సామాగ్రిని . హాంగ్ కాంగ్ సింగపూర్ నుండి 25 ఏప్రిల్ 2020 వరకు. తరలించింది.
(Release ID: 1619833)