ఆర్థిక మంత్రిత్వ శాఖ

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ ఇంతవరకు సాధించిన ప్రగతి.

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ కింద 33 కోట్ల కంటే ఎక్కువగా పేద ప్రజలు 31,235 కోట్ల రూపాయల మేర ఆర్ధిక సహాయాన్ని పొందారు.

20.05 కోట్ల మంది మహిళా జన్ ధన్ ఖాతాదారులకు 10,025 కోట్ల రూపాయలు పంపిణీ చేశారు.

వయో వృద్దులు, వితంతువులు, వికాలాగులైన సుమారు 2.82 కోట్ల మందికి 1,405 కోట్ల రూపాయలు పంపిణీ చేశారు.

ప్రధానమంత్రి-కిసాన్ కు చెందిన మొదటి వాయిదా 16,146 రూపాయలు చొప్పున 8 కోట్ల మంది రైతులకు బదిలీ చేశారు.

ఈ.పి.ఎఫ్. చందా కింద 68,775 సంస్థల్లో పనిచేసే 10.6 లక్షల ఉద్యోగులకు ప్రయోజనం చేకూరే విధంగా 162 కోట్ల రూపాయలు బదిలీ చేయడమైనది.

2.17 కోట్ల మంది భవన నిర్మాణ కార్మికులు 3,497 కోట్ల రూపాయలను ఆర్ధిక సహాయం కింద స్వీకరించారు .

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన.

39.27 కోట్ల మంది లబ్ధిదారులకు ఉచితంగా ఆహారధాన్యాలు పంపిణీ చేశారు.

వివిధ రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు 1,09,227 మెట్రిక్ టన్నుల పప్పు ధాన్యాలు తరలించారు.

ప్రధానమంత్రి ఉజ్జ్వల యోజన కింద 2.66 కోట్ల ఉజ్జ్వల సీలిండర్లను ఉచితంగా పంపిణీ చేశారు.

Posted On: 23 APR 2020 12:10PM by PIB Hyderabad

కోవిడ్ -19 నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ఆర్ధిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ 2020 మర్చి 26వ తేదీన ప్రకటించిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ (పి.ఎమ్.జి.కె.పి.) కింద డిజిటల్ చెల్లింపుల సదుపాయాన్ని ఉపయోగించి 2020 ఏప్రిల్ 22వ తేదీ వరకు  33 కోట్ల మందికి పైగా పేద ప్రజల బ్యాంకు ఖాతాల్లో నేరుగా 31,235 కోట్ల రూపాయల మేర ఆర్ధిక సహాయాన్ని జమ చేయడం జరిగింది. 

పి.ఎమ్.జి.కె.పి. లో భాగంగా,  ప్రభుత్వం, మహిళలకు, పేద వయో వృద్ధులకూ,   రైతులకు ఉచితంగా ఆహార ధాన్యాల సరఫరా తో పాటు నగదు చెల్లించనున్నట్లు  ప్రకటించింది. ఈ ప్యాకేజీని వేగవంతంగా అమలుచేయడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. లాక్ డౌన్ ఉద్దేశ్యానికి అనుగుణంగా సహాయ చర్యలు అవసరమైన వారికి వేగవంతంగా చేరే విధంగా కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ, సంబంధిత మంత్రిత్వశాఖలు, కాబినెట్ సచివాలయం, ప్రధానమంత్రి కార్యాలయం విశేషంగా కృషి చేస్తున్నాయి. 

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ కింద 2020 ఏప్రిల్ 22వ తేదీ వరకు లబ్ధిదారులకు విడుదల చేసిన ఆర్ధిక సహాయం (నగదు మొత్తాలు) వివరాలు ఇలా ఉన్నాయి : 

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ :

2020 ఏప్రిల్ 22వ తేదీ వరకు నేరుగా ప్రయోజనం బదిలీ చేసిన మొత్తం వివరాలు : 


పధకం 

లబ్ధిదారుల సంఖ్య 

బదిలీ అయిన మొత్తం 

పి.ఎం.జే.డి.వై. మహిళా ఖాతాదారులకు మద్దతుగా  

20.05 కోట్లు (98%)

10,025 కోట్లు 

ఎన్.ఎస్.ఏ.పి.కి మద్దతుగా 

(వృద్ధ వితంతువులు, దివ్యాంగులు, వయోవృద్దులు)

2.82 కోట్లు  (100%)

  1405 కోట్లు 

ప్రధానమంత్రి-కిసాన్ కింద రైతులకు చెల్లింపులు 

8 కోట్లు (మొత్తం 8 కోట్లలో)

16,146 కోట్లు 

భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులకు 

మద్దతుగా 

2.17 కోట్లు 

   3497 కోట్లు 

ఈ.పి.ఎఫ్.ఓ. కి 

24 శాతం చందా 

0.10 కోట్లు 

162 కోట్లు 

మొత్తం 

33.14 కోట్లు 

31,235 కోట్లు 

 

లభిదారులకు వేగంగా సమర్ధవంతంగా ప్రయోజనాలను బదిలీ చేయడానికి ఫిన్ టెక్ మరియు డిజిటల్ టెక్నాలజీ ని ఉపయోగించడం జరిగింది. 

నేరుగా ప్రయోజనం బదిలీ (డి.బి.టి.) ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు మొత్తం నేరుగాబదిలీ కావడంతో, అవకతవకలను అరికట్టి సామర్ధ్యాన్ని మెరుగుపరచుకోడానికి అవకాశం ఏర్పడింది. 

లబ్ధిదారులు వ్యక్తిగతంగా బ్యాంకు శాఖకు వెళ్లి నగదు జమ చేసుకోవలసిన అవసరం లేకుండా లబ్ధిదారుల ఖాతాల్లోకి ప్రయోజనం నేరుగా బదిలీ అవుతుంది. 

పి.ఎమ్.జి.కె.పి. లోని వివిధ అంశాల కింద ఇంతవరకు సాధించిన ప్రగతి వివరాలు ఇలా ఉన్నాయి: 

i.    ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన  :-

36 రాష్ట్రాలు / కేంద్ర పాలితప్రాంతాలు ఏప్రిల్ నెలలో 40 లక్షల మెట్రిక్ టన్నులకు గాను, ఇంతవరకు 40.03 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను తీసుకుని వెళ్లాయి.  31 రాష్ట్రాలు / కేంద్ర పాలితప్రాంతాలు 2020 ఏప్రిల్ నెలకు అర్హత కలిగిన 1.19 కోట్ల రేషన్ కార్డుల ద్వారా 39.27 కోట్ల మంది లబ్దిదారులకు 19.63 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలు పంపిణీ చేశాయి. 

వివిధ రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలకు 1,09,227 మెట్రిక్ టన్నుల పప్పు ధాన్యాలు కూడా పంపిణీ చేశారు.

ii.    ప్రధానమంత్రి ఉజ్జ్వల యోజన (పి.ఎమ్.యు.వై.) లబ్ధిదారులకు ఉచితంగా గ్యాస్ సీలిండర్లు అందజేశారు. :-

పి.ఎమ్.యు.వై. పధకం కింద మొత్తం 3.05 కోట్ల గ్యాస్ సీలిండర్లు నమోదు చేసుకోగా, ఇంతవరకు 2.66 కోట్ల పి.ఎమ్.యు.వై. సీలిండర్లు లబ్ధిదారులకు ఉచితంగా అందజేయడం జరిగింది. 

iii.   ఈ.పీ.ఎఫ్.ఓ. సభ్యులకు తమ వద్ద ఉన్న మిగులు నిధుల్లో 75 శాతం లేదా మూడు నెలల వేతనం, ఈ రెండింటిలో ఏది తక్కువగా ఉంటే అంత మొతాన్ని తిరిగి చెల్లించవలసిన అవసరంలేని అడ్వాన్స్ గా అనుమతి ఇచ్చారు :-

ఇంతవరకు 6.06 లక్షల ఈ.పి.ఎఫ్.ఓ. సభ్యులు ఆన్ లైన్ ద్వారా 1,954 కోట్ల రూపాయలు విత్ డ్రా చేసుకున్నారు. 

iv.  3 నెలల పాటు ఈ.పి.ఎఫ్. చందాగా, కార్మికుల వేతనాల్లో 24 శాతం చెల్లింపు;  నెలకు 15,000 రూపాయల కంటే తక్కువగా వేతనాలు తీసుకునే,  వంద మంది వరకు ఈ.పి.ఎఫ్.ఓ. సభ్యులు ఉన్న సంస్థలకు ఈ పధకం వర్తిస్తుంది.   

ఈ పధకం కింద 2020 ఏప్రిల్ నెలకు వెయ్యి కోట్ల రూపాయలు ఈ.పి.ఎఫ్.ఓ. కు ఇప్పటికీ విడుదల చేశారు.  78.74 లక్షల మంది లబ్ధిదారులతో పాటు సంబంధిత సంస్థలుకు ఈ పధకం గురించి తెలియజేయడమైంది.  ఈ ప్రకటన అమలుకు సంబంధించిన పధకం ఖరారయ్యింది.   ఈ పధకానికి సంబంధించి తరచుగా అడిగే ప్రశ్నలు, సమాధానాలు (ఎఫ్.ఏ.క్యూ.లు) కూడా వెబ్ సైట్ లో పొందుపరచడం జరిగింది. 

ఈ పధకం కింద ఇంత వరకు మొత్తం 10.6 లక్షల మంది ఉద్యోగులు లబ్ధిపొందారు.  68,775 సంస్థలకు మొత్తం 162.11 కోట్ల రూపాయల మేర నిధులు బదిలీ చేయడం జరిగింది.

v.    మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం (ఎమ్.ఎన్.ఆర్.ఈ.జి.ఏ.) :-

పెరిగిన రేటును 01-04-2020 తేదీ నుండి వర్తింపజేస్తూ తెలియజేయడమైనది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో, 1.27 కోట్ల మందికి పనిదినాలు సృష్టించబడ్డాయి.  పెండింగులో ఉన్న జీతాలు చెల్లించడానికి, మెటీరియల్ బాకీలు చెల్లించడానికీ, 7,300 కోట్ల రూపాయల మేర నిధులు విడుదల చేయడం జరిగింది. 

vi.    ప్రభుత్వ ఆసుపత్రులు మరియు ఆరోగ్య పరిరక్షణ కేంద్రాల్లో పనిచేసే ఆరోగ్య కార్మికులకు బీమా పధకం :-

22.12 లక్షల మంది ఆరోగ్య కార్మికులకు వర్తించే విధంగా ఈ పధకాన్ని న్యూ ఇండియా అస్యూరెన్స్ సంస్థ అమలుచేస్తోంది. 

vii.    రైతులకు సహాయం :-

ప్రధానమంత్రి-కిసాన్ పధకం మొదటి వాయిదా కింద మొత్తం 16,146 కోట్ల రూపాయలు పంపిణీ చేశారు. ఈ పధకం కింద గుర్తించిన మొత్తం 8 కోట్ల మంది లబ్ధిదారులకు గాను 8 కోట్ల మందికీ ఒక్కొక్కరికీ రెండు వేల రూపాయల చొప్పున వారి వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. 

viii.    పి.ఎమ్.జె.డి.వై. మహిళా ఖాతాదారులకు సహాయం :-

భారతదేశంలో పెద్ద సంఖ్య లో గృహాలు ఎక్కువగా మహిళలకే నిర్వహించబడుతున్న నేపథ్యంలో, 20.05 కోట్ల మహిళా జన్ ధన్ ఖాతాదారులు ఒక్కొక్కరూ ఐదు వందల రూపాయల చొప్పున తమ ఖాతాల ద్వారా ఆర్ధిక సహాయం పొందారు.  2020 ఏప్రిల్ 22వ తేదీ వరకు ఈ ఖాతాలలో మొత్తం 10,025 కోట్ల రూపాయల మేర నిధులను నేరుగా జమ చేశారు. 

ix.    వయోవృద్దులకు, వితంతువులకు, దివ్యాంగులకు సహాయం :-

జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (ఎన్.ఎస్.ఏ.పి.) కింద 2.82 కోట్ల మంది వయోవృద్దులు, వితంతువులు, దివ్యాంగులకు సుమారు 1,405 కోట్ల రూపాయలు పంపిణీ చేశారు.  ఒక్కొక్క లబ్ధిదారునికి ఈ పధకం కింద ఐదు వందల రూపాయల చొప్పున మొదటి విడత ఎక్స్ గ్రేషియా అందజేశారు. మరో విడతగా  ఒక్కొక్కరికీ ఐదు వందల రూపాయల చొప్పున వచ్చే నెల చెల్లిస్తారు. 

x.    భవన నిర్మాణం మరియు ఇతర నిర్మాణ రంగ కార్మికులకు మద్దతు :

భవన నిర్మాణం మరియు నిర్యాణ కార్మికుల నిధి నుండి సుమారు 2.17 కోట్ల మంది భవన నిర్మాణం మరియు ఇతర నిర్మాణ రంగ కార్మికులు ఆర్ధిక సహాయం పొందారు. ఈ నిధి నుండి 3,497 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు చెల్లించారు. 

 

 

***


(Release ID: 1617492) Visitor Counter : 328