జల శక్తి మంత్రిత్వ శాఖ
రానున్న వర్షాకాలనికి సన్నద్ధమవుతున్న ‘జల్ శక్తి అభియాన్’
Posted On:
28 APR 2020 7:07PM by PIB Hyderabad
కోవిడ్-19 వైరస్ వ్యాప్తి కారణంగా ఏర్పడిన ప్రస్తుత ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కోవడంతో పాటు వివిధ విభాగాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వూతం ఇవ్వడానికి ‘జల్ శక్తి అభియాన్’ సర్వ సన్నద్ధమైంది. ఈ ఏడాది కోవిడ్-19 అత్యవసర పరిస్థితితో దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో భారీగా శ్రామిక శక్తి అందుబాటులో ఉంది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని అభియాన్ రాబోయే వర్షాకాలం నిమిత్తం సన్నద్ధమైంది. ఈ నేపథ్యంలో గ్రామీణాభివృద్ధి శాఖ, జల వనరుల శాఖ, నదీ అభివృద్ధి, గంగా నది పునరుజ్జీవనం విభాగం, భూ వనరుల శాఖ మరియు తాగు నీరు మరియు పారిశుద్ధ్య శాఖలు తొలిసారిగా సంయుక్త అడ్వైజరీని జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులనుద్దేశిస్తూ ఇందులో మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ సంవత్సరం రానున్న వర్షాకాలన్ని దృష్టిలో ఉంచుకొని మన దేశానికి అత్యంత ప్రాముఖ్యమైన నీటి సంరక్షణ, భూగర్బ జలాల రీఛార్జ్ పనుల కోసం తగిన సన్నాహాలు చేయాల్సిందిగా అభియాన్ సూచించింది.
అభియాన్ నేతృత్వంలో ఆరున్నర కోట్లకు పైగా ప్రజలు..
దేశంలో గత ఏడాది జల్ శక్తి అభియాన్ ప్రారంభించబడింది. దేశవ్యాప్తంగా 256 నీటి ఒత్తిడితో కూడిన జిల్లాలలో సమస్య తీవ్రత తగ్గించే చర్యలు చేపట్టింది. ‘అభియాన్’ దేశ వ్యాప్తంగా నీటి పరిరక్షణ చర్యలలో నిమగ్నమై ఉన్న అన్ని భాగస్వామ్య పక్షాల వారందరినీ ఒక గూటికిందకు తీసుకువచ్చింది. గత సంవత్సరం ఇది తన కార్యకలాపాలతో దేశ వ్యాప్తంగా మంచి ప్రభావాన్ని కనబరిచింది. ఈ అభియాన్ కింద ఆరున్నర కోట్లకు పైగా ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, సివిల్ సొసైటీ సంస్థలు, పంచాయతీ రాజ్ సంస్థలు మరియు సంఘాలున్నాయి.
డెబ్బై ఐదు లక్షలకు పైగా సంప్రదాయ ఇతర నీటి వనరులు, చెరువుల పునరుద్ధరణ..
అభియాన్ కింద ఇప్పటి వరకు దాదాపు డెబ్బై ఐదు లక్షలకు పైగా సంప్రదాయ ఇతర నీటి వనరులు, చెరువులు పునరుద్ధరించబడ్డాయి. దీనికి తోడు ఒక కోటి వరకు నీటి సంరక్షణ మరియు వర్షపు నీటి సేకరణ, సంరక్షణ నిర్మాణాలు కూడా చేపట్టబడ్డాయి. గతేడాది లభించిన స్పందనతో ప్రోత్సహించబడిన అభియాన్ ఈ సంవత్సరానికి విస్తృత మరియు మరింత సమీకృత వ్యూహాన్ని రూపొందించింది. అయితే ప్రస్తుత ఆరోగ్య అత్యవసర పరిస్థితుల కారణంగా ఈ వేసవిలో కేంద్ర ప్రభుత్వం తన అధికారులను అభియాన్ కార్యక్రమాలకు మోహరించలేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని, ఈ ఏడాది వర్షా కాలంలో వాన నీటిని ఒడిసిపట్టుకొనేందుకు గాను అందుబాటులో ఉన్న అన్ని వనరులను సముచితంగా మోహరించేలా చూడడంతో పాటుగా అవసరమైన అన్ని సన్నాహక కార్యకలాపాలు కూడా చక్కగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఎంఎన్‌సీఆర్‌జీఎస్ కింద తాగునీరు మరియు పారిశుధ్య పనులు..
దేశంలో లాక్‌డౌన్ అమలులో ఉన్న సమయంలో ఎంఎన్‌సీఆర్‌జీఎస్ కింద తాగునీరు మరియు పారిశుధ్య పనులను చేపట్టడానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. నీటిపారుదల మరియు నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యత ఇస్తూ వీటిని చేపట్టేందుకు అనుమతిచ్చింది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ నీటి పారుదల మరియు నీటి సంరక్షణ పథకాలను కూడా ఎంఎన్‌సీఆర్‌జీఎస్ కింద చేపట్టే వివిధ పనులతో అనుసంధానం చేసి అమలు చేయడానికి కూడా హోం శాఖ అనుమతించింది. కోవిడ్- 19 వైరస్ నేపథ్యంలో సామాజిక దూరం, ఫేస్ కవర్లు / ముసుగులు మరియు ఇతర అవసరమైన జాగ్రత్తలను కఠినంగా అమలు చేయడం ద్వారా అన్ని పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. సంప్రదాయ నీటి వనరుల పునర్ వ్యవస్థీకరించడం, నీటి వనరుల్లో ఆక్రమణలను తొలగించడం, సరస్సులు మరియు చెరువుల్లో పూడికలను తీయడం, ఇన్‌లెట్లు, అవుట్‌లెట్ల నిర్మాణం పరీవాహక ప్రాంతాలను మెరుగుపరచడం వంటి పనులను తగిన ప్రాధాన్యతతో తీసుకోనేలా వెసులుబాటు కల్పించడమైంది. అదే విధంగా, స్థానిక సంఘాల వారితో నడిచే రివర్ బేసిన్ మేనేజ్మెంట్ పద్ధతుల ద్వారా చిన్న నదుల పునరుజ్జీవనం కూడా ప్రారంభించవచ్చు. ఇటువంటి కార్యకలాపాలు గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరుల స్థిరంగా అందుబాటులో ఉండేలా చేస్తుంది. ఇది జల్ శక్తి మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న జల్ జీవన్ మిషన్‌ను బలోపేతం చేస్తుంది. దీనికి తోడు స్థానిక సంఘం జల్ జీవన్ మిషన్ కోసం తయారుచేసిన విలేజ్ యాక్షన్ ప్లాన్ (వీఏపీ) గ్రామీణ స్థాయిలో చేపట్టాల్సిన కార్యకలాపాలకు బలమైన దృఢమైన చట్రాన్ని అందిస్తుంది.
***
(Release ID: 1619089)
Visitor Counter : 288