పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా 541 టన్నుల వైద్య వస్తువులను రవాణా చేసి కోవిడ్-19పై తన వంతు పోరాటం చేస్తున్న లైఫ్ లైన్ ఉడాన్ విమానాలు

Posted On: 21 APR 2020 2:15PM by PIB Hyderabad

కోవిడ్-19పై యుద్ధం చేస్తున్న భారత్ చర్యలకు మద్దతుగా పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ ఆపరేట్ చేస్తున్న  లైఫ్ లైన్ ఉడాన్ విమానాలు వైద్య రంగానికి చెందిన అత్యవసర వస్తువులు పరికరాలను మారు మూల ప్రాంతాలకు సైతం రవాణా చేస్తున్నాయి. ఎయిర్ ఇండియాఅలయన్స్ ఎయిర్ఐఏఎఫ్ కి చెందిన లైఫ్ లైన్ ఉడాన్ 316 విమానాలు ఈ లాక్ డౌన్ లో విస్తృతంగా తమ సేవలను అందించాయి. వీటిలో 196 విమానాలు ఒక్క ఎయిర్ ఇండియాఅలయన్స్ ఎయిర్ నడిపినవే ఉన్నాయి. ఈ విమానాలన్నీ ఇప్పటి వరకు 541.33 టన్నుల సరకు రవాణా చేసాయి.  ఇవి మొత్తం 3,14,965 కిలోమీటర్ల గగన తలాన ప్రయాణం చేశాయి. 

పవన్ హంస్ తో పాటు వివిధ కంపెనీల హెలికాప్టర్ సేవలను జమ్మూ కశ్మీర్లడాఖ్ఈశాన్య రాష్ట్రాల్లో వినియోగించి ముఖ్యమైన వైద్య వస్తువులతో పాటు కొందరు రోగులను కూడా తరలించారు. ఈ ఏప్రిల్ 20 వరకు పవన్ హంస్ హెలికాఫ్టర్లు 6,537 కిలోమీటర్లు ప్రయాణం చేసి 1.90 టన్నుల సరుకును రవాణా చేశాయి.  దేశీయ లైఫ్ లైన్  ఉడాన్ కార్గోలో కోవిడ్-19 సంబంధిత కారకాలుఎంజైములువైద్య పరికరాలుపరీక్షా వస్తు సామగ్రివ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈలు), మాస్క్చేతి గ్లోవ్స్హెచ్ఎల్ఎల్,  ఐసిఎంఆర్ కి సంబంధించిన  ఇతర పదార్థాలు ఉన్నాయిరాష్ట్ర / యుటి ప్రభుత్వాలు కోరిన మీదట పోస్టల్ ప్యాకెట్లు కూడా రవాణా  చేశారుదేశీయ లైఫ్ లైన్ ఉడాన్ విమానాలు హబ్ - స్పోక్ మోడల్‌లో పనిచేస్తాయిఈశాన్య ప్రాంతంద్వీప ప్రాంతాలుకొండ ప్రాంతాలున్న రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టారుఎయిర్ ఇండియాఐఎఎఫ్ ప్రధానంగా జమ్మూ కశ్మీర్లడాఖ్ఈశాన్య ఇతర ద్వీప కల్ప ప్రాంతాలకు విస్తృతంగా  సేవలు అందించాయిసరుకులో ఎక్కువ భాగం తేలికపాటి బరువుఎక్కువ విస్తీర్ణాన్ని ఆక్రమించే మాస్కులుచేతి గ్లోవ్స్ఇతర వినియోగ వస్తువులు కలిగి ఉంటుందిఇవి విమానంలో ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి.. ప్రయాణీకుల సీటింగ్ ఏరియాఓవర్ హెడ్ క్యాబిన్లలో సరుకును నిల్వ చేయడానికి ప్రత్యేక అనుమతి తీసుకుని తగిన జాగ్రత్తలతో రవాణా చేసారు. లైఫ్ లైన్ ఉడాన్ విమానాలకు సంబంధించిన ప్రజా సమాచారం ఎప్పటికప్పుడు  https://esahaj.gov.in/lifeline_udan/public_info పోర్టల్ లో అందుబాటులో ఉంటుంది. 

లైఫ్లైన్ ఉడాన్ విమానాలకు రాష్ట్ర ప్రభుత్వాల  గొప్ప  సహకారం అందించాయి,  దేశీయ కార్గో ఆపరేటర్లు స్పైస్ జెట్బ్లూ డార్ట్ఇండిగో వ్యాపార ప్రాతిపదికన కార్గో విమానాలను నడుపుతున్నాయి. స్పైస్ జెట్ మార్చి 24 నుండి 20 ఏప్రిల్ వరకు 447 కార్గో విమానాలను 6,64,675 కిలోమీటర్ల దూరం నడిపి 3516 టన్నుల సరుకును రవాణా  చేసింది. వీటిలో 143 అంతర్జాతీయ కార్గో విమానాలు. బ్లూ డార్ట్ 152 దేశీయ కార్గో విమానాలను 1,49,333 కిలోమీటర్ల దూరం, 2407 టన్నుల సరుకును మార్చి 25 నుండి  ఏప్రిల్ 20 వరకు నడిపింది. ఇండిగో 3-20 ఏప్రిల్ 2020 లో 33 కార్గో విమానాలను నడిపింది 37,160 కిలోమీటర్ల దూరాన్ని, 66 టన్నుల సరుకును తీసుకువెళుతుంది. ప్రభుత్వానికి ఉచితంగా తీసుకునే వైద్య సామాగ్రి కూడా ఇందులో ఉంది.
అంతర్జాతీయంగా సరకు రవాణా గగన మార్గాన్ని, తూర్పు ఆసియాకి రూపొందించారు. ఫార్మస్యూటికల్స్వైద్య పరికరాలుకోవిడ్-19 సహాయ వస్తువుల రవాణా వీటిలో  జరుగుతున్నాయి.  

తేదీ వారీగా పరిమాణం వారీగా తీసుకొచ్చిన సరుకు వివరాలు: 

వరుస సంఖ్య

తేదీ 

సరుకు తెచ్చిన ప్రాంతం 

పరిమాణం(టన్నుల్లో)    

1

04.4.2020

షాంఘై 

21

2

07.4.2020

హాంగ్ కాంగ్ 

06

3

09.4.2020

షాంఘై

22

4

10.4.2020

షాంఘై

18

5

11.4.2020

షాంఘై

18

6

12.4.2020

షాంఘై

24

7

14.4.2020

హాంగ్ కాంగ్ 

11

8

14.4.2020

షాంఘై

22

9

16.4.2020

షాంఘై

22

10

16.4.2020

హాంగ్ కాంగ్ 

17

11

16.4.2020

సియోల్ 

05

12

17.4.2020

షాంఘై

21

13

18.4.2020

షాంఘై

17

14

18.4.2020

సియోల్ 

14

15

18.4.2020

గుయంగ్జో  

04

16

19.4.2020

షాంఘై

19

17

20.4.2020

షాంఘై

26

 

 

మొత్తం 

287

 

అవసరానికి అనుగుణంగాచాల ముఖ్యమైన వైద్య సామాగ్రిని రవాణా చేయడానికి ఎయిర్ ఇండియా ఇతర దేశాలకు ప్రత్యేకించిన షెడ్యూల్ కార్గో విమానాలను నడుపుతుంది.

****


(Release ID: 1616747) Visitor Counter : 196