ఆర్థిక మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 తక్షణ ప్రతిస్పందనకు మద్దతుగా ఎడిబితో 1.5 బిలియన్ల రుణానికి సంతకం చేసిన భారత్
Posted On:
28 APR 2020 4:50PM by PIB Hyderabad
నోవెల్ కరోనావైరస్ వ్యాధి (COVID-19) ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తోడ్పడేందుకు 1.5 బిలియన్ డాలర్ల రుణంపై భారత ప్రభుత్వం , ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) ఈ రోజు సంతకం చేశాయి, సమాజంలోని పేదలు, ఆర్థికంగా బలహీన వర్గాలకు, ముఖ్యంగా మహిళలు , వెనుకబడిన వర్గాలకు సామాజిక రక్షణకల్పించడంతోపాటు వ్యాధి నిరోధం , నివారణ వంటి తక్షణ ప్రాధాన్యతలపై ఇవి దృష్టి సారించాయి.
ఎడిబి, కోవిడ్ 19 యాక్టివ్ రెస్పాన్స్ అండ్ ఎక్స్‌పెండిచర్ సపోర్ట్ ప్రోగ్రాం (CARES ప్రోగ్రామ్) కోసం రుణ ఒప్పందంపై సంతకం చేసిన వారిలో ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగంలో అదనపు కార్యదర్శి (ఫండ్ బ్యాంక్ , ఎడిబి) శ్రీసమీర్ కుమార్ ఖరే , ఇండియాలో ఎడిబి కంట్రీ డైరక్టర్ కెనిచి యోకోయామా ఉన్నారు.
అంతకుముందు, ఎడిబి బోర్డు డైరక్టర్లు, కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రజలపై పడే ప్రతికూల ఆరోగ్యం సామాజిక-ఆర్ధిక ప్రభావాన్ని ఎదుర్కోవడం , దాని తీవ్రతను తగ్గించడంలో ప్రభుత్వానికి బడ్జెట్ సహాయాన్ని అందించేందుకు రుణాన్ని ఆమోదించింది
"కరోనావైరస్ మహమ్మారిపై పోరాటంలో ప్రభుత్వం తీసుకునే తక్షణ ప్రతిస్పందన చర్యలైన, (i) కోవిడ్ పరీక్ష-గుర్తింపు- చికిత్స సామర్థ్యాన్ని వేగంగా పెంచడానికి కోవిడ్ -19 నియంత్రణ ప్రణాళిక,(ii) రాబోయే మూడు నెలల్లో 800 మిలియన్ల మందికి పైగా ప్రజలను రక్షించడానికి పేదలు, నిస్సహాయవర్గాలు, మహిళలకు సామాజిక రక్షణ కు ఎడిబి సకాలంలో అందించిన సహాయానికి కృతజ్ఞతలు,” అని శ్రీ ఖరే అన్నారు."ఎడిబి అందించే ఆర్ధిక , సాంకేతిక సహకారం 2020 మార్చి లో ప్రారంభించిన ప్రభుత్వ అత్యవసర ప్రతిస్పందన కార్యక్రమాల మంచి అమలుకు దోహదం చేస్తుంది."
“ కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి , అలాగే ఒక ప్రాంతంనుంచి మరొక ప్రాంతానికి వెళ్లడానికి గల పరిమితుల కారణంగా ప్రభావితులైన పేద ప్రజలను రక్షించడానికి,భారతదేశం తీసుకున్న సాహసోపేతమైన చర్యలకు మద్దతుగా వేగంగా స్పందించి భారతదేశానికి అతిపెద్ద రుణాన్ని అందించడం పట్ల ఎడిబి ఆనందం వ్యక్తం చేస్తోంది. ఆరోగ్య సేవలు సామాజిక రక్షణ కార్యక్రమాల పర్యవేక్షణ , మూల్యాంకన వ్యవస్థలతో సహా అమలు ఫ్రేమ్‌వర్క్ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వంతో కలసి పనిచేస్తాం, తద్వారాఈ ప్రయోజనాలు పేదలు, మహిళలు ఇతర వెనుకబడిన ప్రజలకు చేరుతాయి అని యోకోయామా అన్నారు.
అంతకుముందు, 2020 ఏప్రిల్ 9న ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ నిర్మలా సీతారామన్, ఎడిబి గవర్నర్‌తో జరిపిన టెలిఫోన్ సంభాషణలో ,ఎడిబి అధ్యక్షుడు శ్రీ మసత్సుగుఅసకావా, కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థపై పడిన ప్రభావాన్ని తగ్గించడం, భారతదేశ అత్యవసర ఆరోగ్య రంగ అవసరాలు తీర్చడానికి ఎడిబి నిబద్దతను తెలియజేశారు. అలాగే అందుబాటులో ఉన్న అన్ని ఫైనాన్సింగ్ ప్రత్యామ్నాయాలను అన్వేషించడం ద్వారా దేశ డైనమిక్ ఆర్థిక వృద్ధిని పునరుద్ధరించనున్నట్టు చెప్పారు. CARES ప్రోగ్రామ్ ప్రభుత్వ తక్షణ అవసరాలను తీర్చడానికి మొదటి మద్దతుగా అందించడం జరుగుతుందన్నారు.
కేర్స్ (CARES) ప్రోగ్రాంను చేపట్టడం ద్వారా, ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు, బలమైన వృద్ధి పునరుద్ధరణకు అండగా ఉండడానికి ,భవిష్యత్ లో ఎదురయ్యే షాక్‌ల నుంచి తట్టుకొనే సామర్ధ్యం పెంపొందించడానికి అవసరమైన మరింత మద్దతు ఇవ్వడం కోసం ప్రభుత్వంతో ఎడిబి చర్చలు జరుపుతోంది. క్రెడిట్ గ్యారెంటీ పథకాల ద్వారా ఆర్థిక సదుపాయాన్ని సులభతరం చేయడం ద్వారా ప్రభావిత పరిశ్రమలు , వ్యవస్థాపకులకు ముఖ్యంగా సూక్ష్మ, చిన్న , మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఇ) మద్దతు, వ్యాపార అభివృద్ధి కేంద్రాల ద్వారా ప్రపంచ జాతీయ వాల్యూ చెయిన్‌లోకి ఎంఎస్‌ఎంఇల అనుసంధానం, క్రెడిట్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు మెరుగుదల సౌకర్యం వంటివి ఇందులో ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో సమగ్ర ప్రాధమిక ఆరోగ్య సేవలను విస్తరించడం , పిపిపి పద్ధతుల ద్వారా సెకండరీ ,అత్యంత ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలతో సహా ప్రజా సేవల అంబాటును బలోపేతం చేయడం మరొక ముఖ్యమైన ఎజెండా గా ఉంటుంది.
కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి ని అరికట్టడానికి, భారతదేశం అనేక నిర్ణయాత్మక చర్యలు తీసుకుంది, ఆసుపత్రి సౌకర్యాలను విస్తరించడానికి 2 బిలియన్ డాలర్లను ఆరోగ్య రంగంపై ఖర్చు చేసే కార్యక్రమం అలాగే, టెస్ట్-ట్రాక్-చికిత్స సామర్థ్యాన్ని పెంచడం , ప్రత్యక్ష నగదుబదిలీ చేపట్టడానికి 23 బిలియన్ డాలర్లమేరకు పేదల అనుకూల ప్యాకేజీని ప్రారంభించడం. ప్రాథమిక వినియోగ వస్తువులు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లను పేదలకు, ముఖ్యంగా మహిళలు, వయోధికులు, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు అందించడం వంటి ఎన్నో చర్యలను తీసుకుంది
కోవిడ్ -19 పై పోరాటంలో నిమగ్నమైన ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలకు ప్రభుత్వం బీమా సౌకర్యాన్నికూడా విస్తరించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పాలసీ రేట్లను తగ్గించింది, అసెట్ క్వాలిటీ ప్రమాణాలను సడలించింది, రుణ మారటోరియం కల్పించింది., ఎగుమతిదారులకు మద్దతు ఇవ్వడానికి చర్యలు తీసుకుంది.వారి ఫైనాన్సింగ్ అవసరాలను తీర్చడానికి రాష్ట్రాలు ఎక్కువ రుణాలు తీసుకోవడానికి అనుమతించింది. బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్‌తో పాటు ఎంఎస్‌ఎంఇలు ,కార్పొరేట్ రంగానికి నిధుల అందుబాటు పెంచడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఇది భారీ లిక్విడిటీని పెంచింది.
అత్యంత పేదరికాన్ని నిర్మూలించడానికి ఎ.డి.బి తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే, సుసంపన్నమైన, సమ్మిళిత, సుస్థిర, తిరిగి పుంజుకోగల ఆసియా పసిఫిక్ ను సాధించడానికి కట్టుబడి ఉంది. 1966 లో స్థాపించబడిన ఈ సంస్థ 49 ప్రాంతాలకు చెందిన, 68 మంది సభ్యులకు చెందినది.
****
(Release ID: 1619088)
Visitor Counter : 329
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam