పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
22 ఏప్రిల్ 2020 బుధవారం ఒక్కరోజులో లైఫ్ లైన్ ఉడాన్ విమానాలచే
35.78 టన్నుల అత్యవసరాలు మరియు మందుల రవాణా
నాడు పోస్టు చేయడమైనది:
23 APR 2020 7:20PM by PIB Hyderabad
ఎయిర్ ఇండియా, భారత వైమానిక దళం (ఐ ఏ ఎఫ్) మరియు విస్తార నడిపే లైఫ్ లైన్ ఉడాన్ విమానాలు 22 ఏప్రిల్ 2020వ తేదీన 35.78 టన్నుల సరుకులను రవాణా చేశాయి. కోవిడ్-19 మహమ్మారిపై భారత్ జరుపుతున్న పోరాటానికి మద్దతుగా దేశీయ రంగంలో ఎయిర్ ఇండియా, ఏలియన్స్ ఎయిర్, ఐఏఎఫ్ మరియు ప్రైవేట్ విమాన సేవల సంస్థలు లైఫ్ లైన్ ఉడాన్ లో భాగంగా ఇప్పటివరకు 339 విమానాలు నడిపారు. వాటిలో 204 విమాన సర్వీసులను ఎయిర్ ఇండియా, ఎలియన్స్ ఎయిర్ నడిపాయి. ఇప్పటి వరకు దాదాపు 587.57 టన్నుల సరుకులను రవాణా చేశారు. లైఫ్ లైన్ ఉడాన్ విమానాలు ఇప్పటివరకు గగన తలంలో 3,37,639 కిలోమీటర్లు ప్రయాణించాయి. కోవిడ్ -19 మహమ్మారిపై దేశప్రజలు జరుపుతున్న పోరాటానికి మద్దతుగా విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశంలోని మారుమూల ప్రాంతాలకు అత్యవసర మందుల సరఫరా/రవాణా కోసం 'లైఫ్ లైన్ ఉడాన్' విమానాలను నడుపుతున్నారు.
ఈశాన్య ప్రాంతం, కొండ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. ఎయిర్ ఇండియా మరియు భారత వైమానిక దళం సమన్వయంతో ప్రధానంగా జమ్మూ& కాశ్మీర్, లద్ధాక్, ఈశాన్య ప్రాంతం మరియు ఇతర దీవులకు రవాణా చేపట్టాయి. జమ్మూ& కాశ్మీర్, లద్ధాక్, ఈశాన్య ప్రాంతం మరియు ఇతర దీవులకు కీలకమైన వైద్య సరఫరాలు, మందులు మరియు రోగులను తరలించడానికి పవన్ హన్స్ తో సహా హెలికాఫ్టర్ సేవలను వినియోగిస్తున్నారు. 22 ఏప్రిల్ 2020 వరకు పవన్ హన్స్ సంస్థ 6537 కిలోమీటర్లు ప్రయాణించి 1.90 టన్నుల సరుకులను రవాణా చేసింది.
లైఫ్ లైన్ ఉడాన్ ద్వారా దేశీయంగా జరిపే రవాణాలో కోవిడ్ -19 సంబంధ రీ ఏజెంట్లు, ఎంజైములు , వైద్య పరికరాలు , టెస్టింగ్ కిట్లు , వ్యక్తిగత సంరక్షణ సాధనాలు (పి పి ఇ), మాస్కులు, గ్లవ్స్ , హెచ్ ఎల్ ఎల్ మరియు భారత వైద్య పరిశోధనా మండలికి చెందిన ఇతర సామగ్రి , రాష్ట్రాలు /కేంద్రపాలిత ప్రాంతాలు ప్రభుత్వాలు కోరిన సామాను మరియు తపాలా ప్యాకెట్లు ఉన్నాయి.
దేశీయ రవాణా సంస్థలు స్పైస్ జెట్ , బ్లూ డార్ట్ మరియు ఇండిగో వాణిజ్య సరళిలో విమానాల ద్వారా రవాణా చేస్తున్నాయి. స్పైస్ జెట్ సంస్థ 24 మార్చి నుంచి ఏప్రిల్ 22, 2020 వరకు 495 రవాణా విమానాలను నడిపి 7,46,219 కిలోమీటర్ల దూరం ప్రయాణించి 3837 టన్నుల సరుకులను రవాణా చేసింది. దానిలో 166 అంతర్జాతీయ సరుకుల రవాణా విమానాలు. బ్లూ డార్ట్ సంస్థ 25 మార్చి నుంచి ఏప్రిల్ 22, 2020 వరకు 169 రవాణా విమానాల ద్వారా 1,68,396 కిలోమీటర్లు తిరిగి 2749 టన్నుల సరుకులను చేరవేసింది. వాటిలో 2 అంతర్జాతీయ సరుకుల రవాణా విమానాలు. ఇండిగో సంస్థ 3-22 ఏప్రిల్, 2020 మధ్య 35 రవాణా విమానాల ద్వారా 42,752 కిలోమీటర్లు ప్రయాణించి 84 టన్నుల సరుకులను రవాణా చేసింది. వాటిలో 6 అంతర్జాతీయ రవాణా విమానాలు. ప్రభుత్వం కోసం ఉచితంగా తీసుకెళ్ళిన వైద్యసరఫరాలు కూడా ఉన్నాయి.
తూర్పు ఆసియా నుంచి ఎయిర్ ఇండియా విమానాలు ఏప్రిల్ 4, 2020 నుంచి ఇప్పటి వరకు 348 టన్నుల సరుకులను తీసుకు వచ్చాయి. తూర్పు ఆసియా నుంచి ఔషధాలు, వైద్య పరికరాలు మరియు కోవిడ్-19 సహాయక సామగ్రి తీసుకురావడానికి కార్గో ఎయిర్ బ్రిడ్జి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ముందు కూడా అవసరమైతే ఇతర దేశాలకు కూడా కీలకమైన ఔషధాలు, వైద్య సామగ్రి రవాణా చేయాలనే సంకల్పంతో ఎయిర్ ఇండియా ఉంది. ఇందుకోసం ప్రత్యేక సరుకుల రవాణా విమానాలను నడుపనుంది.
***
(రిలీజ్ ఐడి: 1617723)
సందర్శకుల సూచీ సంఖ్య : : 208