పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ

శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ వీసీ ద్వారా 1000 మంది ఎల్‌పిజి పంపిణీదారులతో సంభాషిస్తారు; పేదల ప్రయోజనం కోసం ఉచిత ఉజ్జ్వాలా రీఫిల్స్‌ను పెంచమని వారిని అడుగుతుంది

Posted On: 22 APR 2020 10:17AM by PIB Hyderabad

దేశంలోని వెయ్యి మందికి పైగా ఎల్ పిజి డీలర్లతో వీడయో కాన్ఫరెన్సింగ్ ద్వారా సంభాషించిన శ్రీ ధర్మేంద్ర ప్రధాన్;  పేదల ప్రయోజనం కోసం ఉజ్వల రీఫిల్స్ ఉచిత వితరణ పెంచాలని సూచన

 

కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు శాఖల మంత్రి శ్రీ ధర్మేంద్రప్రధాన్ దేశంలోని భిన్న ప్రాంతాలకు చెందిన వెయ్యి మందికి పైగా ఎల్ పిజి పంపిణీదారులతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మంగళవారం చర్చలు జరిపారు.

లాక్ డౌన్ సమయంలో కస్టమర్ల ఇళ్లకే గ్యాస్ సిలిండర్లు అందించడంలో వారు చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ కోవిడ్-19పై పోరాటంలో భాగంగా పేదలకు సహాయం చేయడం కోసం ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద పిఎంయువై లబ్ధిదారులకు ప్రకటించిన మూడు ఉచిత ఎల్ పిజి సిలిండర్ల సరఫరాను గరిష్ఠంగా పెంచాలని సూచించారు.

కస్టమర్లకు అందించే ఎల్ పిజి సిలిండర్లను శానిటైజ్ చేస్తూ నోవల్ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు, డెలివరీ సిబ్బంది, వినియోగదారుల భద్రతకు ఎల్ పిజి పంపిణీదారులు  తీసుకుంటున్న చర్యలను మంత్రి శ్రీ ప్రధాన్ కొనియాడారు. కోవిడ్ మహమ్మారి వ్యాప్తిని ఓడించడంలో భాగంగా ముఖానికి మాస్క్ లు, ఆరోగ్య సేతు యాప్, చేతుల శుద్ధి, సామాజిక దూరం ప్రాధాన్యతను డెలివరీ సిబ్బందికి తెలియచేయడంతో పాటు వారి ద్వారా కస్టమర్లలో చైతన్యం పెంచేందుకు కృషిని కొనసాగించాలని ఆయన పంపిణీదారులకు సూచించారు. క్షేత్రస్థాయి పోరాట యోధులుగా పని చేస్తున్న ఈ డెలివరీ సిబ్బంది ఇలాంటి ఉపయోగకరమైన సమాచారాన్ని కస్టమర్లకు చేరవేయడంలో సమర్థులుగా నిరూపించుకున్నారని ఆయన అన్నారు. పని ప్రదేశాల్లో ఇన్ఫెక్షన్ రిస్క్ తగ్గించేందుకు సామాజిక దూరం, శానిటైజేషన్, పారిశుధ్యం ప్రాధాన్యతను మరింతగా వ్యాపింపచేసేందుకు వారు చేస్తున్న మంచి ప్రయత్నం కొనసాగాలని ఆకాంక్షించారు. క్షేత్రస్థాయిలో ముందువరుసలో ఉండే వారి విషయంలో సానుభూతితో వ్యవహరించి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
 

***



(Release ID: 1616971) Visitor Counter : 203