పర్యటక మంత్రిత్వ శాఖ

ప‌ర్యాట‌క మంత్రిత్వ‌శాఖ దేఖో అప్నా దేశ్ సీరీస్‌లో భాగంగా ఈశాన్య భార‌త‌దేశం- ప్ర‌త్యేక‌త క‌లిగిన‌ గ్రామాల‌ను దర్శించండి పేరుతో 8 వ వెబినార్ సిరీస్‌ను నిర్వ‌హించింది. ఈ వెబినార్ మంచి ఆస‌క్తిని క‌లిగించింది. ప‌లుదేశాల‌కు చెందిన వారు ఈ వెబినార్‌లో పాల్గొన్నారు.

Posted On: 25 APR 2020 2:27PM by PIB Hyderabad

భార‌త ప్ర‌భుత్వ కేంద్ర ప‌ర్య‌టాక‌ మంత్రిత్వ శాఖ, ‘దేఖో అప్నా దేశ్’  ఇతివృత్తంలో భాగంగా వెబ్‌నార్ల సిరీస్ ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా త‌న 8వ వెబినార్‌లో ఈశాన్య భార‌తదేశం- ప్ర‌త్యేకత క‌లిగిన గ్రామాల‌ను ద‌ర్శించి అనుభ‌వించండి అంటూ అస్సాం, మేఘాల‌య‌ల‌లోని పెద్ద‌గా తెలియ‌ని గ్రామాల‌పై 24 ఏప్రిల్ 2020 న  వెబినార్ ను ప్ర‌ద‌ర్శించింది.
ఈశాన్య భార‌త‌దేశం అద్బుత అందాలు రాసిపోసిన భూమి,  పచ్చటి ప్రకృతి ర‌మ‌ణీయ‌త‌, నీలాకాశ రంగులో జ‌ల‌వ‌న‌రులు, సహజ‌సిద్ద‌మైన నిశ్శ‌బ్దం , గొప్ప‌గుణం క‌లిగిన‌,మంత్ర‌ముగ్థుల‌ను చేసే  స్థానిక ప్ర‌జ‌లు ఈ ప్రాంతం ప్ర‌త్యేకం.
ఈ ప్రాంత‌ భౌగోళిక ప్ర‌త్యేక‌త‌లోని  అనంతమైన వైవిధ్యం, దాని భౌతిక ప‌రిస్థితులు, వైవిధ్యమైన వృక్ష  జంతుజాలం మరియు ఏవియన్ జీవితం, దాని ప్రజల చరిత్ర మరియు దాని జాతి సమాజాల యొక్క వైవిధ్యత , పురాతన సంప్రదాయాలు దాని జీవనశైలి లోని గొప్ప వారసత్వంగా చెప్పుకోవ‌చ్చు. ఈ ప్రాంత‌ పండుగలు ,హ‌స్త‌క‌ళ‌లు  సెల‌వుల‌కు ఆ ప్రాంతానికి వెళ్లిన‌వారిని సంతోషంగా గ‌డిపేలా  చేస్తాయి . ఈ ప్రాంతాన్ని స‌రికొత్త‌గా చూసి ఇందులోని గొప్ప‌త‌నాన్ని తెలుసుకోవాలి. ఈశాన్య రాష్ట్రాల‌లోని ఈ వైవిధ్యం దీనిని అన్ని సీజ‌న్ల‌లో సెల‌వుల‌కు అత్యంత అనువైన ప్రాంతంగా మ‌లుస్తుంది.
 ఈ వెబినార్‌ను అజిత్ పుర‌కాయ‌స్థ‌, సిఇఒ , కొయెలి టూర్స్‌, ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌, డాక్ట‌ర్ శ్రేయ బ‌ర్బ‌రా , ఛీఫ్ ఆప‌రేటింగ్ ఆఫీస‌ర్ , ల్యాండ్ స్కేప్ స‌ఫారి వీరు స‌మ‌ర్పించారు.
ఈ వెబినార్‌లో అస్సాం, మేఘాల‌య‌కు చెందిన ప‌లు గ్రామాల గురించి ప్ర‌ద‌ర్శించారు.‌
అస్సాంలోని గ్రామాలు:

సుఆల్‌కుచి- ఈ గ్రామం గౌహ‌తినుంచి 35 కిలోమీట‌ర్ల దూరంలో బ్ర‌హ్మ‌పుత్ర‌న‌ది ఉత్త‌ర ఒడ్డున ఉంది.ఇది కామ‌రూప్ జిల్లాలోని ఒక బ్లాక్‌.  ఇది ప్రపంచంలోని అతిపెద్ద నేత గ్రామాలలో ఒకటి, ఇక్కడ 74శాతం ఇళ్ల‌లోనివారు  బంగారు ముగా నుండి ఐవరీ వైట్ పాట్ వరకు సున్నితమైన పట్టు వస్త్రాలను నేయడంలో నిమగ్నమై ఉన్నారు.  తేలికపాటి లేత గోధుమరంగు ఎరి లేదా ఎండి సిల్క్ శతాబ్దాల నాటి నేత వారసత్వానికి ప్రసిద్ధి చెందింది. పట్టు పురుగులను చంపకుండా పట్టు పొందే అహింసా పట్టు పెంపకం అనే భావనకు ఇక్కడి ప్రజలు మద్దతు ఇస్తున్నారు. పర్యావరణ స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించే దిశగా ఇది ఒక గొప్ప ముంద‌డుగు.

రంతాలి - నాగాన్ జిల్లాలోని చాలా చిన్న గ్రామం  చేతితో తయారు చేసిన ఆభరణాలకు ఇది ప్రసిద్ధి చెందింది . ఇక్క‌డి నమూనాలు ఎక్కువగా ఈ ప్రాంతంలోని పూలు,  జంతు సంపదలను వర్ణిస్తాయి. అస్సామీ ఆభరణాల  సాంప్రదాయ నమూనాలు సరళమైనవి కాని శక్తివంతమైన ఎర్ర రత్నం, రూబీ లేదా మినాతో అలంకరింప‌బడతాయి


హజో - హజో గువహతి నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది.  హిందువులు, బౌద్ధులకు ఒక తీర్థయాత్ర కేంద్రంగా, ముస్లింల‌కు ప‌విత్ర ప్రాంతంగా ప్రసిద్ది చెందింది. హ‌య‌గ్రీవ మాధ‌వ ఆల‌యం ఎంతో ప్ర‌సిద్ధి.. ప్రఖ్యాత మసీదు, పోవా మక్కా ఇక్కడ ఉంది .బుద్ధ భ‌గ‌వానుడు హయగ్రీవ మాధవ ఆలయంలో నిర్వాణం పొందాడని నమ్ముతారు. ఈ ఆలయంలో ఒక చెరువు ఉంది, ఇది నల్ల మృదువైన షెల్ తాబేలుకు సురక్షితమైన స్వర్గంధామం. వీటిని విష్ణువు అవతారాలుగా భావించినందున ఎవరూ వీటికి హాని చేయరు.

దాదారా -  అంతరించిపోతున్న హ‌ర్గీలా కొంగ‌‌జాతులకు ఇది నిల‌యం; అస్సామీలో హ‌ర్గీలా అంటారు
, దాదారా వీటికి  ప్ర‌త్యేక నిల‌యం. ప్రపంచంలో సుమారు ఇలాంటివి 1500  కొంగలు మాత్రమే మిగిలి ఉన్నాయి.   సుమారు 500  కొంగలకు ఇది సురక్షితమైన ఆవాసంగా ఉంది..వాటి పరిరక్షణకు సంబంధించి ఉత్తేజకరమైన కథను గ్రీన్ ఆస్కార్ అవార్డు గ్రహీత శ్రీమతి పూర్ణిమా దేవి బార్మాన్ నేతృత్వంలోని హర్గిలా ఆర్మీ ద్వారా  తెలుసుకోవచ్చు.
సార్తెబ‌రి: - అస్సాం బెల్ మెటల్ పరిశ్రమ ,వెదురు, చేతిపనుల తరువాత రెండవ అతిపెద్ద హస్తకళా రంగం. బెల్ మెటల్ రాగి , టిన్ ల‌ మిశ్రమం . ఈ పరిశ్రమకు చెందిన‌ హస్తకళాకారులను ‘కహార్’ లేదా ‘ఓర్జా’ అని పిలుస్తారు.
 
దిగువ అస్సాంలోని నల్బరి ప్రాంతం - అస్సాం  ప్రసిద్ధ జాపి ఉత్పత్తితో ఒక సాధారణ అనుబంధం క‌లిగిన‌, కమ్యూనిటీ ఆధారిత ఉపాధితో అనుసంధానించబడిన గ్రామాల సమూహం. అస్సాం శంఖాకార టోపీ, జాపి చారిత్రాత్మకంగా పొలాల్లోని రైతులు ఎండ నుండి త‌మ‌ను కాపాడుకోవ‌డానికి ఉపయోగించారు. ప్ర‌స్తుతం   రంగురంగులలో అలంకరించబడిన జాపి అస్సాం  సాంస్కృతిక చిహ్నంగా మారింది.

బాన్స్‌బరి - భూటాన్ పర్వత ప్రాంతానికి సరిహద్దులో ఉన్న గౌహతి నుండి 140 కిలోమీటర్ల దూరంలో ఉంది. బన్స్బరి యునెస్కో నేచురల్ వరల్డ్ హెరిటేజ్ ప్రాంతంగా గుర్తింపు క‌లిగిన‌ది. మనస్ నేషనల్ పార్క్, అనేక వృక్షజాతులు,  వన్యప్రాణులకు నివాసంగా ఉంది, వీటిలో చాలా వర‌కు అంత‌రించిపొతున్న జాతుల‌లో ఉన్నాయి .

అస్సాం  టీ బంగ్లాలు - వివిధ క‌మ్యూనిటీల‌కు చెందిన‌ వారు, గిరిజనులు, అస్సాం  అతిపెద్ద పరిశ్రమ అయిన టీ పరిశ్రమలో పనిచేస్తున్నారు,  పర్యాటకులు బ్రిటిష్ శకం  నాటి  తేయాకు తోట‌ల మనోజ్ఞతను అనుభవించడానికి వివిధ తేయాకు తోట‌లు ప‌ర్యాట‌కుల‌కోసం  తమ తలుపులు తెరిచాయి..

మజులి - ప్రపంచంలోని అతిపెద్ద నది దీవులలో ఒకటి, బ్రహ్మపుత్ర నది మధ్యలో  మజులి ఉంది.  మజులి అస్సామీ నియో-వైష్ణవ సంస్కృతి కి కేంద్రంగా ఉంది, దీనిని 15 వ శతాబ్దంలో గౌరవనీయమైన అస్సామీ ఆథ్యాత్మిక‌వేత్త‌ శ్రీమంత శంకర్‌దేవ‌  అతని శిష్యుడు మాధవదేవ ప్రారంభించారు.

నామ్‌ఫ‌కే గ్రామం -   తాయ్-ఫ‌కీ గ్రామం గా కూడా దీనిని పిలుస్లారు. ఈ అంద‌మైన గ్రామంలో అస్సాంలోని పురాతన,  అత్యంత గొప్ప‌ బౌద్ధ మఠం ఉంది. ఇక్క‌డి బౌద్ధ క‌మ్యూనిటీకి థాయ్‌లాండ్ మూలాలున్నాయి. థాయ్ భాషతో సమానమైన మాండలికాన్ని వీరు మాట్లాడుతారు.  థాయ్‌ జాతి  ఆచారాలు  సంప్రదాయాలను ఇప్పటికీ వీరు అనుస‌రిస్తారు. . ఈ క‌మ్యూనిటీ 18 వ శతాబ్దంలో అస్సాంలో ప్రవేశించినట్లు భావిస్తున్నారు.
మేఘాల‌య గ్రామాలు:

 ‘అబోడ్ ఆఫ్ క్లౌడ్స్’ గా, కొండ‌ల‌ను తాకే మేఘాలు, లోతైన లోయలతో అద్భుత ప‌ర్వ‌త శ్రేణుల‌తో   అల‌రారే  రాష్ట్రం ఇది. మూడు వందల రకాల పూల తోట‌లు ఇక్క‌డ  కనిపిస్తాయి, ఇక్క‌డ  వన్యప్రాణులు కూడా సమృద్ధిగా ఉన్నాయి. అందమైన ప్ర‌దేశాల‌తో భారత పర్యాటక పటంలో మేఘాలయకు ప్ర‌త్యేక‌ పరిచయం అవసరం లేదు.

మావ్‌ఫ్లాంగ్ - అందమైన లోయ, అక్క‌డి ప్ర‌శ‌స్థ‌మైన‌ అడవికి ఇది ప్రసిద్ధి చెందింది, ప్రకృతి  స్వంత మ్యూజియం ఏర్పాటు చేసిందా అన్న‌ట్టు , ప్రత్యేకమైన వృక్షజాతుల‌ నిధి ఈ ప్రాంతం, ఇది ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో అరుదుగా కనిపించే వృక్ష‌జాతుల‌కునిల‌యం. స్థానిక ఖాసీ వర్గాలవారు ఎంతో జాగ్ర‌త్త‌గా వీటిని సంరక్షిస్తుంటారు, 500 సంవత్సరాల పురాతన పెద్ద బండ‌రాళ్లు ఇక్క‌డ ఉన్నాయి.  అద్భుతమైన పవిత్రమైన తోటలకు దగ్గరగా 'డేవిడ్ స్కాట్ కాలిబాట', అందమైన మేఘాలయ ప్రకృతి దృశ్యం మధ్య  ఒక ట్రెక్కింగ్ జోన్, ప్రవాహాలు, రాళ్ళు, అటవీ ప్రాంతం, స్థానిక గ్రామాల గుండా వెళుతుంది.

కోంగ్‌తోంగ్ - ప్రతి గ్రామస్తుడికి ఈలతోపేర్లు ఉన్న ఒక విజిల్ గ్రామం ఇది.  బిడ్డ జన్మించినప్పుడు, తల్లి ఒక  ఈల పేరు పెడుతుంది.  ఎన్నోత‌రాలుగా ఈ సంప్ర‌దాయాన్ని అనుస‌రిస్తున్నారు.

జ‌క్రెమ్ - ఇది షిల్లాంగ్ నుండి మాకిర్వాట్ రహదారిపై ఉన్న గ్రామం.  షిల్లాంగ్ నుండి 64 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వ్యాధుల‌ను న‌యంచేసే ఔష‌ధ‌ లక్షణాలుగ‌ల  స‌ల్ఫ‌ర్ వేడి నీటి బుగ్గలకు  ఇది ప్రసిద్ధి చెందింది. జాక్రేమ్ ఇప్పుడు ఒక‌ ఆరోగ్య రిసార్ట్ గా అభివృద్ధి చెందింది. రాఫ్టింగ్, హైకింగ్ , సైక్లింగ్ వంటి సాహస కార్యకలాపాలకు కూడా ఇది ప్రసిద్ది చెందింది.

నోంగ్రియాట్ -  చెట్ల వేర్లే వంతెన‌లుగా గ‌ల గ్రామంగా ఇది ప్ర‌సిద్ధి.ఈ  వంతెనలు భారీ మందపాటి వేర్ల మూలాలతో అల్లుకుని ఉంటాయి., స్థానిక ప్రజలు ఒకే సమయంలో అనేక మంది దీనిపై వెళ్ల‌గ‌ల‌ వంతెనను ఇలాంటి వేర్ల‌తోరూపొందించుకుంటారు.  ఈ వంతెనలు  500–600 సంవత్సరాలు ఉంటాయి.. డబుల్ డెక్కర్ లివింగ్ రూట్ వంతెన అన్ని రూట్ వంతెనలలో అతిపెద్దది,  రెయిన్‌బో జలపాతం రాష్ట్రంలోని అందమైన జలపాతాలలో ఒకటి.

షొన్ప్డెంగ్ - మేఘాలయలోని జయంతియా కొండలలో ఉన్న ఒక అందమైన గ్రామం. ఇక్కడ నిర్మలమైన ఉమ్న‌గాట్ న‌ది ప్ర‌వహిస్తుంది. ఉమ్న‌గోట్ నది దాని ప‌రిశుద్ధ‌మైన‌ నీటికి ప్రసిద్ధి చెందింది, పై నుండి చూసినప్పుడు, పడవ మధ్య గాలిలో తేలుతున్నట్లు కనిపిస్తుంది.

జోవై - ఇది జయంతియా  కొండ‌ప్రాంత‌ జిల్లాలో ఉంది,  ప్రత్యేకమైన సుందర ప్ర‌దేశాల‌కు ఇది ప్రసిద్ధి చెందింది. మూడు వైపుల నుండి మైంట్‌డు నది చుట్టూ ఉంది, ఇది చలికాలం చలిగా,వేసవి కాలం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఖాసీ , జయంతియా కొండల పొడ‌వునా ప్రాచీన‌ ఏకశిలలు ఉన్నాయి. ఏదేమైనా, నార్టియాంగ్ మార్కెట్‌కు ఉత్తరాన ఏకశిల లేదా మెగాలిథిక్ రాళ్ల ను క‌నుగొన్నారు. నార్టియాంగ్‌లోని దుర్గా ఆలయంప్ర‌సిద్ద‌ ప్రార్థనా స్థలం. జిల్లాలోని అత్యంత అందమైన జలపాతాలలో క్రాంగ్ సూరి జలపాతం ఒకటి.

 భార‌త‌దేశం లోని వివిధ ప్రాంతాలు, న‌గ‌రాలు,  ప్రకృతి దృశ్యాలు,  ఇతర అనుభవాలను వెబినార్ ల‌ ద్వారా చూపించడానికి ప‌ర్యాట‌క‌ మంత్రిత్వ శాఖ చేసిన ప్రయత్నాలు యూట్యూబ్ ఛానల్ ఆఫ్ ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా  www.incredibleindia.org, పర్యాట‌క మంత్రిత్వ శాఖ  వెబ్‌సైట్ లో www.tourism.gov.in లో అందుబాటులో ఉన్నాయి.
 
నార్త్ ఈస్ట్ ఇండియా-ఎక్స్పీరియన్స్ ది ఎక్స్‌క్లూజివ్ విలేజెస్ -పై వెబ్‌నార్‌లో 3654 మంది పాల్గొన్నారు  ఈ క్రింది దేశాల ప్రజలు  ఇందులో పాల్గొన్నారు.
1. ఆఫ్ఘనిస్తాన్ 2. కెనడా 3. ఫ్రాన్స్ 4. జర్మనీ 5. పాకిస్తాన్ 6. సింగపూర్ 7. స్పెయిన్ 8. థాయిలాండ్ 9. యునైటెడ్ కింగ్‌డమ్ 10. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా


(Release ID: 1618182) Visitor Counter : 208