హోం మంత్రిత్వ శాఖ
ఏప్రిల్ 20 నుంచి లాక్ డౌన్ పరిమితుల సడలింపు మరియు కోవిడ్ -19 నియంత్రణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించాలని ఆదేశించిన కేంద్ర హోంమంత్రి
Posted On:
19 APR 2020 4:59PM by PIB Hyderabad
దేశంలో కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి, నివారణ తదితర అంశాల గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఏప్రిల్ 20 నుంచి లాక్ డౌన్ పరిమితుల సడలింపు విషయంలో కోవిడ్ -19 మహమ్మారి నియంత్రణ గురించి రాష్ట్రాలతో చర్చించాలని ఆదేశించారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ కరోనాతో పోరాడుతోందని, అందువల్ల లాక్ డౌన్ ఆంక్షలతో పాటు జాతీయ ఆదేశాలను కఠినంగా పాటించాల్సిన అవసరం ఉందని హోం మంత్రి తెలిపారు.
పరిస్థితులు సమీక్షిస్తున్న సమయంలో, హాట్-స్పాట్స్ / క్లస్టర్లు / కంటైనర్ జోన్లలోకి రాని ప్రాంతాల్లో కొన్ని కార్యకలాపాలు అనుమతించబడుతున్నప్పటికీ, వాస్తమైన మినహాయింపులు / సడలింపులు మాత్రమే ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హోం మంత్రి తెలిపారు.
గ్రామీణ ఆర్తిక వ్యవస్థకు ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి, గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని ఆర్థిక కార్యకలాపాలు అనుమతించబడ్డాయి. దీని ప్రకారం డిఎంలు / డిసిలు, పరిశ్రమల సహకారంతో కార్మికులను రాష్ట్రంలోని వారి పని ప్రదేశానికి బదిలి చేయాడానికి ఏర్పాట్లు చేయాలి. ఇది ఒక వైపు ఆర్థిక కార్యకలాపాలకు దోహదపడడంతో పాటు, కార్మికులకు ఉపాధి కల్పిస్తుందని శ్రీ మోడీ ప్రభుత్వం నమ్ముతోంది.
అదే విధంగా, పెద్ద పారిశ్రామిక యూనిట్లు, పారిశ్రామిక ఎస్టేట్లు మరియు పారిశ్రామిక సముదాయాలతో పని చేయించడం మీద రాష్ట్రాలు దృష్టి పెట్టాలి. ప్రత్యేకించి కాంప్లెక్స్ లోపల కార్మికులను ఉంచవచ్చు. ఇటువంటి కార్యకలాపాలు ఆర్థిక పునరుజ్జీవనాన్ని ప్రేరేపించడంలో సహాయపడతాయి. అదే సమయంలో కార్మికులకు లాభదాయకమైన ఉపాధికి భరోసా ఇస్తుంది. ఈ క్లిష్ట సమయంలో సమాజంలోని అన్ని వర్గాల హక్కులను పరిరక్షించడానికి మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. వ్యవసాయంతో పాటు ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఏ. కార్యకలాపాల ద్వారా కూలీలకు ఉపాధి కల్పించే అవకాశాన్ని కూడా డిఎంలు / డిసిలు అన్వేషించాలని హోం మంత్రి తెలిపారు.
అదే విధంగా సహాయ శిబిరాల్లో ఉన్న కార్మికుల విషయంలో, వారికి అందించే భోజన నాణ్యతతో పాటు వారి సంక్షేమం మీద అధిక శ్రద్ధ చూపాలని వివరించారు. ప్రస్తుత పరిస్థితి సవాళ్ళతో కూడినదే అయినా అర్థం చేసుకోవడం ద్వారా పరిష్కరించవచ్చని తెలిపారు.
ఇప్పుడు వైద్య బృందాల ద్వారా కమ్యూనిటీ ఆధారిత పరీక్షలు తీసుకుంటున్నందున, ప్రతి వైద్య బృందానికి భద్రత కల్పించేలా రాష్ట్రాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని హోం మంత్రి తెలిపారు. ఎక్కడికైనా పరీక్షల కోసం వెళ్లే ముందు శాంతి కమిటీలను సక్రియం చేయడం ద్వారా మరియు బాధ్యతాయుతమైన సంఘ నాయకులు పాల్గొనడం ద్వారా సమాజంలో కింది స్థాయిలో పని చేయవచ్చన్న ఆయన, కోవిడ్ -19 పరీక్ష, చికిత్స మరియు ఇతర అంశాలకు సంబంధించి ప్రజల్లో భయం మరియు గందరగోళాన్ని అంచనావేయవచ్చని తెలిపారు.
కోవిడ్ -19 పోరాటంలో జాతీయ ఆదేశాలను పూర్తి స్థాయిలో పాటిస్తున్నారో లేదో తెలుసుకునేందుకు, డీఎంలు / డీసీలు పోలీసులు, పంచాయతీ అధికారులు, రెవెన్యూ అధికారులు మొదలైనవారిపై దృష్టి పెట్టడానికి గ్రామీణ ప్రాంతాల్లో నిఘాను మరింత పెంచాల్సి ఉందన్నారు.
*****
(Release ID: 1616148)
Visitor Counter : 291
Read this release in:
Marathi
,
English
,
Urdu
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam