రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
ప్రభుత్వం కొవిడ్-19పై పోరాటానికి సహకారం అందిస్తూ అత్యవసరాలు మరియు ఔషధాలను సరఫరా చేయడంలో చురుకైన పాత్ర పోషిస్తున్న జాతీయ ఎరువుల లిమిటెడ్
Posted On:
18 APR 2020 4:43PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వం కొవిడ్-19 నిరోధానికి చేస్తున్నపోరాటానికి సహకారం అందిస్తూ కేంద్ర రసాయన మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం వారి ఎరువుల విభాగం పరిధిలోని జాతీయ ఎరువుల కంపెనీ(ఎన్ఎఫ్ఎల్) అత్యవసరాలు మరియు ఔషధాలు సరఫరా చేయడంలో చురుకైన పాత్రను పోషిస్తున్నది. దేశంలోని వివిధ ఎన్ఎఫ్ఎల్ యూనిట్లు కొవిడ్-19 నిరోధానికి సంబంధించి వివిధ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ దేశసేవలో తమ వంతు సహకారాన్ని అందిస్తున్నాయి.
కంపెనీ చేస్తున్న ఈ కృషిని కేంద్ర రసాయన మరియు ఎరువుల శాఖ మంత్రి శ్రీ డి.వి సదానంద గౌడ ప్రశంసించారు.
ఈ విశ్వమహమ్మారి కొరొనాపై పోరాటంలో భాగంగా ఎన్ఎఫ్ఎల్ భటిండా విభాగం 3,000 మాస్కులను జిల్లా పరిపాలన శాఖకు అందించింది. ఈ మాస్కులను ఎన్ఎఫ్ఎల్ భటిండా యూనిట్ సిజిఎం శ్రీ ఏ.కె.జైన్ ఇతర అధికారులతో కలసి భటిండా ఎస్ఎస్పి శ్రీ నానక్ సింగ్ సమక్షంలో భటిండా జిల్లా కలెక్టర్ శ్రీ బి. శ్రీనివాసన్కు అందించారు.

కాగా ఎన్ఎఫ్ఎల్ పానిపట్ విభాగం జిల్లా సహాయ నిధికి రు.లక్ష విరాళంగా అందించారు. ఈ కంపెనీ ఉద్యోగులు ఇంతకు ముందే తమ ఒక్కరోజు జీతం రు. 88లక్షలను విరాళంగా అందించారు.
ఎన్ఎఫ్ఎల్ మహిళా క్లబ్, నంగల్ విభాగం సుమారు రు.50,000 విలువైన నిత్యావసరాలను నంగల్ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో లాక్డౌన్ కారణంగా చిక్కుకుపోయిన వారికి అందించారు. పంజాబ్లో విధించిన కర్ఫ్యూ కారణంగా క్లబ్ అధ్యక్షురాలు శ్రీ సునీతా మార్కన్ మరియు ఇతర కార్యనిర్వాహక సభ్యులు స్థానిక ఎస్డిఎం సహాయ సహకారాలను తీసుకుని ఈ సరుకులను సరఫరాచేసారు.
కర్ణాటక ఎన్ఎఫ్ఎల్ రాష్ట్ర కార్యాలయం వారు బెంగళూరులోని పబ్లిక్ సర్వీసు అధికారులకు ఎన్95 మాస్కులను మరియు సానిటైజర్లను సరఫరాచేసారు.
ఎన్ఎఫ్ఎల్ సిఎండి శ్రీ మనోజ్ మిశ్రా ఎన్ఎఫ్ఎల్కకు చెందిన ఆసుపత్రుల్లో రాత్రి పగలు తేడా లేకుండా వారి ప్రాణాలను పణంగా పెట్టి మానవత్వంతో తమ విలువైన సేవలను నిరంతరాయం అందిస్తున్న వైద్యలు మరియు ఆరోగ్య సిబ్బంది, కార్యర్తలను ప్రశంసించారు.

(Release ID: 1615795)
Visitor Counter : 208