కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

దేశంలో కార్మికుల ఫిర్యాదులను పరిష్కరించడానికి సమన్వయంతో కృషి చేయడానికి ఒక నోడెల్ అధికారిని నియమించాలని రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలను కోరిన శ్రీ సంతోష్ గాంగ్వార్.

Posted On: 18 APR 2020 2:30PM by PIB Hyderabad

కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోడానికి ప్రకటించిన లాక్ డౌన్ సందర్భంగా దేశంలో కార్మికుల ఫిర్యాదులను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం నెలకొల్పిన కంట్రోల్ రూములతో  సమన్వయంతో పనిచేయడానికి కార్మిక శాఖ నుండి ఒక నోడెల్ అధికారిని నియమించాలని రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర కార్మిక, ఉపాధి శాఖల సహాయమంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్)  శ్రీ సంతోష్ గాంగ్వార్ కోరారు.  ఈ మేరకు ఆయన అన్ని రాష్ట్రాలు  కేంద్ర పాలిత ప్రాంతాల కార్మిక శాఖా మంత్రులకు నిన్న ఒక లేఖ వ్రాస్తూ, కార్మిక శాఖ లోని ఆ అధికారులు దేశవ్యాప్తంగా ఉన్న 20 కంట్రోలు రూములతో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలని సూచించారుకేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కృషి చేయవలసిన అవసరాన్ని శ్రీ గాంగ్వార్ నొక్కి చెబుతూ - " కార్మికుల ఫిర్యాదులు పరిష్కరించడానికి  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలని కోరడమైనది." - అని అన్నారు. 

కోవిడ్-19 నేపథ్యంలో ఎదురౌతున్న కార్మికుల సమస్యల పరిష్కారానికి చీఫ్ లేబర్ కమీషనర్ (సి) నేతృత్వంలో పాన్ ఇండియా ప్రాతిపదికన  కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ ఇటీవల 20 కంట్రోల్ రూములను నెలకొల్పింది.  ప్రారంభంలో ఈ కంట్రోల్ రూములు కేంద్రం పరిధిలోని వేతనాలకూ, వలస కార్మికులకూ సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించేవి

అయితే, గత కొన్ని రోజులుగా ఈ కంట్రోల్ రూముల పని తీరు గమనిస్తే, నిన్నటి దాకా 20 కంట్రోల్ రూములలో దాఖలైన మొత్తం 2,100 ఫిర్యాదులలో, 1400 పిర్యాదులు వివిధ రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినవే ఉన్నాయి.  ఈ నేపథ్యంలో, కార్మిక వ్యవహారాలు ఉమ్మడి విషయమైనందున, ఈ ఫిర్యాదుల పరిష్కారానికి వివిధ రాష్ట్ర / కేంద్ర పాలిట ప్రాంతాల ప్రభుత్వాలతో సరైన సమన్వయము ఏర్పాటు చేయడం చాలా ముఖ్యమని భావించడం జరిగింది.   కేంద్ర ప్రభుత్వం నియమించిన అధికారుల వివరాలతో పాటు ఈ 20 కంట్రోల్ రూముల జాబితాను కూడా మంత్రి ఈ సందర్భంగా వివిధ రాష్ట్ర / కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు పంపించారు.  

*****


(Release ID: 1615759) Visitor Counter : 204