గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 విజృంభిస్తున్న సమయంలో సిబ్బంది రక్షణ కోసం సమగ్ర చర్యలు తీసుకున్న - ఉత్తర డి.ఎం.సి.

ప్రతి కంటైన్మెంట్ జోన్ బయట సిబ్బందికి పి.పి.ఈ. కిట్లు అందజేయడం కోసం డాకింగ్ స్టేషన్ ఏర్పాటు.

Posted On: 22 APR 2020 11:46AM by PIB Hyderabad

కోవిడ్-19 మహమ్మారి వల్ల నెలకొన్న ప్రస్తుత పరీక్షా సమయంలో ఉత్తర ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (ఉత్తర డి.ఎం.సి.) తన సిబ్బంది పూర్తి భద్రత, రక్షణ కోసం పలు సమగ్ర చర్యలు తీసుకుంది.  నగర వ్యాప్తంగా ఏర్పాటైన కంటైన్మెంట్ జోన్లలో సేవల నిమిత్తం ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. 

ఉత్తర్ డి.ఎం.సి. ప్రతి కంటైన్మెంట్ జోన్ బయట ఒక డాకింగ్ స్టేషన్ను ఏర్పాటు చేసింది.   పారిశుధ్యం, ఇంజనీరింగ్, ప్రజారోగ్యం వంటి ఏ శాఖకు చెందిన సిబ్బంది అయినా, ప్రతి ఒక్కరూ ఈ డాకింగ్ స్టేషన్ల నుండే తమ పని ప్రారంభించాలి.  వారు ఇక్కడ తమ హాజరును నమోదు చేయగానే ఎవరికి సరిపోయే పి.పి.ఈ. కిట్ ను వారికి అందజేస్తారు. 

కంటైన్మెంట్ జోన్ల లోకి ప్రవేశించే ప్రతి ఉద్యోగి పూర్తి రక్షణతో పని ప్రారంభించే విధంగా చూస్తారు.  తమ పని పూర్తికాగానే, వారు తిరిగి డాకింగ్ స్టేషన్ లో తమ వివరాలు నమోదు చేయవలసి ఉంటుంది.   వారు ధరించిన రక్షణ దుస్తులను, ఇతర సామగ్రిని అక్కడ వదిలివేయాలి. సిబ్బంది ఇంటికి వెళ్లే ముందు ఎవరికి  వారు పూర్తిగా శుభ్ర పరచుకుకోవలసిఉంటుంది.   తద్వారా వారు ఎటువంటి అంటువ్యాధిని ఇంటికి తీసుకువెళ్లకుండా ఉంటారు. 

కంటైన్మెంట్ జోన్ పరిధిలో ఆహారం తీసుకోడానికి అనుమతి లేదు.  అందువల్ల సిబ్బందికి వారి విధి నిర్వహణ పూర్తి అయిన అనంతరం భోజనం చేయడానికి ఒక ప్రత్యేక స్థలాన్ని కేటాయించడం జరిగింది.  ఈ ప్రత్యేక స్థలంలో సామాజిక దూరం నిబంధనను తప్పనిసరిగా పాటించాలి.  ప్రత్యేక రక్షణ కవచాలను ఏవిధంగా ధరించాలి ? ఏ విధంగా తిరిగి తీసివేయాలి అనే విషయంపై సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కూడా అందించడం జరిగింది. 

******



(Release ID: 1617000) Visitor Counter : 172