మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

2019లో క్లాస్‌ సెంట్రల్‌ లిస్టులో 'SWAYAM' ఘనత 30 ఉత్తమ ఆన్‌లైన్‌ కోర్సులో 'SWAYAM'కు చెందిన 6 కోర్సులు ఈ వేదికలో దాదాపు 58 లక్షల మంది యూజర్లు

Posted On: 27 APR 2020 6:48PM by PIB Hyderabad

2019 సంవత్సరానికి ఎంపిక చేసిన 30 ఉత్తమ ఆన్‌లైన్‌ కోర్సుల జాబితాను ది క్లాస్‌ సెంట్రల్‌ ( The Class Central ) విడుదల చేసింది. ఇందులో SWAYAM ‍( స్టడీ వెబ్స్‌ ఆఫ్‌ యాక్టివ్‌ లెర్నింగ్‌ ఫర్‌ యంగ్‌ ఆస్పైరింగ్‌ మైండ్స్‌ ) కు చెందిన 6 కోర్సులు స్థానం దక్కించుకున్నాయి. ది క్లాస్‌ సెంట్రల్‌ అనేది స్టాన్‌ఫోర్డ్‌, ఎంఐటీ, హార్వర్డ్‌ విశ్వవిద్యాలయాల తరహాలో ఆన్‌లైన్‌ కోర్సులను నాణ్యతను బట్టి వర్గీకరించి, ట్యాగ్‌ చేసే ఆన్‌లైన్‌ కోర్స్‌.


ఇప్పటివరకు 2867 కోర్సులు

    ఆన్‌లైన్‌ కోర్సుల కోసం SWAYAM ఒక సమగ్ర వేదిక వంటిది. సమాచార, కమ్యూనికేషన్‌ సాంకేతిక (ICT) ను ఉపయోగించుకుని పనిచేస్తుంది. ఇది పాఠశాల (9 నుంచి 12వ తరగతి వరకు ) నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్‌ స్థాయి వరకు కోర్సులను అందిస్తోంది. ఇవాళ్టి వరకు 2867 కోర్సులను SWAYAM అందించింది. 2020 జనవరి సెమిస్టర్‌ కోసం 568 కోర్సులన అప్‌లోడ్‌ చేసింది. ఈ వేదికలో 57,84,770 మంది ప్రత్యేక యూజర్లు/రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. SWAYAM లోని అనేక కోర్సుల కోసం 1.25 కోట్లకు పైగా పేర్లు నమోదయ్యాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ శిక్షకుల కోసం కూడా ఇందులో కోర్సులు ఉన్నాయి. swayam.gov.in ద్వారా ఈ వేదికను చూడవచ్చు.

2019లోని ఉత్తమ 30 ఆన్‌లైన్‌ కోర్సుల్లో SWAYAMకు చెందిన 6 కోర్సులు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
 
1. అకడమిక్ రైటింగ్: H.N.B. గర్వాల్‌ విశ్వవిద్యాలయం ( కేంద్రీయ విశ్వవిద్యాలయం ), శ్రీనగర్‌ గర్వాల్‌

2. డిజిటల్‌ మార్కెటింగ్: పంజాబ్‌ విశ్వవిద్యాలయం, చండీగఢ్‌

3. యానిమేషన్స్‌: బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం

4. మాథమాటికల్‌ ఎకనామిక్స్‌: డూన్‌ విశ్వవిద్యాలయం, డెహ్రాడూన్‌

5. పైథాన్‌ ఫర్‌ డేటా సైన్సెస్‌: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, మద్రాస్‌

6. ఎర్లీ ఛైల్డ్‌హుడ్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ (ECCE): అవినాషిలింగం ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హోమ్‌ సైన్సెస్‌ అండ్‌ హైయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఫర్‌ ఉమెన్‌, కోయంబత్తూర్
 



(Release ID: 1618778) Visitor Counter : 137