పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 పై పోరాటాన్ని బలోపేతం చేస్తూ, లైఫ్‌లైన్ ఉడాన్ విమానాలు 2,87,061 కిలోమీటర్లు తిరిగాయి
కీలక మందులు,పేషెంట్లను ఈశాన్య రాష్ట్రాలు, జమ్ముకాశ్మీర్, లద్దాక్, ఇతర దీవులకు పవన్ హాన్స్ తో సహా హెలికాప్టర్ సేవల ద్వారా తరలింపు
Posted On:
19 APR 2020 2:22PM by PIB Hyderabad
లైఫ్ లైన్ ఉడాన్ కింద, ఎయిర్ ఇండియా, అలయన్స్ ఎయిర్, ఐఎఎఫ్ ప్రైవేట్ క్యారియర్లు 288 విమానాలను నడుపుతున్నాయి. వీటిలో 180 విమానాలను ఎయిర్ ఇండియా , అలయన్స్ ఎయిర్ నడుపుతున్నాయి. ఈ రోజు వరకు రవాణా చేసిన సరుకు 479.55 టన్నులు. ఇప్పటి వరకు లైఫ్‌లైన్ఉడాన్ విమానాల ద్వారా ప్రయాణించిన గగనతల దూరం 2,87,061 కిలోమీటర్లు.. కోవిడ్ -19 పై భారత్ చేస్తున్న పోరాటంలో భాగంగా దేశంలోని మారుమూల ప్రాంతాలకు అవసరమైన వైద్య సరుకులను రవాణా చేయడానికి ‘లైఫ్‌లైన్ ఉడాన్’ విమానాలను పౌర విమానయాన మంత్రిత్వశాఖ నడుపుతోంది.
పవన్ హన్స్ హెలికాప్టర్లు 2020 ఏప్రిల్ 18 వరకు 626 కిలోమీటర్ల దూరంలోని 1.86 టన్నుల సరుకును తీసుకువెళ్ళాయి. పవన్ హన్స్ లిమిటెడ్ సహా హెలికాప్టర్ సేవలుజమ్ము కాశ్మీర్, లడఖ్, ఇతర దీవులు , ఈశాన్యంలో క్లిష్టమైన ప్రాంతాలలో వైద్య సరుకులను బట్వాడా చేశాయి. రోగులను తరలించాయి. దేశీయ లైప్‌లైన్ ఉడాన్ కార్గోలో కోవిడ్ -19సంబంధిత రీజెంట్లు, ఎంజైములు, వైద్య పరికరాలు, పరీక్షా కిట్‌లు,, వ్యక్తిగత రక్షణ పరికరాలు (పిపిఇలు), ముసుగులు, చేతి తొడుగులు, హెచ్.ఎల్.ఎల్, ఐసిఎంఆర్ ల ఇతర మెటీరియల్ ఉన్నాయి; అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ,కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు తపాలా విభాగానికి చెందిన సరుకులు ఉన్నాయి.
సరకు తరలింపునకు సంబంధించి ఈశాన్య ప్రాంతం, ద్వీప భూభాగాలు , కొండ రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. జమ్ము కాశ్మీర్, లడఖ్, ఈశాన్య ప్రాంతం , ఇతర ద్వీప ప్రాంతాలకుఎయిర్ ఇండియా , ఐఎఎఫ్ ప్రధానంగా తమ సహకారాన్ని అందించాయి.
దేశీయ కార్గో ఆపరేటర్లయిన స్పైస్ జెట్, బ్లూ డార్ట్ ఇండిగో సంస్థలు వాణిజ్య ప్రాతిపదికన కార్గో విమానాలను నడుపుతున్నాయి. స్పైస్ జెట్ 2020 మార్చి 24 నుండి 18 ఏప్రిల్ వరకు 410 కార్గో విమానసర్వీసులను 6,00,261 కిలోమీటర్ల దూరం పంపి 3270 టన్నుల సరుకును గమ్యస్థానం చేర్చింది. వీటిలో 128 అంతర్జాతీయ కార్గో విమానాలు ఉన్నాయి.
2020 మార్చి 25 నుండి 18 ఏప్రిల్ వరకు బ్లూ డార్ట్ 141 దేశీయ కార్గో విమానాలను 1,39,179 కిలోమీటర్ల దూరం నడిపింది. వీటి ద్వారా 2241 టన్నుల సరుకును ఆయా గమ్యస్థానాలకు చేర్చింది. ఇండిగో సంస్థ 2020, ఏప్రిల్ 3 నుంచి 18 వరకు 31 కార్గో విమానాలను 32,290 కిలోమీటర్ల దూరం నడిపి, సుమారు 48 టన్నుల సరుకు రవాణా చేసింది. ఇందులో ప్రభుత్వం కోసం ఉచితంగా రవాణా చేసిన వైద్య సామాగ్రి కూడా ఉంది.
అంతర్జాతీయ రంగం- తూర్పు ఆసియాతో ఔషధాలు, వైద్య పరికరాలు , కోవిడ్ -19 సహాయ మెటీరియల్ రవాణా కోసం కార్గో ఎయిర్ బ్రిడ్జిని ఏర్పాటు చేసిన తరువాత, తేదీ వారీగా తీసుకువచ్చిన మెడికల్ కార్గో వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి..
నెం
|
తేదీ
|
నుంచి
|
టన్నులు
|
1
|
04.4.2020
|
షాంఘై
|
21
|
2
|
07.4.2020
|
హాంకాంగ్
|
06
|
3
|
09.4.2020
|
షాంఘై
|
22
|
4
|
10.4.2020
|
షాంఘై
|
18
|
5
|
11.4.2020
|
షాంఘై
|
18
|
6
|
12.4.2020
|
షాంఘై
|
24
|
7
|
14.4.2020
|
హాంకాంగ్
|
11
|
8
|
14.4.2020
|
షాంఘై
|
22
|
9
|
16.4.2020
|
షాంఘై
|
22
|
10
|
16.4.2020
|
హాంకాంగ్
|
17
|
11
|
16.4.2020
|
సియోల్
|
05
|
12
|
17.4.2020
|
షాంఘై
|
21
|
13
|
18.4.2020
|
షాంఘై
|
17
|
14
|
18.4.2020
|
సియోల్
|
14
|
15
|
18.4.2020
|
గువాంగ్జౌ
|
04
|
|
|
మొత్తం
|
242
|
దక్షిణ ఆసియా పరిధిలో ఎయిర్ ఇండియా 7 ఏప్రిల్ 2020 న సుమారు 9 టన్నుల సరుకులు సరఫరా చేసింది. అలాగే 2020 ఏప్రిల్ 8 న కొలంబోకు సరకు రవాణా చేసింది.
క్రిషి ఉడాన్ కార్యక్రమం కింద ఎయిర్ ఇండియా గత వారం ముంబై- ఫ్రాంక్‌ఫర్ట్ , ముంబై-లండన్ మధ్య రెండు విమానాలను నడిపింది, ముంబై నుండి సీజనల్ పండ్లు , కూరగాయలను తీసుకువెళ్లి సాధారణ సరుకుతో తిరిగి వచ్చింది. ఎయిర్ ఇండియా 2020 ఏప్రిల్ 15 న ఢిల్లీ-సీషెల్స్-మారిషస్- ఢిల్లీ మధ్య మరో విమానాన్ని నడిపింది. ఇందులో వైద్య సామగ్రిని రవాణా చేసింది.
(Release ID: 1616048)
Visitor Counter : 192
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam