సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

కోవిడ్-19 మహమ్మారిని ఒక అవకాశంగా తీసుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషించడానికి ప్రవాస భారతీయ విద్యార్థులు ముందుకు రావాలని పిలుపు నిచ్చిన శ్రీ నితిన్ గడ్కరీ.

దేశవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటువుతున్న రహదారుల వెంట సౌకర్యాలు, బస్సు పోర్టులు నిర్మాణానికి ప్రణాళికలు రూపొందుతున్న నేపథ్యంలో పెట్టుబడులకు భారీ అవకాశాలున్నాయని ఆయన తెలిపారు.


వెబినార్లు, వీడియో కాంఫరెన్సులు, సామాజిక మాధ్యమం ద్వారా పారిశ్రామికవేత్తలు, యువజనులతో సహా 1.3 కోట్ల మందితో శ్రీ గడ్కరీ ఇంతవరకు కలిసి, కోవిడ్-19 నియంత్రణ, నివారణకు ప్రభుత్వం చేస్తున్న కృషిని వారికి తెలియజేసి, వారిలో నైతికతను పెంపొందించారు.

Posted On: 26 APR 2020 10:46PM by PIB Hyderabad

రోడ్డు రవాణా, రహదారులు, ఎమ్.ఎస్.ఎం.ఈ. శాఖల కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గత కొన్ని రోజులుగా సమాజంలోని వివిధ రంగాలు, వివిధ వర్గాల ప్రజలతో వెబినార్లు, వీడియో కాన్ఫరెన్సులు, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ఎక్కువ మంది ప్రజలను కలుసుకునే కార్యక్రమాన్ని చేపట్టారు.  ఈ ప్రయత్నంలో సుమారు 1.30 కోట్ల మంది ప్రజలతో సంప్రదింపులు జరిపే అవకాశం ఆయనకు కలిగింది. 

ఈ పరంపరలో భాగంగా, ఆయన, " విశ్వవ్యాప్తంగా ఉన్న మహమ్మారి పట్ల భారతీయ స్పందన : భారత్ వ్యూహం" అనే అంశంపై యు.కె., కెనడా, సింగపూర్, ఇతర యురోపియన్ దేశాలు, ఆస్ట్రేలియా వంటి వివిధ దేశాల్లోని ప్రవాస భారతీయ విద్యార్థులతో ముచ్చటించారు.  ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఈ ప్రతికూలతను ఒక అవకాశంగా మార్చుకోడానికి సానుకూలపటిష్టమైన చర్యలు తెసుకోవాలని చెప్పారు.  అదే సమయంలో, వివిధ కార్యకలాపాలను పునఃప్రారంభించే సమయంలో, కోవిద్-19 వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తగిన ఆరోగ్య పరమైన సూచనలుజాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంది.  ప్రస్తుత పరిస్థితుల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అయితే, కొన్ని పరిశ్రమలు సామాజిక దూరాన్ని పాటిస్తూ, కార్మికులకు ఆహార సరఫరా ఏర్పాట్లు చేస్తూ, మాస్కులు, సానిటైజర్లు వంటివి తయారు చేస్తున్నాయి. అదేవిధంగా దిగుమతులకు ప్రత్యామ్నాయాలు తయారుచేయడానికి ప్రయత్నించవలసిన అవసరం ఉంది. పెద్ద నగరాలు, మెట్రో పట్టణాలకు దూరంగా కొత్త ప్రాంతాల్లో వ్యాపారాలు, పరిశ్రమలు ప్రారంభించాలి. విదేశాలలోని కొత్త భాగస్వాములతో భారతదేశంలోని కంపెనీలు జాయింట్ వెంచర్లు ప్రారంభించాలని ఆయన సూచించారు.  భారతదేశ అవసరాలు తీర్చడానికి మాత్రమే మన కృషి పరిమితం కాకూడదు, చాలా కంపెనీలు ప్రస్తుతం చైనా ఉత్పత్తులనుండి బయటకు రావాలని భావిస్తున్న తరుణంలో, అంతర్జాతీయ డిమాండును కూడా తీర్చే విధంగా మన కృషి కొనసాగించాలి.  ఈ లక్ష్య సాధనలో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంలో, యువత ముఖ్య భూమిక పోషించాలని, విదేశాలలో చదువుతున్న యువ భారతీయ విద్యార్థులకు ఆయన పిలుపునిచ్చారు. 

దేశంలో 22 గ్రీన్ ఎక్సప్రెస్ హై వేలు అభివ్రుహ్ది చెందుతున్నాయనీ, ఢిల్లీ - ముంబాయి ఎక్సప్రెస్ వే పనులు ప్రారంభమయ్యాయనీ శ్రీ గడ్కరీ తెలియజేశారు. ఫలితంగా, పారిశ్రామిక క్లస్టర్లు, పారిశ్రామిక పార్కులు, లాజిస్టిక్స్ పార్కులు మొదలైవాటిలో భవిష్యత్ పెట్టుబడులు పెట్టడానికి పరిశ్రమలకు అవకాశం వచ్చింది.  ఈ రహదారుల వెంబడి సుమారు రెండు వేల మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందనున్నాయని చెప్పారు. వీటితో పాటు రెండు వేల బస్సు పోర్టులు నెలకొల్పే ప్రణాళిక ఉందని కూడా ఆయన తెలిపారు

భారత దేశ అభివృద్ధి ప్రణాళికలో భాగం పంచుకోవాలని విదేశాలలో ఉన్న భారతీయ విద్యార్థులు, శాస్త్రవేత్తలను శ్రీ నితిన్ గడ్కరీ ఆహ్వానించారు.  పరిశోధన, ఆవిష్కరణ, యాజమాన్యం, వైద్యం, ఉన్నత విద్య వంటి వివిధ రంగాలలో అనేక కొత్త అవకాశాలు ఎదురుచూస్తున్నాయనీ వారికి వివరించారు. వివిధ దేశాలకు చెందిన 43 విశ్వవిద్యాలయాలలోని ప్రవాస భారతీయ విద్యార్థులతో ఆయన ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్యం లేదా జాయింట్ వెంచర్ల వంటి వివిధ పద్ధతుల ద్వారా చేపట్టే ప్రాజెక్టులకు ప్రభుత్వం పూర్తి సహాయ సహాకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు

శ్రీ గడ్కరీ ఇంతవరకు, సుమారు 8000 మంది వ్యాపార రంగానికి చెందిన నాయకులు, పారిశ్రామిక వేత్తలు, వ్యవస్థాపకులతో మాట్లాడి, వారి సమస్యలు, సూచనలను ఆర్ధిక, వాణిజ్య, పరిశ్రమ, రైల్వే, కార్మిక, ఉపాధి వంటి వివిధ సంబంధిత మంత్రిత్వ శాఖలువిభాగాలకు తెలియజేశారు.  

వెంచర్లకు మూడు నెలల్లో అవసరమైన అనుమతులు పొందడానికి తన మంత్రిత్వశాఖ సహాయం అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.  మౌలిక సదుపాయాల అభివృద్ధికీ, గ్రామీణ, గిరిజన, వ్యవసాయ రంగాలు / ప్రాంతాలను ఎక్కువగా ప్రోత్సహించనున్నట్లు ఆయన తెలియజేశారు.  భాగస్వాములందరూ సమిష్టిగా కృషి చేయాలని మంత్రి కోరారు.  కరోనాకు వ్యతిరేకంగానూ, అదే విధంగా ఆర్ధిక పరిస్థితిని చక్కదిద్ధేందుకు చేసే కృషి లోనూ మనం తప్పక విజయం సాధిస్తామని గడ్కరీ ఈ సందర్భంగా విశ్వాసం వ్యక్తం చేశారు

శ్రీ నితిన్ గడ్కరీ వివిధ దేశాలకు చెందిన 43 విశ్వవిద్యాలయాలలోని ప్రవాస భారతీయ విద్యార్థులతో పాటు నాసా లోని భారతీయ శాస్త్రవేత్తలతో కూడా చర్చలు జరిపారు. ఇంతకు ముందు శ్రీ గడ్కరీ అనేక సంస్థలకు చెందిన సభ్యులు, ప్రతినిధులతో కలిసి సంప్రదింపులు జరిపారు.  ఆ సంస్థల్లో ఫిక్కీ, ఎస్.ఎం.ఈ., ముంబాయి లోని క్రెడాయ్, ఎస్,ఎం.ఈ.లు., భారతీయ ముఖ్య కార్యనిర్వహణాధికారుల క్లబ్, ఏ.ఐ.పి.ఎం.ఏ., భారతీయ శిక్షణ మనల్,  యంగ్ ప్రెసిడెంట్స్ ఆర్గనైజేషన్, మహారాష్ట్ర ఆర్ధికాభివృధి మండలి, అసోచామ్, పి.హెచ్.డి. ఛాంబర్ అఫ్ కామర్స్, భారత్ ఛాంబర్ అఫ్ కామర్స్ మొదలైనవి ఉన్నాయి.   

***



(Release ID: 1618608) Visitor Counter : 166