ప్రధాన మంత్రి కార్యాలయం

ఇండోనేశియా అధ్యక్షుని కి మరియు ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ కి మ‌ధ్య టెలిఫోన్ ద్వారా జరిగిన సంభాష‌ణ‌

Posted On: 28 APR 2020 3:27PM by PIB Hyderabad

ఇండోనేశియా అధ్యక్షుడు మాన్య శ్రీ జోకో విడోడో తో ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ ఈ రోజు న టెలిఫోన్‌ లో మాట్లాడారు. 

కోవిడ్-19 విశ్వమారి ప్రపంచం అంతటా ప్రబలుతూ ఉండడాన్ని గురించి ఉభయ నేత లు వారి వారి ఆలోచనల ను ఒకరి తో మరొకరు వెల్లడించుకొన్నారు. 

ఇండోనేశియా కు ఔషధ ఉత్పత్తుల ను సరఫరా చేయడం ద్వారా భారత ప్రభుత్వం సౌలభ్యం కల్పించడాన్ని ఇండోనేశియా అధ్యక్షుడు ప్రశంసించారు.  ఔషధీయ సామగ్రి సరఫరాల లో గాని లేదా ఇరు దేశాల మధ్య వ్యాపారం జరిగే ఇతర వస్తువుల సరఫరాల లో గాని ఎటువంటి అంతరాయం తలెత్తకుండా నివారిచడం లో భారతదేశం శాయశక్తుల సాయపడుతుందంటూ ఆయన కు ప్ర‌ధాన‌ మంత్రి హామీ ని ఇచ్చారు.

నేత లు ఇరువురూ తమ తమ దేశాల లోని పౌరుల కు సంబంధించిన అంశాల ను గురించి చర్చించి, ఈ విషయం లో సాధ్యమైనంత వరకు సదుపాయ సంధానానికై వారి వారి బృందాలు పరస్పరం సంప్రదింపులు జరుపుకొంటూ ఉండాలి అని వారు సమ్మతించారు.
 
భారతదేశం తో సముద్ర ప్రాంతం పరం గా విస్తారిత పొరుగు దేశం గా ఇండోనేశియా ఉంటూ భారత్ కు సముద్ర సంబంధిత ముఖ్య భాగస్వామ్య దేశాల లో ఒకటి గా ఉందన్న వాస్తవాన్ని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. అంతే కాక,  ద్వైపాక్షిక సంబంధాల యొక్క బలం ప్రపంచవ్యాప్త వ్యాధి ‘కోవిడ్-19’ యొక్క ప్రభావాల ను ఎదుర్కొని పోరాడడం లో  ఉభయ దేశాల కు సహాయకారి కాగలదని కూడా ఆయన అన్నారు.

స్నేహశీలురైనటువంటి ఇండోనేశియా ప్రజల కు మరియు అధ్యక్షుడు మాన్య శ్రీ విడోడో కు పవిత్ర మాసం ‘రంజాన్’ ను పురస్కరించుకొని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు. 


***(Release ID: 1618999) Visitor Counter : 36