కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 నమూనాల సేకరణకు తొలి మొబైల్ బిఎస్ఎల్ -3 విడిఆర్ఎల్ ప్రయోగశాల జాతికి అంకితం
Posted On:
23 APR 2020 6:46PM by PIB Hyderabad
రక్షణమంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ , కోవిడ్ -19 నమూనాల సేకరణ మొబైల్ ల్యాబ్, మొబైల్ బిఎస్ఎల్ -3 విఆర్ డిఎల్ ల్యాబ్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా , కార్మిక, ఉపాధి కల్పన శాఖ ఇన్‌ఛార్జి సహాయమంత్రి శ్రీ సంతోష్ కుమార్ గంగ్వార్, హోంశాఖ సహాయమంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి, తెలంగాణా రాష్ట్ర మునిసిపల్ పాలన, పట్టణాభివృద్ది , పరిశ్రమలు, ఐటి, ఎలక్ట్రానిక్ ,కమ్యూనికేషన్ శాఖ మంత్రిశ్రీ కె. తారకరామారావు, తెలగాణా ప్రభుత్వ కార్మిక ఉపాధి, ఫ్యాక్టరీల శాఖమంత్రి శ్రీ చామకూర మల్లారెడ్డిల సమక్షంలో న్యూఢిల్లీనుంచి దేశానికి అంకితం చేశారు
ఈ ల్యాబ్‌ను రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన , రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఒ) హైదరాబాద్ సనత్‌నగర్ లోని ఇఎస్ ఐసి మెడికల్ కాలేజి, ఆస్పత్రి సహకారంతో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చి (ఐసిఎంఆర్), తెలంగాణ ప్రభుత్వ అనుమతితో అభివృద్ధిచేశారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ రక్షణమంత్రి , డిఆర్‌డిఒ, ఇఎస్ఐసి ల కృషిని అభినందించారు. బయోసేఫ్టీ లెవల్ -2, లెవల్-3 ల్యాబ్‌ను సాధారణంగా ఆరు నెలల కాలం పట్టే దానిని 15 రోజుల రికార్డు వ్యవధిలో ఏర్పాటు చేయడం పట్ల మంత్రి అభినందించారు. ఈ పరీక్షా వ్యవస్థ రోజుకు వెయ్యి శాంపిళ్లను ప్రాసెస్ చేయగలదని, దీనితో కోవిడ్ -19 పై పోరులో దేశ సామర్ధ్యాన్ని ఇది పెంచగలదని అన్నారు.
ఈ కార్యక్రమం సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్, ఈ మోబైల్ టెస్టింగ్ పరీక్షా కేంద్రాన్ని అత్యంత స్వల్పవ్యవధిలో రూపొందించినందుకు డిఆర్‌డిఓ, ఇఎస్ఐసిలను అభినందించారు. కరోనావైరస్ పై మనం సాగిస్తున్న పోరాటంలో ఇది ఎంతో ముఖ్యమైనదని అన్నారు. కోవిడ్ -19ను ఎదుర్కోనేందుకు తమ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్న ఇఎస్ఐసి అద్భుత కృషి చేస్తున్నదని ఆయన అన్నారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, డిఆర్‌డిఒ, హైదరాబాద్ సనత్ నగర్ ఇఎస్ ఐ మెడికల్ కాలేజి , ఆస్పత్రి డాక్టర్లు, ఈ ల్యాబ్ ను అభివృద్ధి చేసేందుకు చేసిన కృషిని అభినందించారు. సాధారణంగా ఈ ల్యాబ్ ను ఏర్పాటు చేయడానికి ఆరు నెలల కాలం పట్టనుండగా దానిని పట్టుమని రెండు వారాలలోనే సాకారం చేసినందుకు వారిని మంత్రి అభినందించారు.
మొబైల్ బిఎస్ఎల్ -3 విఆర్‌డిఎల్ ల్యాబ్ గురించి:
హైదరాబాద్ సనత్ నగర్ లోని ఇఎస్ఐసి మెడికల్, హాస్పిటల్ ఈ వినూత్న మొబైల్ డయాగ్నోస్టిక్ , రిసెర్చ్ కేంద్రం మొబైల్ బిఎస్ ఎల్ -3 విఆర్‌డిఎల్ ల్యాబ్‌ను వినియోగిస్తుంది. దేశంలో ఈ తరహా సదుపాయం కోవిడ్ -19 , దాని సంబంధిత పరీక్షలు పరిశోధనలకోసం వాడడం ఇదే మొదటిది.
మొబైల్ బిఎస్ఎల్ -3 విఆర్‌డిఎల్ ల్యాబ్ డిజైన్‌ను డిఆర్‌డిఒ శాస్త్రవేత్తలు రూపొందించారు. ఇందుకు సంబంధించిన స్పెసిఫికేషన్లను హైదరాబాద్ సనత్‌నగర్‌లోని ఇఎస్ఐసి మెడిక్ కాలేజి, ఆస్పత్రి అందించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం, అమలును డిఆర్‌డిఒకు చెందిన మూడు పరిశ్రమ భాగస్వామ్య సంస్థలు చేపట్టాయి.
ఇతర వినూత్న సాంకేతిక పరిజ్ఞానాలను డిఆర్‌డిఒ అభివృద్ది చేసి , వాటిని హైదరాబాద్ సనత్‌నగర్‌లోని ఇఎస్ఐసి మెడికల్ కాలేజి, ఆస్పత్రి కి అందించిన వాటిలో శాంపిల్ కలెక్షన్‌కు ఉ పయోగించే సిఒవిఎస్ఎసికె యూనిట్, ఎయిరోసోల్ బాక్స్‌లు, ఎయిరోసొలైజ్‌డ్ శానిటైజర్ డిస్పెన్సర్, స్నార్కెల్ ఫేస్ మాస్క్, పిపిఇ ఎన్ -95 తో సమానమైన పునర్ వినియోగ ఫేస్ షీల్డ్‌లు, యువి-సి డిస్ ఇన్‌ఫెక్షన్ ఛాంబర్ వంటివి కోవిడ్ -19 పోరాటంలో భాగంగా ఆస్పత్రిలో వినియోగానికి అందజేశారు
ఇఎస్ఐసి మెడికల్ కాలేజి ,హాస్పిటల్, సనత్ నగర్,హైదరాబాద్ :
హైదరాబాద్,సనత్‌నగర్‌లోని ఇఎస్ఐసి మెడికల్ కాలేజి , ఆస్పత్రి 500 పడకల ఆస్పత్రి. దీనికి తోడు ఆంకాలజీ, నెఫ్రాలజీ, న్యూరోసర్జరీ, కార్డియాలజీ, పీడియాట్రిక్‌సర్జరీ వంటి వాటి సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసం 150 పడకలు అందుబాటులో ఉన్నాయి.దీనివల్ల ఇఎస్ఐ లబ్ధిదారులు ఒకే గొడుగు కింద మంచి చికిత్స పొందగలుగుతారు.
కోవిడ్ -19 మహమ్మారిపై పోరాటానికి ఇఎస్ఐసి పలు ఇతర చర్యలు చేపట్టింది.
ప్రస్తుత సంక్షోభ సమయంలో 13 ఇఎస్ఐసి ఆస్పత్రులకు చెందిన 1861 ఐసొలేషన్ బెడ్లను ప్రత్యేక కోవిడ్ -19 ఆస్పత్రులుగా మార్చారు. పై ఆస్పత్రులకు తోడు 1011 ఐసోలేషన్ బెడ్లు దేశవ్యాప్తంగా గల మిగిలిన ఇఎస్ ఐసి ఆస్పత్రులలో అందుబాటులోకి తెచ్చారు. దీనికితోడు మొత్తం 555 ఐసియు,హెచ్‌డియు బెడ్లు, 197 వెంటిలేటర్లు కూడా ఈ ఆస్పత్రులలో అందుబాటులో ఉంచారు. క్వారంటైన్ సదుపాయం ( మొత్తం 1254 బెడ్లు) రాజస్థాన్‌లోని ఆల్వార్ ఇఎస్ ఐసి ,బిహ్తా , పాట్నా (బీహార్) గుల్బర్గా(కర్ణాటకల), కోర్బా (ఛత్తీస్‌ఘడ్) ఆస్పత్రులలో అందుబాటులోకి తెచ్చారు. దీనితోపాటు కోవిడ్ -19 పరీక్షా సదుపాయాన్ని హర్యానాలోని ఫరీదాబాద్ ఇఎస్ఐసి ఆస్పత్రిలో అందుబాటులోకి తెచ్చారు.
***
(Release ID: 1617676)
Visitor Counter : 169