ప్రధాన మంత్రి కార్యాలయం

ఇండియా, ఆఫ్ఘ‌నిస్థాన్ లు కోవిడ్ -19 పై సంఘీభావం,ఉమ్మ‌డి సంక‌ల్పంతో క‌ల‌సిక‌ట్టుగా పోరాడుతాయ‌న్న‌ ప్ర‌ధాన‌మంత్రి

Posted On: 20 APR 2020 7:37PM by PIB Hyderabad

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, ఆఫ్ఘ‌నిస్థాన్ అధ్య‌క్షుడు డాక్ట‌ర్ అస్రాఫ్ ఘ‌ని , ట్విట్ట‌ర్ ద్వారా ఇండియాకు కృత‌జ్ఞ‌త‌లు తెల‌ప‌డం పై  స్పందించారు. ఆప్ఘ‌నిస్థాన్‌కు ఇండియా అత్య‌వ‌స‌ర మందులు, హైడ్రాక్సీ క్లోరోక్విన్, పారాసిట‌మాల్‌, ఇతరాల‌ను పంపినందుకు  డాక్ట‌ర్ అష్రాఫ్ ఘ‌ని ఇండియాకు ట్విట్ట‌ర్ వేదిక‌గా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.
ఆఫ్ఘ‌నిస్థాన్ అధ్య‌క్షుడి కి ట్విట్ట‌ర్ ద్వారా స‌మాధాన‌మిస్తూ ప్ర‌ధాన‌మంత్రి శ్రీ‌న‌రేంద్ర మోదీ,“ ఇండియా, ఆఫ్ఘ‌నిస్థాన్లు చారిత్ర‌కంగా, భౌగోళికంగా, సాంస్కృతికంగా  ప్ర‌త్యేక స్నేహాన్ని క‌లిగి ఉన్నాయి.
ఉగ్ర‌వాదానికి వ్య‌తిరేకంగా మ‌నం ఉమ్మ‌డిగా పోరాడాం. అలాగే మ‌నం త‌ప్ప‌కుండా క‌ల‌సిక‌ట్టుగా కోవిడ్ -19పై
సంఘీభావం, ఉమ్మ‌డి సంక‌ల్పంతో పోరాటం సాగిస్తాం” అని పేర్కొన్నారు.



(Release ID: 1616517) Visitor Counter : 200