సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
పిఐబి సమన్వయంతో 50,000 పునర్వినియోగ ఫేస్ మాస్కులను సరఫరా చేస్తున్న ఢిల్లీ హెరిటేజ్ రోటరీ క్లబ్
లాక్ డౌన్ సమయంలో ఇళ్ల దగ్గరే ఉంది ఫేస్ మాస్కులను తయారు చేసిన
మహిళ దర్జీలు
మాస్కులను పంపిణీ చేసిన పిఐబి ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్
Posted On:
25 APR 2020 3:55PM by PIB Hyderabad
ప్రస్తుత కోవిడ్ సంక్షోభంలో దేశవాసులను వివిధ రకాల సహాయాలతో ఆదుకోవాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఇచ్చిన పిలిపు మేరకు రోటరీ క్లబ్ ఢిల్లీ హెరిటేజ్ స్పందించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తో కలిసి సమన్వయంతో 50,000 తిరిగి వినియోగించుకునే ఫేస్ మాస్కులను విస్తృతంగా పంపిణీ చేయడానికి సరఫరా చేస్తోంది.
రోటరీ ఇంటర్నేషనల్, అంతర్జాతీయంగా వర్తక, వృత్తి నిపుణులు ప్రముఖులను ఒక తాటిపైకి తెచ్చి మానవీయ దృక్పథంతో సేవలను అందిస్తూ ప్రపంచ వ్యాప్తంగా శాంతి సౌహార్ధృత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో పనిచేస్తోంది.
విస్తృతంగా పంపిణీ చేస్తున్న ఫేస్ మాస్కులను ఈ లాక్ డౌన్ సమయంలో, మహిళా దర్జీలే తయారు చేస్తున్నారు. ఈ రోజు వాటిని పిఐబి ప్రిన్సిపల్ జనరల్ శ్రీ కుల్దీప్ సింగ్ ధాత్వాలియా పంపిణీ చేశారు. రోటరీ క్లబ్ ఢిల్లీ హెరిటేజ్ తరఫున పిఐబి అదనపు డీజీ శ్రీ రాజీవ్ జైన్, రోటరీ హెరిటేజ్ అధ్యక్షుడు శ్రీ రాకేష్ జైన్ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. మాస్కులను ఢిల్లీ పోలీస్ పార్లమెంట్ స్ట్రీట్ డీసీపీ శ్రీ ఈష్ సింఘాల్, కేంద్రీయ భండార్ సీఎండీ శ్రీ ముకేశ్ కుమార్ కి ఈ రోజు నేషనల్ మీడియా సెంటర్ లో అందజేశారు. పాత్రికేయులకు కూడా ప్రిన్సిపాల్ డీజీ మాస్కులను పంపిణీ చేశారు.


******
(Release ID: 1618208)
Visitor Counter : 255