సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

టెలికాం శాఖ నుంచి ఉచిత ఇంటర్నెట్ సదుపాయం లేదు

అక్టోబర్ 16 వరకు హోటళ్లు మూసివేయాలని పర్యాటక శాఖ ఆదేశం ఏదీ లేదు

Posted On: 22 APR 2020 9:10PM by PIB Hyderabad

వినియోగదారులందరికీ 2020 మే 3వ తేదీ వరకు ఉచిత ఇంటర్నెట్ వసతి కల్పించాలని టెలికాం శాఖ ఆదేశించినట్టు ట్విట్టర్ లో ప్రచారంలో ఉన్న వార్తలో నిజానిజాలను పిఐబి ఫ్యాక్ట్ చెక్ పరిశీలించింది. వినియోగదారులు ఇంటి నుంచే పని చేయడానికి (వర్క్ ఫ్రమ్ హోమ్) వీలు కల్పిస్తూ టెలికాం శాఖ  ఉచిత ఇంటర్నెట్ సదుపాయం కల్పించిందంటూ వచ్చిన ఆ వార్తలో నిజం లేదని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలియచేసింది.
 

https://twitter.com/PIBFactCheck/status/1252933594579824643?s=20


కంపెనీ ఉద్యోగులెవరైనా కోవిడ్-19 పాజిటివ్ అని పరీక్షల్లో తేలితే ఆ కంపెనీ డైరెక్టర్లు, యాజమాన్యంపై జరిమానా విధిస్తారంటూ మీడియాలో వచ్చిన వార్తల్లో నిజం లేదని హోం మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. యాజమాన్యం అనుమతి, కుమ్మక్కు, నిర్లక్ష్యం కారణంగా నేరం జరిగి ఉంటే వారిపై జరిమానా విధిస్తామని మాత్రమే తమ మార్గదర్శకాల్లో ఉన్నట్టు ఆ వివరణలో తెలిపింది. పిఐబి ఫ్యాక్ట్ చెక్ ఆ వివరణను తమ ట్విట్టర్ హ్యాండిల్ లో ప్రచురించింది.


https://twitter.com/PIB_India/status/1252861361777897472?s=20


కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఈ వివరణతో పంపిన ట్విట్టర్ సందేశాన్ని ఈ దిగువ లింక్ లో చూడవచ్చు. 
 

https://twitter.com/PIBHomeAffairs/status/1252897072526704640?s=20


కరోనా వైరస్ విస్తరణ కారణంగా దేశంలోని హోటళ్లన్నీ 2020 అక్టోబర్ 15 వరకు మూసివేయాలంటూ వచ్చిన వార్తలో నిజం లేదంటూ పర్యాటక మంత్రిత్వ శాఖ ఇచ్చిన వివరణను పిఐబి ఫ్యాక్ట్ చెక్ తన ట్విట్టర్ హ్యాండిల్ లో ప్రచురించింది. 


https://twitter.com/PIBFactCheck/status/1252888187363442689?s=20


అస్సామీ మూలాలున్న పౌరుల రోగనిరోధక శక్తిపై ఐసిఎంఆర్ ఎలాంటి అధ్యయనం చేయడంలేదని పిఐబి అస్సాం ప్రాంతీయ యూనిట్ ఒక ట్విట్టర్ సందేశం ప్రచురించింది. రోగనిరోధక శక్తి కారణంగా అస్సామీ మూలాలున్న పౌరులకు కోవిడ్-19 సోకలేదని, ఈ కారణంగా ఐసిఎంఆర్ వారి జన్యువులపై అధ్యయనం చేస్తున్నదని వచ్చిన వార్తలో్ని నిజానిజాలు తెలియచేయాలంటూ వచ్చిన ఒక ట్విట్టర్ సందేశానికి స్పందిస్తూ ఫ్యాక్ట్ చెక్ ఈ వివరణ ప్రచురించినట్టు తెలిపారు. 
 

https://twitter.com/PIB_Guwahati/status/1252932862971707392?s=20

పూర్వాపరాలు...
సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్దేశకత్వం మేరకు సామాజిక మాధ్యమాల్లో వదంతులు, నిరాధారమైన వార్తలు వ్యాపింపచేయడాన్ని అరికట్టడానికి పిఐబి ఒక ప్రత్యేక యూనిట్ ఏర్పాటు చేసింది. ఈ విభాగం సామాజిక మాధ్యమాల్లో అమితవేగంగా వ్యాపిస్తున్న వదంతులను గుర్తించి వాటిలోని నిజానిజాలను వెలికి తీస్తుంది. “పిఐబి ఫ్యాక్ట్ చెక్”  పేరిట ట్విట్టర్ లో ఏర్పాటైన ఈ హ్యాండిల్ నిరంతరం సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ట్రెండింగ్ సందేశాలను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ వాటిలో నిరాధారమైన వార్తలను గుర్తించడంతో పాటు ఆ సందేశాల్లోని అంశాలను సమగ్రంగా సమీక్షిస్తూ ఉంటుంది. పిఐబి_ఇండియా హ్యాండిల్ తో పాటు పిఐబికి చెందిన వివిధ ప్రాంతీయ విభాగాల హ్యాండిళ్లు ఆయా వార్తల వాస్తవ, అధికారిక వెర్షన్లను ట్విట్టర్ వినియోగదారుల కోసం #పిఐబిఫ్యాక్ట్ చెక్ హ్యాష్ టాగ్ తో ప్రచురిస్తున్నాయి.

సామాజిక మాధ్యమాల్లో వచ్చిన టెక్ట్స్ సందేశం, ఆడియో, వీడియోల్లో వచ్చిన అంశాల్లో నిజానిజాలను పరిశీలించేందుకు పౌరులెవరైనా వాటిని పిఐబిఫ్యాక్ట్ చెక్ కు పంపవచ్చు. https://factcheck.pib.gov.in/  లింక్  ద్వారా ఆన్ లైన్ లోనే వాటిని పరిశీలనకు పంపవచ్చు. లేదా +918799711259 నంబర్ కు వాట్సప్ చేయవచ్చు. లేదా pibfactcheck[at]gmail[dot]com కు సందేశం పంపవచ్చు. అలాంటి వార్తల్లోని నిజానిజాలన్నీ పిఐబి వెబ్ సైట్   https://pib.gov.in లో కూడా అందుబాటులో ఉంటాయి.


 



(Release ID: 1617718) Visitor Counter : 113