హోం మంత్రిత్వ శాఖ

అదనపు వ్యవసాయ, అటవీ ఉత్పత్తులు, విద్యార్థులకు అవసరం అయిన విద్యావంతమైన పుస్తకాలు, విద్యుత్ ఫ్యాన్ల దుకాణాలకు లాక్ డౌన్ ఆంక్షల నుంచి

మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వం
భారతీయ పోర్టుల్లో భారత నావికుల కదలకలకు, సైన్ ఆన్/ సైన్ ఆఫ్ కు ప్రోత్సాహకాలు ప్రకటించిన హోం మంత్రిత్వ శాఖ

Posted On: 21 APR 2020 10:54PM by PIB Hyderabad

కోవిడ్-19పై పోరాటంలో భాగంగా అమలులో ఉన్న జాతీయ స్థాయి లాక్ డౌన్ నుంచి ఏకీకృత మార్గదర్శకాల కింద మరి కొన్ని ప్రత్యేకమైన కార్యకలాపాలకు మినహాయింపు ఇస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
లాక్ డౌన్ ఆంక్షల నుంచి మినహాయింపు లభించిన వాటిలో అదనపు వ్యవసాయ, అటవీ ఉత్పత్తులు, విద్యార్థులకు విద్యావంతమైన పుస్తకాలు విక్రయించే దుకాణాలు, విద్యుత్ ఫ్యాన్లు విక్రయించే దుకాణాలు ఉన్నాయి. దీనికి తోడు భారతీయ పోర్టుల కార్యకలాపాలు, నౌకల కదలిలకు ప్రధానమైన భారతీయ నావికుల సైన్ ఆన్/  సైన్ ఆఫ్ లకు కూడా ఎంహెచ్ఏ ప్రోత్సాహకాలు ప్రకటించింది.
అయితే ఈ ఉత్తర్వుల ద్వారా ఇచ్చిన ఈ మినహాయింపులు హాట్ స్పాట్ లు/  కట్టడి జోన్లకు వర్తించవు. ఈ జోన్లలో ఈ కార్యకలాపాలు వేటికీ అనుమతి ఉండదు.

 

***
 



(Release ID: 1616973) Visitor Counter : 239