ఆర్థిక మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 లాక్ డౌన్ సమయంలో 16.01 కోట్ల లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి పబ్లిక్ ఫైనాన్సియల్ మానేజ్మెంట్ సిస్టం (పి.ఎఫ్.ఎం.ఎస్.) ద్వారా ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డి.బి.టి.)ని ఉపయోగించి 36,659 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా బదిలీ


ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజి కింద ప్రకటించిన నగదు ప్రయోజనాలను కూడా డి.బి.టి. డిజిటల్ చెల్లింపుల సదుపాయాన్ని ఉపయోగించి బదిలీ చేస్తున్నారు.


డి.బి.టి. చెల్లింపుల కోసం పి.ఎఫ్.ఎం.ఎస్. వినియోగం గత 3 ఆర్ధిక సంవత్సరాల కాలంలో పెరిగింది.

డి.బి.టి. ద్వారా పంపిణీ చేసిన మొత్తం 2018-19 ఆర్ధిక సంవత్సరంలో 22 శాతం పెరగ్గా, 2019-20 ఆర్ధిక సంవత్సరంలో 45 శాతం పెరిగింది.


డి.బి.టి. వల్ల లబ్ధిదారుల ఖాతాలోకి నగదు ప్రయోజనం నేరుగా జమ అవుతుంది, లీకేజీ తొలగించబడి, సామర్ధ్యం పెరుగుతుంది.

Posted On: 19 APR 2020 3:06PM by PIB Hyderabad

కోవిడ్-19 లాక్ డౌన్ సమయంలో కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ పరిధిలోని వ్యయ విభాగం, కంట్రోలర్ జనరల్ అఫ్ అకౌంట్స్ (సి.జి.ఏ.) కార్యాలయం పబ్లిక్ ఫైనాన్సియల్ మానేజ్మెంట్ సిస్టం (పి.ఎఫ్.ఎం.ఎస్.) ద్వారా ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డి.బి.టి.) ని ఉపయోగించి రూ. 36,659 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని, 16.01 కోట్ల మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా  జమ చేసింది. డి.బి.టి. విధానం వల్ల లబ్ధిదారుల ఖాతాలోకి నగదు ప్రయోజనం నేరుగా జమ అవడంతో పాటు, లీకేజీ తొలగించబడి, సామర్ధ్యం పెరుగుతుంది. 

కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పధకాలు (సి.ఎస్.) / కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పధకాలు (సి.ఎస్.ఎస్.) / సి.ఏ.ఎస్.పి. పధకాలు కింద డి.బి.టి. చెల్లింపుల కోసం పటిష్టమైన డిజిటల్ చెల్లింపుల సాంకేతికత పి.ఎఫ్.ఎం.ఎస్. (పబ్లిక్ ఫైనాన్సియల్ మానేజ్మెంట్ సిస్టం) ను ఉపయోగించి పైన పేర్కొన్న నగదు మొత్తాన్ని బదిలీ చేయడం జరిగింది. 

ముఖ్యాంశాలు :

           i.    కోవిడ్-19 లాక్ డౌన్ సమయంలో (2020 మార్చి 24వ తేదీ నుండి 2020 ఏప్రిల్ 17వ తేదీ వరకు) పబ్లిక్ ఫైనాన్సియల్ మానేజ్మెంట్ సిస్టం (పి.ఎఫ్.ఎం.ఎస్.) ద్వారా ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డి.బి.టి.) ఉపయోగించి 16.01కోట్ల లబ్ధిదారులకు (11.42 కోట్లు [సి.ఎస్.ఎస్. / సి.ఎస్.] + 4.59 కోట్లు [రాష్ట్రాలు]), రూ. 36,659 కోట్ల కంటే ఎక్కువగా ( రూ. 27,442 కోట్లు [ కేంద్ర ప్రాయోజిత పధకాలు సి.ఎస్.ఎస్. + ప్రభుత్వ రంగ పధకాలు (సి.ఎస్.)] + రూ. 9717 [రాష్ట్ర ప్రభుత్వం] ) బదిలీ చేయడం జరిగింది. 

         ii.    ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ప్యాకేజీ కింద ప్రకటించిన నగదు ప్రయోజనాన్ని కూడా డి.బి.టి. డిజిటల్ చెల్లింపుల సదుపాయాన్ని ఉపయోగించి బదిలీ చేయడం జరిగింది.  మహిళల జన్-ధన్ ఖాతాల మహిళా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఐదు వందల రూపాయల చొప్పున జమ చేయడం జరిగింది. 2020 ఏప్రిల్ 13వ తేదీ వరకు 19.86 కోట్ల మంది ఖాతాల్లో, రూ. 9,930 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. (ఆర్ధిక సేవల విభాగం అందజేసిన వివరాల ప్రకారం) 

       iii.    డి.బి.టి. చెల్లింపుల కోసం పి.ఎఫ్.ఎం.ఎస్. వినియోగం గత 3 ఆర్ధిక సంవత్సరాల కాలంలో పెరిగింది. డి.బి.టి. ద్వారా పంపిణీ చేసిన మొత్తం 2018-19 ఆర్ధిక సంవత్సరంలో 22 శాతం పెరిగింది. కాగా, 2019-20 ఆర్ధిక సంవత్సరంలో 45 శాతం పెరిగింది. 

కోవిడ్-19 సమయంలో పి.ఎఫ్.ఎం.ఎస్.ఉపయోగించి డి.బి.టి. చెల్లింపులకోసం బదిలీ చేసిన నగదు ప్రయోజనాల వివరాలు    (24వ తేదీ మార్చి 2020 నుండి 17వ తేదీ ఏప్రిల్ 2020 వరకు ).  

           i.    కోవిడ్-19 లాక్ డౌన్ సమయంలో (24వ తేదీ మర్చి, 2020 నుండి 17వ తేదీ ఏప్రిల్, 2020 వరకు); ప్రధానమంత్రి కిసాన్; మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పధకం (ఎమ్.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్.); జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (ఎన్.ఎస్.ఏ.పి.);  ప్రధానమంత్రి మాతృ వందన యోజన (పి.ఎమ్.ఎమ్.వి.వై.);  జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ( ఎన్.ఆర్.ఎల్.ఎమ్.);  జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్.హెచ్. ఎమ్.); జాతీయ ఉపకారవేతన పోర్టల్ (ఎన్.ఎస్.పి.) ద్వారా వివిధ మంత్రిత్వశాఖలకు చెందిన ఉపకార వేతనాల పధకాలకు చెందిన అన్ని కేంద్ర ప్రభుత్వ రంగ / కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పధకాల కింద  11,42,02,592 లబ్ధిదారుల ఖాతాల్లోకి పి.ఎఫ్.ఎం.ఎస్. ద్వారా  రూ.27,442.08 కోట్లు  మేర డి.బి.టి. చెల్లింపులు చేయడం జరిగింది. 

         ii.    ఇంతవరకు పేర్కొన్న వాటికి అదనంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద మహిళల జన్-ధన్ ఖాతాల మహిళా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఐదు వందల రూపాయల చొప్పున జమ చేయడం జరిగింది.  2020 ఏప్రిల్ 13వ తేదీ వరకు 19.86 కోట్ల మంది ఖాతాల్లో, రూ. 9,930 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. (ఆర్ధిక సేవల విభాగం అందజేసిన వివరాల ప్రకారం)   

       iii.    కోవిడ్-19 సమయంలో ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, త్రిపుర, మహారాష్ట్ర, జమ్మూ, కశ్మీర్, ఆంధ్రప్రదేశ్ వంటి పలు ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు డి.బి.టి. ఉపయోగించి బ్యాంకు ఖాతాల్లోకి నగదు బదిలీ చేశాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు,  2020 మర్చి, 24వ తేదీ నుండి 2020 ఏప్రిల్, 17వ తేదీ వరకు పి.ఎఫ్.ఎం.ఎస్. ఉపయోగించి 180 సంక్షేమ పధకాలకు చెందిన 4,59,03,908  మంది లబ్ధిదారులకు,  రూ. 9,217.22 కోట్లు  పంపిణీ చేశాయి. 

కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పధకాలు / కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న 10 పెద్ద పథకాలకు డి.బి.టి. చెల్లింపుల వివరాలు: 

పధకం 

చెల్లించిన కాలం 

[ 24-మార్చి-2020 నుండి 

17-ఏప్రిల్-2020 వరకు ]

 లబ్ధిదారుల సంఖ్య 

 

 

చెల్లించిన మొత్తం 
(రూపాయలు కోట్లలో)

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పి.ఎమ్.-కిసాన్)-[3624]

8,43,79,326

17,733.53

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం-[9219]

             1,55,68,886

5,406.09

ఇందిరా గాంధీ జాతీయ వృధాప్య పింఛన్ పధకం 

(ఐ.జి.ఎన్.ఓ.ఏ.పి.ఎస్.)-[3163]

93,16,712

999.49

ఇందిరా గాంధీ జాతీయ వితంతు పింఛన్ పధకం 

(ఐ.జి.ఎన్. డబ్ల్యూ.పి.ఎస్.)-[3167]

12,37,925

158.59

జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్-[9156] 

10,98,128

280.80

ప్రధానమంత్రి మాతృ వందన పధకం-[3534]

7,58,153

209.47

మైనారిటీలకు ప్రీ మెట్రిక్ ఉపకారవేతనం-[9253] 

5,72,902

159.86

ఎన్.ఎఫ్.ఎస్.ఏ. కింద ఆహారధాన్యాల వికేంద్రీకృత సేకరణకు ఆహార రాయితీ-[9533] 

2,91,250

19.18

ఇందిరాగాంధీ జాతీయ వికలాంగ పింఛన్ పధకం 

(ఐ.జి.ఎన్.డి.పి.ఎస్.)-[3169]

2,39,707

26.95

జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (ఎన్.ఎస్.ఏ.పి.) - [9182]

2,23,987

30.55

 

          * మొత్తం 11,42,02,592 లబ్ధిదారులకు / చెల్లించిన మొత్తం రూ. 27,442.08 కోట్లు 

             [పైన పొందుపరచిన పేరా (i) ప్రకారం]

రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న 10 పెద్ద పధకాలకు డి.బి.టి. చెల్లింపుల వివరాలు: 

రాష్ట్రం   పధకం 

 చెల్లించిన కాలం 

[ 24-మార్చి-2020 నుండి 

17-ఏప్రిల్-2020 వరకు ]

 

 

 లబ్ధిదారుల సంఖ్య 

చెల్లించిన మొత్తం 
(రూపాయలు కోట్లలో)

బీహార్ 

డి.బి.టి. - విద్యా శాఖ (బి.ఆర్. 47)

1,52,70,541

 1,884.66

బీహార్ 

కరోనా సహాయతా -(బి.ఆర్.142)

   86,95,974

     869.60

ఉత్తరప్రదేశ్ 

వృధావస్థా / కిసాన్ పోషణ్ యోజన -  (9529)  

   53,24,855

     707.91

ఉత్తరప్రదేశ్   

ఉత్తరప్రదేశ్ - జాతీయ వితంతు పింఛను పధకం (3167)-[యు.పి.10]  

   26,76,212

     272.14

బీహార్  

ముఖ్యమంత్రి వృధ్ జన్ పింఛను యోజన [బి.ఆర్.134]

   18,17,100

     199.73

ఉత్తరప్రదేశ్  

కృష్ణావస్థ వికలాంగ్ భరణ్ పోషణ్ అనుదాన్ - [9763]

   10,78,514

     112.14

బీహార్    

 

బీహార్ రాష్ట్ర వికలాంగ పించను పధకం [బి.ఆర్.99]

   10,37,577

       98.39

 అస్సాం 

ఏ.ఎస్.-రాష్ట్ర చందా నుండి వృద్దాప్య పింఛను (ఓ.ఏ.పి.ఎఫ్.ఎస్.సి.)-[ఏ.ఎస్.103]

     9,86,491

       28.88

  బీహార్    

ముఖ్యమంత్రి విశేష సహాయత -[బి.ఆర్.166]

     9,81,879

       98.19

   ఢిల్లీ 

వయోవృద్దులకు ఢిల్లీ ఆర్ధిక సహాయం-[2239]

     9,27,101

     433.61

       

          * మొత్తం 4,59,03,908 లబ్ధిదారులకు / చెల్లించిన మొత్తం రూ. 9217. కోట్లు 

             [పైన పొందుపరచిన పేరా (iii) ప్రకారం]

గత మూడు సంవత్సరాలలో పి.ఎఫ్.ఎం.ఎస్. ద్వారా డి.బి.టి. చెల్లింపుల వృద్ధి :

డి.బి.టి. చెల్లింపుల కోసం పి.ఎఫ్.ఎం.ఎస్. వినియోగం గత 3 ఆర్ధిక సంవత్సరాల కాలంలో పెరిగింది. 2018-19 ఆర్ధిక సంవత్సరంలో లావాదేవీల సంఖ్య (2017-18 ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే) 11 శాతం పెరిగింది. కాగా, 2019-20 ఆర్ధిక సంవత్సరంలో లావాదేవీల సంఖ్య 48 శాతం పెరిగింది.  డి.బి.టి. ద్వారా పంపిణీ చేసిన మొత్తం 2018-19 ఆర్ధిక సంవత్సరంలో 22 శాతం పెరిగింది. కాగా, 2019-20 ఆర్ధిక సంవత్సరంలో 45 శాతం పెరిగింది. 

నేపధ్యం :

డి.బి.టి. కింద చెల్లింపులు, అక్కౌంటింగు, రిపోర్టింగ్ కోడం కంట్రోలర్ జనరల్ అఫ్ అకౌంట్స్(సి.జి.ఏ.) కార్యాలయానికి చెందిన  పబ్లిక్ ఫైనాన్సియల్ మానేజ్మెంట్ విధానం (పి.ఎఫ్.ఎం.ఎస్.) యొక్క తప్పనిసరి వినియోగంపై భారత ప్రభుత్వ, ఆర్ధిక  మంత్రిత్వశాఖ (ఎమ్.ఓ.ఎఫ్.) నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా, 2015 ఏప్రిల్ 1వ తేదీ నుండి ఎలక్ట్రానిక్ చెల్లింపుల దస్త్రాలు పి.ఎఫ్.ఎం.ఎస్. ద్వారా వస్తే తప్ప డి.బి.టి. పధకం కింద పరిశీలించవద్దనీ, అన్ని మంత్రిత్వశాఖలు / విభాగాలు ఎటువంటి చెల్లింపులు చేయవద్దనీ (డిసెంబర్, 2014) ఆదేశించడం జరిగింది.  ప్రస్తుతం గజిబిగా ఉన్న చెల్లింపుల విధానాన్ని సరళీకృతం చేసే విధానంలో భాగంగా భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డి.బి.టి.) విధానాన్ని ఒక భారీ సంస్కరణ చర్యగా భావించవచ్చు. ఈ విధానంలో ఆధార్ కార్డులో పేర్కొన్న సమాచారం ప్రాతిపదికగా ధృవీకరించిన బ్యాంకు  లేదా   తపాలా ఖాతాల్లోకి ప్రభుత్వమే నేరుగా లబ్ధిదారుల వ్యక్తిగత ఖాతాల్లోకి వారి నగదు ప్రయోజనాన్ని బదిలీ చేస్తుంది. 

పి.ఎఫ్.ఎమ్.ఎస్. లో డి.బి.టి. చెల్లింపుల వ్యవస్థ: 

పి.ఎఫ్.ఎం.ఎస్. లబ్ధిదారుల సమాచారాన్ని దిగువ పేర్కొన్న రెండు విధానాలలో ఏ  విధానం ద్వారానైనా పి.ఎఫ్.ఎం.ఎస్. లో నమోదు చేయవచ్చు. 

i.      పి.ఎఫ్.ఎం.ఎస్. యూజర్ ఇంటర్ ఫేస్ నుండి ఎక్సెల్ షీట్ ద్వారా అప్ లోడ్ చేయవచ్చు. మరియు / లేదా  

ii.      ఇంటిగ్రేటెడ్ ఎక్సటెర్నల్ సిస్టం లు / లైన్ అఫ్ బిజినెస్ (ఎల్.ఓ.బి.) అప్లికేషన్స్ కు చెందిన సెక్యూర్ ఫైల్ ట్రాన్సఫర్ ప్రోటోకాల్ (ఎస్.ఎఫ్.టి.పి.) ద్వారా నమోదు చేయవచ్చు.  

iii.     బ్యాంకు ఖాతాలు / తపాలా ఖాతాల ముందస్తు ధ్రువీకరణను, భారత జాతీయ చెల్లింపుల కార్పొరేషన్ కు చెందిన ఆధార్ వ్యవస్థ ద్వారా ఆధార్ సంఖ్యలను పి.ఎఫ్.ఎం.ఎస్. కూడా ధృవీకరించవచ్చు. 

డి.బి.టి. అంటే నగదు, వస్తువు లేదా మరో రూపంలో లబ్దిదారులకు ప్రయోజనాల బదిలీ ఉంటుంది. పధకాలను విజయవంతంగా అమలుచేసినందుకు సామాజిక కార్మికుల వంటి ప్రభుత్వ పధకాలకు సహకరించిన వివిధ సహాయకులకు నగదు బదిలీ లేదా పారితోషికం (గౌరవ వేతనం) బదిలీ చేయడం జరుగుతుంది. 

పి.ఎఫ్.ఎం.ఎస్. ద్వారా  మంత్రిత్వ శాఖలు / విభాగాల నుండి నగదు ప్రయోజనాల బదిలీ :

(ఏ)      మంత్రిత్వశాఖలు / విభాగాల నుండి నేరుగా లబ్ధిదారులకు; 

(బి)     రాష్ట్రాల ట్రెజరీ ఖాతా ద్వారా;  లేదా 

(సి)     కేంద్ర / రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన ఏదైనా అమలు ఏజన్సీ ద్వారా. 

డి.బి.టి. ప్రయోజనాలు : 

డి.బి.టి. సాధించాలని భావిస్తున్నవి (కేర్ ద్వారా) :

1.   దొంగతనం మరియు ఒక పని రెండుసార్లు చేయడాన్ని అరికట్టడం, 

2.   లభిదారుని ఖచ్చితంగా లక్ష్యం చేయడం, 

3.    చెల్లింపుల్లో జాప్యాన్ని తగ్గించడం, మరియు 

4.  ప్రయోజనాన్ని ఎలక్ట్రానిక్ ద్వారా బదిలీ చేయడం, ప్రయోజనాన్ని అందించడంలో పాల్గొనే స్థాయిలను తగ్గించడం. 

 ***** (Release ID: 1616228) Visitor Counter : 298