శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
కోవిడ్ - 19 కేసుల విషయంలో తీవ్రతలేని కేసుల నుంచి, తీవ్రతగలిగిన కేసులకు పురోగతిని అంచనా వేయడానికి తగిన బయోమార్కర్ల గుర్తింపునకు అధ్యయనంవల్ల మెరుగైన చికిత్సకు అవకాశం
, “బయోమార్కర్ల నిర్ణయం ఆధారంగా కోవిడ్ -19కు సంబంధించి తీవ్రతలేని , తీవ్రతకలిగిన కేసుల మధ్య తేడాను గుర్తించడానికి ఇదొక ఆసక్తికరమైన విధానం ....ఇదివిజయవంతమైతే, అధునాతన రోగనిర్ధారణ చికిత్సా విధానాలకు రెండింటికి సహాయపడుతుంది” అని అంటున్న డిఎస్‌టి కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ.
Posted On:
15 APR 2020 7:33PM by PIB Hyderabad
సైన్స్ అండ్ టెక్నాలజీ (డిఎస్టి) పరిధిలోని , సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ (ఎస్ఇఆర్బి) ఒక చట్టబద్ధ సంస్థ. ముంబైలోని కొన్ని ఆసుపత్రుల సహకారంతో కోవిడ్ -19 సోకిన రోగులలో జీవక్రియ మార్పుల పై ఐఐటి బొంబాయి జరుపుతున్న పరిశోధనకుఇది మద్దతు నిస్తోంది..
కోవిడ్ -19 కు సంబంధించి తీవ్రత లేని కేసుల నుంచి తీవ్రత కలిగిన కేసులుగా మారడాన్ని అంచనా వేయడానికి బయోమార్కర్ పేషెంట్లను ఈ అధ్యయనం గుర్తిస్తుంది. రోగనిర్ధారణకు వీలున్న అభ్యర్థులను గుర్తించేందుకు చేసే ప్రయత్నంలో వివిధ రోగుల సమూహాల మెటాబోలైట్ ప్రొఫైలింగ్ ఉంటుంది. మెటాబోలైట్స్ చిన్న జీవఅణువులు, ఇవి అన్ని జీవులలోని పాత్‌వేలను నియంత్రించగలవు.
అత్యాధునిక మాస్ స్పెక్ట్రోమెట్రీ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో నైపుణ్యం ఉన్న ఐఐటి బొంబాయి ప్రొఫెసర్ డాక్టర్ సంజీవ శ్రీవాస్తవ, ముంబైలోని జాస్లోక్ హాస్పిటల్, అంటు వ్యాధుల డైరెక్టర్ డాక్టర్ ఓం శ్రీవాస్తవ్ , డాక్టర్ జయంతి ఎస్ శాస్త్రి, ప్రొఫెసర్ & హెడ్ (మైక్రోబయాలజీ) టిఎన్ మెడికల్ కాలేజ్ అండ్ నాయర్ హాస్పిటల్ , కస్తూర్బాలోని నాయర్ అండ్ జాస్లోక్ హాస్పిటల్ అంటు వ్యాధుల నిపుణులు డాక్టర్ మాలా వినోద్ కనేరియ ఈ పరిశోధనకు ఒక బృందంగా ఏర్పడ్డారు.
హైబ్రిడ్ ట్రిబ్రిడ్ మాస్ స్పెక్ట్రోమీటర్లతో కూడిన, అధునాతన మాస్ స్పెక్ట్రోమెట్రీ-ఆధారిత జాతీయ
స్థాయి కేంద్రం నాసోఫారింజియల్ స్వాబ్, ప్లాస్మా శాంపిళ్ళ విశ్లేషణకు వీలుకల్పిస్తుంది. ప్రోటీమిక్స్ , మెటబోలోమిక్స్ పరిశోధనల కోసం పెద్ద సంఖ్యలో మానవ బయో స్పెసిమన్‌లను నిర్వహించడంలో నైపుణ్యం కలిగిన 20 మందికి పైగా పరిశోధకుల బృందం దీనిపై పని చేస్తోంది..
సవివరమైన జీవక్రియ లేదా ప్రోటీమ్ పరిశోధనల ఆధారంగా బయోమార్కర్ల ను గుర్తించడం ద్వారా కోవిడ్ -11కు సంబంధించి, తేలికపాటి కేసులు , తీవ్రమైన కేసుల మధ్య తేడాను గుర్తించడానికి ఇది ఎంతో ఆసక్తికర విధానం. ఇది విజయవంతమైతే, అధునాతన రోగనిర్ధారణ చికిత్సా వ్యూహాలలో ఇది ఎంతగానో యసహాయపడుతుంది ”అని డిఎస్‌టి కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ అన్నారు.
తేలికపాటి , విలక్షణమైన శ్వాసకోశ లక్షణాలతో కోవిడ్ -19 ధృవీకరించబడిన రోగులు తీవ్రతలేని గ్రూప్‌గా ,శ్వాసకోశ బాధ లేదా వివిధ-అవయవాల వైఫల్యంతో బాధపడుతున్న రోగులు తీవ్రమైన గ్రూప్‌లుగా ఈ అధ్యయనంలో ఉంటారు.ఫ్లూ లక్షణాలు ,ఆర్‌టి-పిసిఆర్ నెగటివ్ ఉన్న రోగులు కంట్రోల్స్‌గా పనిచేస్తారు. రోగి ప్లాస్మా ,స్వాబ్ నమూనాల సహాయంతో వీరి మధ్య జీవక్రియల పోలిక ,వ్యాధి సంక్రమణకు సంబంధించిన పురోగతిని అర్థం చేసుకోవడానికి హోస్ట్ మెటాబోలైట్ ప్రొఫైల్‌లో మార్పులను అంచనా వేయడానికి ఇది ఒక వినూత్న విధానం అవుతుంది. పొటెన్షియల్‌మార్కర్లను గుర్తించడం ద్వారా, వ్యాధి తీవ్రత ఆధారంగా పేషెంట్లమధ్య తేడాను గుర్తించడానికి ఈ అధ్యయనం తోడ్పడుతుంది. తద్వారా కొత్త చికిత్సా విధానాలకు వీలుకలుగుతుంది.
కొవిడ్ -19 మహమ్మారి సమస్యపై ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనా బృందాలు పనిచేస్తున్నాయి. ఈ అధ్యయనాలు చాలావరకు సెల్-లైన్ ఆధారిత పరిశోధనకు పరిమితమయ్యాయి. కానీ,కోవిడ్ -19 తీవ్రతకు సంబంధించి నోవెల్ క్యూలను అందించడానిఇక , కోవిడ్ -19 కు సంబంధించి వివరణాత్మక జీవక్రియ లేదా ప్రోటీమ్ పరిశోధన, దానితోపాటు రోగి క్లినికల్ నమూనాల పరిశీలన చేయవలసి ఉంది.
స్వల్ప లక్షణాలు గల వారి నుండి తీవ్రమైన లక్షణాలు గల వివిధ రోగుల సమూహాల పై నిర్వహించే పరిశోధన, పైకి రోగలక్షణాలు కనిపించని వారిని గుర్తించడానికి , ఇన్‌ఫెక్షన్ మెకానిజాన్ని గుర్తించడానికి వీలుకల్పిస్తుంది. అలాగే బయోలాజికల్ పాత్‌వేల పరంగా కోవిడ్ -19 వ్యాధి తీవ్రత లేని కేసులు , తీవ్రతగలిగిన కేసుల మధ్య వ్యత్యాసం తెలుసుకోవడానికి. భవిష్యత్ చికిత్సా విధానాలకు ఇది ఎంతగానో దోహదపడుతుంది..
మరిన్ని వివరాలకు సంప్రదించండి: డఆక్టర్ సంజీవ శ్రీవాత్సవ, ఐఐటి బాంబే
Email: sanjeeva@iitb.ac.in, మొబైల్: 9167111637
(Release ID: 1614880)
Visitor Counter : 181