పర్యటక మంత్రిత్వ శాఖ

కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 11వ వెబినార్‌ నిర్వహణ "ఇతిహాసపు భారత్‌ - అనేక కథల భూమి" పేరిట వెబినార్‌ "దేఖో అప్నా దేశ్‌" అంశంతో వెబినార్‌ సిరీస్ కొనసాగింపు

"న్యూ ఏజ్‌ ఉమెన్‌ ఇన్‌ రెస్పాన్సిబుల్‌ టూరిజం" పేరిట 30వ తేదీన మరో వెబినార్‌

Posted On: 29 APR 2020 12:49PM by PIB Hyderabad

"ఇతిహాసపు భారత్‌ - అనేక కథల భూమి" ( యాన్‌ ఎపిక్‌ కాల్డ్‌ ఇండియా- ఏ ల్యాండ్‌ ఆఫ్‌ మైరియడ్‌ స్టోరీస్‌ ) పేరిట 28 ఏప్రిల్‌ 2020న కేంద్ర పర్యాటక శాఖ వెబినార్‌ నిర్వహించింది. "దేఖో అప్నా దేశ్‌" అంశంతో, పర్యాటక పరిశ్రమ మరియు ప్రేక్షకులతో కొనసాగుతున్న వెబినార్‌ సిరీస్‌లో ఇది పదకొండవది. దేశంలోని అనేక పర్యాటక ప్రాంతాలపై అవగాహన, అభివృద్ధి దీని లక్ష్యం. ప్రాముఖ్యత పొందని ప్రాంతాలు, ప్రాముఖ్యత పొందిన ప్రాంతాల్లో పర్యాటకులకు తెలియని కొత్త కోణాలను వివరించడం కూడా వెబినార్‌ ఉద్దేశం.


పర్యాటక నిపుణుల అనుభవాలతో వెబినార్‌

    భారత్‌లోని అనేక ప్రాంతాలకు సంబంధించిన కొత్త, ఎప్పుడూ వినని అనుభవాలను ప్రేక్షకులకు చెప్పి వారిలో అవగాహన పెంచడానికి
కొందరు ఉత్తమ పర్యాటక నిపుణులను, నగర మరియు వారసత్వ అంశాలతో నడక కార్యక్రమాలు నిర్వహించేవారిని, కథకులను "దేఖో అప్నా దేశ్‌ వెబినార్‌ సిరీస్‌" పొందగలిగింది. 28 ఏప్రిల్‌ 2020న, 'రేర్‌ ఇండియా' వ్యవస్థాపకురాలు శ్రీ శోభామోహన్‌ పదకొండో వెబినార్‌ నిర్వహించారు. భారత్‌లోని పర్యాటక ప్రాంతాలు, అనుభవాలను ఆమె వివరించారు. భారత్‌లోని గ్రామాలు, కుగ్రామాలు, నగరాల్లో ఇప్పటికీ గుప్తంగా ఉన్న విభిన్న ఆచారాలు, వారసత్వాలు, చరిత్ర గురించి చెప్పారు. 

     'డిజిటల్‌ ఇండియా ఇనీషియేటివ్‌' కార్యక్రమంలో భాగంగా ఈ తరహా వర్చువల్‌ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు, కేంద్ర పర్యాటక శాఖ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ శ్రీ రూపిందర్‌ బ్రార్‌ వెల్లడించారు. "దేఖో అప్నా దేశ్‌ వెబినార్‌ సిరీస్‌" నిర్వహణలో, కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ మరియు సమాచార సాంకేతిక శాఖకు చెందిన జాతీయ ఈ-గవర్నెన్స్‌ డివిజన్‌ (NeGD) కీలక పాత్ర పోషిస్తోంది. నిపుణులు, కథకులు, పౌరులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా డిజిటల్‌ వేదిక ద్వారా వెబినార్‌లో పాల్గొనేలా నిపుణుల బృందంతో సాంకేతిక సాయం అందిస్తోంది.

పాత వెబినార్లను పొందే అవకాశం
    వెబినార్‌ సెషన్లలో పాల్గొనలేకపోయిన వారు, https://www.youtube.com/channel/UCbzIbBmMvtvH7d6Zo_ZEHDA/featured ద్వారా పాతవాటిని పొందవచ్చు. కేంద్ర పర్యాటక శాఖకు చెందిన అన్ని సామాజిక మాధ్యమాల్లోనూ వీటిని అందుబాటులో ఉంచారు. 30 ఏప్రిల్‌ 2020న, ఉదయం 11 గంటలకు "న్యూ ఏజ్‌ ఉమెన్‌ ఇన్‌ రెస్పాన్సిబుల్‌ టూరిజం" పేరిట వెబినార్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో పాల్గొనాలనుకునేవారు https://bit.ly/WebinarNewAgeWomen లింకుపై క్లిక్‌ చేసి పేర్లు నమోదు చేసుకోవచ్చు.



(Release ID: 1619215) Visitor Counter : 183