పర్యటక మంత్రిత్వ శాఖ

కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న "దేఖో అప్నా దేశ్" అనే వెబినార్ సీరీస్ లో భాగంగా - "అవధ్ కి సైర్ - ది ప్రైడ్ అఫ్ లక్నో" అనే కార్యక్రమం ద్వారా పర్యాటక రంగంలో పాకశాస్త్ర సామర్ధ్యాన్ని తెలియజేయడం జరిగింది.

తదుపరి వెబినార్ 27.04.2020 తేదీన "ఎక్స్ ప్లోరింగ్ పాండిచ్చేరి ఫ్రెంచ్ క్వార్టర్ - ఫ్రెంచ్ కనెక్షన్స్" అనే పేరు మీద నిర్వహించనున్నారు.

Posted On: 26 APR 2020 12:15PM by PIB Hyderabad
పర్యాటక మంత్రిత్వ శాఖ "దేఖో అప్నా దేశ్" అనే వెబినార్ సీరీస్ లో భాగంగా  25.04.2020 తేదీన  - "అవధ్ కి సైర్ - ది ప్రైడ్ అఫ్ లక్నో" అనే కార్యక్రమం ద్వారా పర్యాటక రంగంలో పాకశాస్త్ర సామర్ధ్యాన్ని "అవధ్ కి సైర్ - ది ప్రైడ్ అఫ్ లక్నో"అనే కార్యక్రమం ద్వారా తెలియజేసింది.  ఈ వెబినార్ కార్యక్రమం ద్వారా లక్నో లో ఉన్న విభిన్నమైన పాకశాస్త్ర సంస్కృతితో పాటు లక్నో కి చెందిన ఇతర సంస్కృతులు, చరిత్ర, వస్త్రాలు ద్వారా ఆహారపు అలవాట్లు గురించి కూడా వివరంగా తెలియజేయడం జరిగింది. 

వంటకాలు మనం సందర్శించే ప్రదేశాల యొక్క ముఖ్యమైన అనుభవాలను ఏర్పరుస్తాయి. ఈ రోజుల్లో మనకు రకరకాల పర్యాటకులు వస్తున్నారు. వారిలో కొంతమంది కేవలం ఇక్కడ పదార్ధాల రుచులను ఆస్వాదించడానికి మాత్రమే వస్తున్నారు. వారు ఇక్కడ వంటలలో ముఖ్యమైన అనుభవాలను ఆనందంగా తమతో తీసుకువెళ్తున్నారు.  భారతదేశంలో లభించే  పాత కాలం నాటి సంప్రదాయ వంటలను అందరూ ఇష్టపడతారు. ఇక్కడ రకరకాల రుచులను కలపడం ద్వారా వచ్చే కొత్త రుచులు అందరినీ ఆకర్షిస్తాయి, అలరిస్తాయి.  భారతీయ వంటల యొక్క ప్రత్యేకతను ప్రపంచానికి పరిచయం చేయడం కోసం సహజంగా సుగంధ ద్రవ్యాల రూపంలో లభించే రకరకాల రుచులను ఒక చోట చేర్చి, వాటి సహజ ప్రత్యేకతలను, రుచులను కోల్పోకుండా కాపాడుతున్నాము. 

ఈ వెబినార్ కార్యక్రమాన్ని వేల్స్ విశ్వవిద్యాలయం గౌరవ అధ్యాపకులు, పయనీర్ అఫ్ హెరిటేజ్ వాక్స్ కి చెందిన ప్రొఫెసర్ మరియు పరిశోధకులు శ్రీ ప్రతీక్ హీరాతో పాటు 2010 ఇండియన్ మాస్టర్ చెఫ్ విజేత చెఫ్ పంకజ్ బడోరియా మరియు నవాబ్ జాఫర్ మిర్ అబ్దుల్లా నిర్వహించారు. 

ఈ వెబినార్ లో అతి సామాన్యమైన బ్రేక్ ఫాస్ట్ దగ్గరనుండి ఎంతో సున్నితమైన, ప్రముఖమైన దమ్ తరహా వంటకాలు, మెల్టింగ్ కబాబ్స్, కుర్మాలు, బిర్యాని, షీర్మల్ తో పాటు ఖరీదైన స్ట్రీట్ ఫుడ్ రకాల గురించి కూడా వివరంగా చూపించారు. 

ఈ కార్యక్రమం ద్వారా  ఆలూ కి సబ్జి, దహి మరియు జిలేబితో కాస్తా కచోరి ; నిహరి కూల్చా; తండై కబాబ్; గాలోటి కబాబ్; కకోరి కబాబ్స్, ప్రముఖమైన ఉళ్తే తవా కా పరాఠా, ఛాట్ ఐటమ్స్, సలాన్,  మఖన్ మలై; లొక్నోవి పాన్ మొదలైన పదార్ధాల గురించి వివరంగా తెలియజేసారు. లక్నో లా మార్టినియెర్ కాలేజ్ కాంటీన్ లో క్రిస్మస్ కేక్ ను తయారుచేశారు. 

పర్యాటక మంత్రిత్వశాఖ నిర్వహిస్తున్న ఈ వెబినార్ సీరీస్ లో  దేశ, విదేశాల్లోని సరాసరి 3,000 మంది పాల్గొంటున్నారు. 

ఈ కార్యక్రమాలు ఇప్పుడు

  https://www.youtube.com/channel/UCzIbBmMvtvH7d6Zo_ZEHDA/featured 

వెబ్ సైట్ లోనూ, భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వశాఖకు చెందిన అన్ని సామాజిక మాధ్యమాల్లోనూ  అందుబాటులో ఉన్నాయి. 

తదుపరి వెబినార్  "ఎక్స్ ప్లోరింగ్ పాండిచ్చేరి ఫ్రెంచ్ క్వార్టర్ - ఫ్రెంచ్ కనెక్షన్స్" అనే పేరు మీద 2020 ఏప్రిల్, 27వ తేదీ ఉదయం 11.00 గంటలకు ప్రారంభమౌతుంది

 కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు దిగువన ఉన్న లింక్ ను క్లిక్ చేసి తమ పేరు నమోదు చేసుకోవచ్చు.  

 https://bit.ly/WebinarPondicherry

******


(Release ID: 1618409) Visitor Counter : 203