ప్రధాన మంత్రి కార్యాలయం

సింగపూర్ ప్రధాని శ్రీ లీ సియెన్ లూంగ్ కు మరియు ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ కి మ‌ధ్య టెలిఫోన్ ద్వారా జరిగిన సంభాష‌ణ‌

Posted On: 24 APR 2020 2:08PM by PIB Hyderabad

సింగపూర్ ప్రధాని శ్రీ లీ సియెన్ లూంగ్ తో ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ 2020వ సంవత్సరం ఏప్రిల్ 23వ తేదీ న టెలిఫోన్‌ లో మాట్లాడారు.

కోవిడ్- 19 విశ్వమారి రువ్వుతున్న ఆరోగ్యపరమైనటువంటి మరియు ఆర్థికపరమైనటువంటి సవాళ్ల విషయం లో ఇరువురు నేత లు వారి వారి అభిప్రాయాల ను పరస్పరం తెలియజేసుకొన్నారు.  ఈ ప్రపంచవ్యాప్త వ్యాధి ని మరియు అది కలుగజేసే సాంఘిక, ఆర్థిక ప్రభావాల ను ఎదురొడ్డటానికి వారు తమ తమ దేశాల లో అనుసరిస్తున్న చర్యల తాలూకు తాజా సమాచారాన్ని ఒకరి దృష్టి కి మరొకరు తీసుకువచ్చారు.

సింగపూర్ కు ఔషధ ఉత్పత్తుల తో సహా నిత్యావసర వస్తవుల సరఫరాల ను అందించడం లో శాయశక్తుల సాయపడుతామని ప్ర‌ధాన‌ మంత్రి వాగ్దానం చేశారు.  సింగపూర్ లోని భారతీయ పౌరుల కు తోడ్పాటు ను అందిస్తున్నందుకు గాను ప్రధాన మంత్రి తన ప్రశంసల ను సైతం ఈ సందర్భం లో వ్యక్తం చేశారు.

ప్రస్తుత పరిస్థితుల లో ఇండియా-సింగపూర్ స్ట్రటీజిక్ పార్ట్ నర్ శిప్ కు ప్రాముఖ్యం ఉందన్న అంశాన్ని ఉభయ నేత లు స్పష్టీకరించారు.  కోవిడ్-19 విసరుతున్నటువంటి వర్తమాన సవాళ్ల ను మరియు భావి సవాళ్ల ను ఎదుర్కొని, వాటి ని అధిగమించడానికి సంయుక్తం గా కృషి చేయాలని వారు సమ్మతించారు.

ప్రస్తుత సంక్షోభ స్థితి లో సింగపూర్ ప్రజలు ఆరోగ్యం గా ఉండాలని ప్రధాన మంత్రి అంటూ, తాను వారి శ్రేయస్సు ను ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.

 

***


(Release ID: 1617798) Visitor Counter : 205