పర్యటక మంత్రిత్వ శాఖ

దేఖో అప్ నా దేశ్ పై వెబ్ నార్ సిరీస్ ద్వారా ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని నిర్వహించిన కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ

మానవీయ విలువలు, ప్రియమైన ఆతిథ్యమే భారతీయ వారసత్వాన్ని ప్రపంచానికి తెలియజేస్తుంది – శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్

Posted On: 18 APR 2020 5:34PM by PIB Hyderabad

ప్రపంచ వారసత్వ దినోత్సవం – 2020ని పురస్కరించుకుని కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఈ రోజు వెబ్ నార్ సిరీస్ ద్వారా ఈ దినోత్సవాన్ని నిర్వహించింది. పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ (ఇంచార్జ్) మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ పురాతన ఆలయ నగరమైన మామల్లపురం మీద వెబ్ నార్ సిరిస్ ను ప్రసారం చేశారు. ఈ వెబ్ నార్ లో ప్రపంచం నలుమూలల నుంచి పలువురు పాల్గొన్నారు.

ఈ వెబ్ నార్ లో దేవాలయ నిర్మాణంతో పాటు, మతపరమైన ప్రాముఖ్యతను ప్రధానంగా చూపించారు. వరల్డ్ హెరిటేజ్ అండ్ సస్టైనబుల్ టూరిజం ఎట్ హుమయున్ టూంబ్ పేరుతో రెండో వెబ్ నార్ ను ప్రసారం చేశారు. ప్రపంచ వారసత్వ ప్రదేశాల ప్రాధాన్యత గురించి వివరించడంతో పాటు, హుమయున్ సమాధి మరియు సముదాయాల్లోని ఇతర స్మారక చిహ్నాల వద్ద చేపట్టిన పరిరక్షణ పనుల గురించి తెలియజేసింది.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలు ప్రాచీనమైనవే గాక అమూల్యమైనవని వివరించారు. కోవిడ్ -19తో ప్రపంచం సహా భారతదేశం కూడా పోరాడుతున్న ప్రస్తుత సంక్షోభ సమయంలో భారతీయ వారసత్వం, మానవీయ విలువల ఉన్నతమైన ఆతిథ్య విలువలతో ప్రపంచమంతా నిర్వచిస్తోంది. ఉపనిషత్తుల నుంచి వసుధైవ కుటుంబకం (ప్రపంచమంతా మన కుటుంబం) అనే వాక్యాన్ని ప్రస్తావించిన ఆయన, భారతదేశంలో చిక్కుకుపోయిన పర్యాటకులకు అందించిన సహాయం, ఇచ్చిన ఆతిథ్యం మన దేశ గొప్పతనాన్ని వివరిస్తాయని ఆయన తెలిపారు.  

భారతీయుల జీవితంలో భాగమైన ప్రాచీన జీవన సూత్రాలు ఎంత శాస్త్రీయంగా ఉన్నాయనే విషయాన్ని తెలియజేస్తూ, మానవాళి పుట్టిన నాటి నుంచిర ఎన్నో ప్రయాత్నాల్లో ఈ పురాతన పద్దతులే స్థిరంగా ఉన్నాయని, మన విలువలు పరిష్కారాలను తెలియజేస్తాయని, స్థితిస్థాపకత మనల్ని కలిపి ఉంచుతుందని వివరించారు.

పురాతన భారతదేశంలో మత సూత్రాలు సైతం విజ్ఞాన శాస్త్రం మీద ఆధారపడి ఉన్నాయని గుర్తు చేసిన ఆయన, గుజరాత్ లోని మోడెరా సూర్యదేవాలయంలో 52 స్తంబాల గురించి ప్రస్తావించారు. ఇందులో ప్రతి స్తంబం సంవత్సరంలో క వారానికి గుర్తు అని, భారతదేశ తత్త్వ శాస్త్రం మరియు సంప్రదాయాల లోతైన విజ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకపోవడం మన అజ్ఞానమేనని తెలిపారు. మోడెరా మరియు మామల్ పురంలోని రెండు దేవాలయాలు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు.

నమస్తే గురించి, చెప్పులు లేకుండా ఇంట్లోకి ప్రవేశించడం గురించి, ఇంట్లోకి ప్రవేశించే ముందు స్నానం చేయడం గురించి వివరిస్తూ, చిన్నవిగా అనిపించే ఈ విషయాల్లో ఎంత లోతైన కాలతీత జ్ఞానం ఉందనే విషయాన్ని నొక్కి చెప్పారు. అదే మన దేశ గొప్పతనం అని, లోతైన సారాంశాన్ని సంప్రదాయాల రూపంలో తెలియజేస్తారని వివరించారు.

భారతదేశ స్మారక చిహ్నాలు మన సంప్రదాయం మరియు అమూల్యమైన వారసత్వ సంస్కృతిని తెలియజేస్తాయని, వీటిని సంరక్షిచడం మరియు ప్రదర్శించడాన్ని భారత ప్రధానమంత్రి 2024 విజన్ లో చేర్చారని, ఇది త్వరలోనే సాధ్యం కానుందని ఆయన తెలిపారు. మన పురాతన నాగరికత గొప్పతనాన్ని, వైభవాన్ని పరిగణలోకి తీసుకుంటే ఈ జాబితా మరింత పెరుగుతుందని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని తయారు చేసిన భారత అసంపూర్ణ సాంస్కృతిక వారసత్వ జాతీయ జాబితాను ఆవిష్కరించి దేశ ప్రజలకు అంకితం చేశారు. ఈ జాబితాను సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. కళలు, చేతి వృత్తులు మరియు అనేక ఇతర స్థానిక సంప్రదాయాలు సహా ప్రాచీన నాగరికత లోతు, విస్తారతను పరిగణలోకి తీసుకుంటే ఈ జాబితా మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. 



(Release ID: 1615808) Visitor Counter : 252