సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

పరీక్ష షెడ్యూల్ ప్రకటనపై స్ప‌ష్ట‌త‌నిచ్చిన ఎస్ఎస్‌సీ

- పీఎం కేర్స్ నిధికి ఒక రోజు జీతాన్ని విరాళంగా ఇవ్వ‌నున్న ఎస్ఎస్‌సీ అధికారులు, సిబ్బంది

Posted On: 16 APR 2020 12:47PM by PIB Hyderabad

క‌రోనా వైర‌స్‌ మ‌హమ్మారి వ్యాప్తి నేప‌థ్యంలో ప‌రిస్ధితిని స‌మీక్షించేందుకు గాను స్టాఫ్‌ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) ఒక ప్ర‌త్యేక స‌మావేశం ఏర్పాటు చేసింది. సామాజిక దూరం నిబంధనలతో సహా ప్రస్తుతం ఉన్న లాక్‌డౌన్ పరిమితుల‌ దృష్ట్యా.. దేశంలోని వివిధ‌ ప్రాంతాల నుండి ప్ర‌యాణించి అభ్యర్థులు హాజ‌రుకావాల్సిన వివిధ ప‌రీక్ష‌ల తేదీల‌ను గురించి ఎప్ప‌టిక‌ప్పుడు సమీక్షించి నిర్ణ‌యం తీసుకోవాల‌ని క‌మిష‌న్ నిర్ణ‌యించింది. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10 + 2) స్థాయి పరీక్ష (టైర్-I) 2019జూనియర్ ఇంజినీర్ (పేపర్-I) పరీక్ష2019స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 'సి' & 'డిపరీక్ష2019కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్2018కి సంబంధించిన నైపుణ్య‌త టెస్ట్ల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించిన‌ తాజా తేదీల‌పై క‌మిష‌న్ మే 3తో ముగియ‌నున్న రెండో ద‌శ లాక్‌డౌన్ త‌రువాత నిర్ణ‌యం తీసుకోనుంది. ఈ పరీక్షల రీషెడ్యూల్ చేసిన తేదీలు కమిషన్ వెబ్‌సైట్లలో మరియు కమిషన్ యొక్క ప్రాంతీయ / ఉప ప్రాంతీయ కార్యాలయాలలో నోటిఫై చేయ‌నున్నారు. ఇతర పరీక్షల షెడ్యూల్‌ను అనుస‌రించి కమిషన్ నోటిఫై చేసిన వార్షిక ప‌రీక్ష‌ల క్యాలెండర్ను త‌దుప‌రి సమీక్షించనున్నారు. ప్ర‌స్తుత విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో స‌ర్కారుకు ఆర్థిక తోడ్పాటును అందించేందుకు గాను ఎస్ఎస్‌సీకి చెందిన అధికారులుసిబ్బంది పీఎం సిటిజెన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యువేషన్ నిధికి (పీఎం కేర్స్ ఫండ్) త‌మ ఒక్క‌ రోజు జీతాన్ని విరాళంగా అందించాలని నిర్ణయించారు.

 



(Release ID: 1614968) Visitor Counter : 241