గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 వ్యాప్తి నియంత్రణకు సున్నితమైన ప్రాంతాలను శుభ్రపరించేందుకు డ్రోన్లన ఉపయోగిస్తున్న వారణాసి స్మార్ట్ సిటీ

Posted On: 27 APR 2020 7:07PM by PIB Hyderabad

స్మార్ట్ సిటీస్ మిషన్ ఆధ్వర్యంలో వారణాసి నగరంలోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో శానిటైజర్ చల్లడం కోసం చెన్నైకి చెందిన గరుడ ఏరో స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను వారణాసి స్మార్ట్ సిటీ నియమించింది. లాక్ డౌన్ కాలంలో రవాణా సౌకర్యాల విషయంలో ఉండే ఇబ్బందుల దృష్ట్యా ఈ డ్రోన్లను ప్రత్యేకంగా పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ ప్రత్యేక అనుమతితో చెన్నై నుంచి ఎయిర్ ఇండియా కార్గో విమానాల ద్వారా విమాన మార్గంలో పంపారు. రెండు డ్రోన్లతో మొత్తం ఏడుగురు సభ్యుల బృందం కార్యాచరణ మొదలు పెట్టింది. 2020 ఏప్రిల్ 17న ట్రయల్ రన్ కూడా పూర్తైంది.

 

 

జిల్లా పరిపాలన విభాగం లేదా చీఫ్ మెడికల్ ఆఫీసర్ గుర్తించిన హాట్ స్పాట్స్ మరియు కంటెయిన్ మెంట్ ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా శానిటైజర్ చల్లడానికి ప్రాధాన్యత ఇచ్చారు. దీని తర్వాత ఐసోలేషన్ ప్రాంతాలకు డ్రోన్స్ ద్వారా శానిటైజర్ చల్లుతారు. అనంతర ప్రాధాన్యత ఐసోలేషన్ ప్రాంతాలు, నిర్బంధ ప్రాంతాలు, షెల్టర్ హోమ్స్ మరియు మాన్యువల్ స్ప్రే చేయడం కష్టంగా ఉన్న ఇతర ప్రదేశాలకు ఇస్తారు. డ్రోన్ లను మోహరించాల్సిన ప్రాంతాలను వారణాసి నగర్ నిగమ్ అధికారుల బృందం నిర్ణయిస్తుంది.

డ్రోన్ బృందం మొదట రోజు పరిశుభ్రపరచాలి అనుకున్న ప్రాంతాన్ని సందర్శిస్తుంది. భూభాగం, భవనాలు మరియు పరిసరాల గురించి శీఘ్రగతిన సర్వే చేస్తుంది. డ్రోన్ అనుసరించాల్సిన మార్గాన్ని మార్క్ చేసుకుంటుంది. 1% సోడియం హైపోక్లోరైట్ [NaOCl] ను కలిగిఉన్న రసాయన ద్రావణంతో డ్రోన్ నిండి ఉంటుంది. అనంతరం డ్రోన్లు క్రమాంకనం చేయబడి, ఎగరడానికి సిద్ధంగా ఉంటాయి. ప్రణాళికాబద్ధమైన విమాన మార్గంలో అనుభవజ్ఞులైన డ్రోన్ పైలట్లు రిమోట్ – కంట్రోల్ పరికరాన్ని ఉపయోగించి డ్రోన్ లను ఎగురవేస్తారు. అదే సమయంలో శానిటైజర్ ను దాని నాలు నాజిల్స్ ద్వారా చల్లడం జరుగుతుంది. చల్లిన ప్రతి సారి సుమారు 15 నుంచి 20 నిముషాల వరకూ కెమికల్ ని రీఫిల్ చేయడానికి బ్యాటరీ ప్యాక్ స్థానంలోకి డ్రోన్లను వెనుకకు తీసుకొస్తారు. చల్లడం తిరిగి ప్రారంభించేందుకు డ్రోన్లను మళ్లీ తదుపరి స్థానాలకు తీసుకువెళతారు.

ముందుగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో డ్రోన్ లు ఎగురుతున్న మార్గాలు నియంత్రణలో ఉంటాయి. బ్యాక్ ఎండ్ లో జి.ఐ.ఎస్. మ్యాప్ సాయంతో రిమెట్ కంట్రోలర్ ద్వారా నియంత్రించబడతాయి.

డ్రోన్ ఆపరేషన్ల కోసం ఉపయోగించే వాహనాలు జి.పి.ఎస్. మరియు జి.ఎస్.ఎమ్. ఆధారిత వైర్ లెస్ కెమెరాలతో అమర్చబడి ఉంటాయి. వీటిని ఉపయోగించి డ్రోన్ ల మొత్తం కదలికలను మరియు వాటి కార్యకలాపాలు కాశీ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కేంద్రంగా పర్యవేక్షిస్తుంటారు. ఇప్పుడు ఇవి కోవిడ్ -19 వార్ రూమ్ లుగా మార్చబడ్డాయి. నియమించిన ప్రతి ప్రదేశంలో డ్రోన్ ఆపరేషన్లు నిర్వహించడానికి ముందు, తరువాతం శానిటరీ ఇన్స్పెక్టర్ మరియు ఇతర బృంద సభ్యులు నోడల్ అధికారికి నివేదిక అందజేస్తారు.

పరికరాల మూలధన ఖర్చులు సంబంధిత ఏజెన్సీ చేత అందించబడతాయి. అదే విధంగా నగర పరిపాలన కార్యాచరణ వ్యయాలకు (సేవా ఖర్చులు మరియు రసాయన ఖర్చులు ) ఖర్చు చేయవలసి ఉంటుంది. కార్యకలాపాల సగటు వ్యయం ప్రతి డ్రోన్ కు రోజుకు రూ. 8000 నుంచి రూ. 12000 వరకూ ఉంటుంది. ఇది ఆయా ప్రాంతాల వీస్తీర్ణం పై ఆధారపడి ఉంటుంది.

డ్రోన్లు మానవ రహిత వాహనాలు. ఇవి హెలికాఫ్టర్లు ప్రయాణించినట్లు సులభంగా ప్రయాణించగలవు. అంతే కాకుండా ప్రత్యేకంగా రూపొందించిన రిమోట్ కంట్రోల్ ఉపయోగించి శిక్షణ పొందిన సిబ్బంది చేత నడపబడతాయి. వ్యవసాయ ఉపయోగం కోసం పురుగుమందులను పిచికారీ చేయడానికి ప్రత్యేకంగా రూపొందించిన డ్రోన్లు ఇప్పుడు కోవిడ్ -19 మహమ్మారి పరిస్థితుల్లో నిర్బంధ ప్రాంతాలు మరియు ఐసోలేషన్ వార్డుల చుట్టూ క్రిమి సంహారక ద్రవాన్ని చల్లడానికి వినియోగిస్తున్నారు.

 

--(Release ID: 1618889) Visitor Counter : 137