శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కొవిడ్-19పై భారతీయ పోరాటం, వృద్ధిచెందుతున్న సహజ రక్షణ

కొవిడ్-19 శరీరంలో వ్యాప్తి చెందకుండా మరియు కొవిడ్ సోకిన రోగి త్వరగా కోలుకునే విధంగా శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే ఆమోదించిన రోగనిరోధక శ్రుతిమిశ్రకం(ఇమ్యునోమాడ్యులేటర్) సెప్సివాక్®ను అభివృద్ధి చేయవలెనని నిర్ణయించిన
సిఎస్ఐఆర్

ఇపుడు క్రొత్త ప్రయోగాత్మక పరీక్షలకు ఆమోదం తెలిపిన భారత ఔషధ నియంత్రణాధికారి(డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డిసిజిఐ))
రాండమైజ్డ్ , డబుల్-బ్లైండ్, టు-ఆర్మ్, నియంత్రణ ప్రయోగ పరీక్షల నిర్వహణ

ఈ రెండు పరీక్షలను ఇప్పటికే ప్రకటించిన ప్రయోగాత్మక పరీక్షలకు అదనంగా కొవిడ్-19 తీవ్రత ఎక్కువగా ఉన్న రోగుల్లో మరణాల రేటును తగ్గించే సామర్థ్యాన్ని పరీక్షించడానికి నిర్వహిస్తారు.

Posted On: 23 APR 2020 3:18PM by PIB Hyderabad

కొవిడ్-19 లేదా మరే అంటురోగంపై అయినా పోరాడటానికి  శరీరంలో రోగనిరోధక వ్యవస్థ కీలక పాత్రను పోషిస్తుంది. ఈ  వైరస్లను గుర్తించడానికి మరియు తొలగించడానికి అత్యంత వేగవంతమైన మరియు తొట్టతొలి సామర్థ్యం శరీరంలోని రోగనిరోధక వ్యవస్థదే. కొవిడ్-19 లేదా మరే ఇతర వైరస్లైనా ఏ వ్యక్తికైనా సోకకపోవడానికి లేదా నామమాత్రంగా సోకడానికి కారణం అతనిలో వాటిని తట్టుకునేందుకు సరిపడినంత రోగనిరోధక శక్తి ఉండటం. శరీరంలోని మైక్రోగ్రాఫ్లు మరియు ఎన్కే కణాలు ఈ  రక్షణను ఇస్తాయి.  ప్రపంచమంతా  కొవిడ్-19కు వ్యాక్సిన్ను మరియు వైరస్ నిరోధక కారకాన్ని కనుగొనే పనిలో ఉండగా   సాంకేతిక మరియు పరిశ్రమల పరిశోధనా మండలి(సిఎస్ఐఆర్) వైరస్ సోకిన రోగి  త్వరగా కోలుకునేందుకు ఆ వ్యక్తి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఆమోదించిన రోగనిరోధక శ్రుతిమిశ్రకం(ఇమ్యునోమాడ్యులేటర్) సెప్సివాక్®ను   అభివృద్ధి చేసేందుకు తన ప్రతిష్టాత్మక కార్యక్రమం న్యూ మిలీనియం ఇండియన్ టెక్నాలజీ లీడర్షిప్ ఇనీషియేటివ్ కార్యక్రమం క్రింద  సన్నాహాలు చేస్తోంది.  

సెప్సివాక్® ద్వారా ఆశిస్తున్న లక్ష్యాలు:

1.      కొవిడ్-19 రోగులకు దగ్గరగా మసిలిన వ్యక్తుల మరియు వైద్యసంబంధిత  వృత్తిలో ఉన్న సిబ్బందికి వారి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడం ద్వారా ఈ  అంటువ్యాధి నుండి రక్షించడం.

2.      కొవిడ్-19 వలన ఆసుపత్రిపాలైన, రోగ తీవ్రత తక్కువగా ఉన్న రోగులను త్వరితంగా కోలుకునేలా  చేయడంతోపాటు ఐసియులో ఉన్న రోగి వలన ఈ వైరస్ వ్యాప్తిని ఆపడానికి ఈ ప్రయత్నం సహకరిస్తుంది.

క్రొత్తగా చేస్తున్న ఈ ప్రయోగానికి భారత ఔషధ  నియంత్రణ మండలి(డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డిసిజిఐ)) వారి ఆమోదం ఉండగా , రాండమైజ్డ్, డబుల్-బ్లైండ్, టు-ఆర్మ్,  నియంత్రిత ప్రయోగ  పరీక్షలను ఇందులో నిర్వహించబడతాయి. ఈ రెండు పరీక్షలను ఇప్పటికే ప్రకటించిన ప్రయోగాత్మక పరీక్షలకు అదనంగా కొవిడ్-19 తీవ్రత ఎక్కువగా ఉన్న రోగుల్లో మరణాల రేటును తగ్గించే సామర్థ్యాన్ని పరీక్షించడానికి నిర్వహిస్తారు.

సెప్సివాక్® వేడితో చంపబడే సూక్ష్మజీవులను డబ్ల్యూ(ఎండబ్ల్యూ)ను కలిగి ఉంటుంది. ఇవి రోగి శరీరంలో ఉండటం వలన రక్షణతోపాటు వీటి వినియోగం వలన ఎటువంటి ఇతర ప్రభావాలు కలుగవు.   ఈ సెప్సివాక్®ను ఎన్ఎంఐటిఎల్ఐ కార్యక్రమం క్రింద సిఎస్ఐఆర్ అభివృద్ధి చేయగా అహ్మదాబాదుకు చెందిన కడిలా ఫార్మాసూటికల్స్ లిమిటెడ్ తయారు చేస్తుంది.



(Release ID: 1617504) Visitor Counter : 253