వ్యవసాయ మంత్రిత్వ శాఖ
లాక్ డౌన్ సమయంలో ప్రధాన మంత్రి కిసాన్ పథకం కింద 8.89 కోట్ల రైతు కుటుంబాలలకు లబ్ధి చేకూరేలా రూ. 17, 793 కోట్ల విడుదల పిఎం జికెవై కింద 19.50 కోట్ల గృహాలకు పప్పు ధాన్యాల పంపిణీ
Posted On:
20 APR 2020 7:57PM by PIB Hyderabad
లాక్ డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా రైతులను ఆదుకోవడానికి వ్యవసాయ రంగ కార్యక్రమాలు సజావుగా సాగడానికిగాను కేంద్ర వ్యవసాయ, సహకార మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ అనేక చర్యలను చేపట్టింది. దీనికి సంబంధించి తాజా వివరాలు ఇలా వున్నాయి.
ప్రధాన మంత్రి సమ్మాన్ నిధి ( పిఎం కిసాన్) పథకం కింద లాక్ డౌన్ సమయంలో అంటే ఈ ఏడాది మార్చి 24నుంచీ ఇంతవరకూ రూ. 17, 793 కోట్లను విడుదల చేయడం జరిగింది. దీంతో దేశవ్యాప్తంగా 8.89 కోట్ల రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరింది. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఏర్పడిన విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు ఆహార భద్రత కల్పించాలనే సంకల్పంతో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (పిఎం- జికె వై) కింద లబ్ధి దారులందరికీ పప్పుదినుసులు పంపిణీ చేయడం జరిగింది. ఇంతవరకూ దాదాపు 107, 077. 85 మెట్రిక్ టన్నుల పప్పుదినుసుల్ని ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పంపిణీ చేశారు.
పిఎంజికెవై కింద అండమాన్ అండ్ నికోబార్ ఐల్యాండ్స్, ఆంధ్రప్రదేశ్, చంఢీగఢ్, ఛత్తీస్‌గఢ్, డామన్ అండ్ డయ్యు, గోవా, గుజరాత్ లలో లబ్ధిదారులకు పప్పుదినుసుల పంపిణీ ప్రారంభమైంది. మధ్య ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీలకు పాక్షికంగా పప్పుదినుసుల్ని పంపడం జరిగింది. వీరు తమ ప్రణాళిక ప్రకారం దశలవారీగా వాటిని పంపిణీ చేస్తారు. దేశవ్యాప్తంగా 19.50 కోట్ల కుటుంబాలకు ఈ పప్పుదినుసుల పంపిణీ లబ్ధి చేకూరుస్తుంది.
*****
(Release ID: 1616562)
Visitor Counter : 308
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Tamil
,
Kannada