సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ

లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుండి సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ 1.27 కోట్లకు పైగా అనాధలు /యాచకులు / నిరాశ్రయులకు ఉచిత భోజన ఏర్పాటు

Posted On: 15 APR 2020 5:48PM by PIB Hyderabad

సామాజిక న్యాయంసాధికారత మంత్రిత్వ శాఖ లాక్ డౌన్  ప్రారంభమైనప్పటి నుండి (ఏప్రిల్ 10వ తేదీ వరకు) 1.27 కోట్లకు పైగా ఆనాధలు / బిచ్చగాళ్లు / నిరాశ్రయులకు ప్రధాన మునిసిపల్ కార్పొరేషన్లతో కలిసి ఉచితంగా  ఆహరం అందించే ఏర్పాట్లు చేసింది. 

మంత్రిత్వ శాఖఒక ప్రాజెక్టు కింద ఇప్పటికే పది (10) నగరాలు ఢిల్లీముంబైకోల్‌కతాచెన్నైహైదరాబాద్బెంగళూరులక్నోనాగ్‌పూర్పాట్నాఇండోర్  ఎంపిక చేసిందిఈ ప్రాజెక్టులో భాగంగా  యాచకుల గుర్తించిపునరావాసంవైద్య సదుపాయాలుకౌన్సెలింగ్విద్య సౌకర్యాలను కలిపిస్తారు. దీనిలో రాష్ట్ర ప్రభుత్వాలు /కేంద్రపాలిత ప్రాంతాలు / స్థానికపట్టణ సంస్థలుస్వచ్ఛంద సంస్థలుమొదలైన వాటి సహకారంతో నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తారు.  ఇందుకు గాను రాష్ట్రాలు / యుటి లకు 100% సహాయం కేంద్రం అందిస్తుంది.

కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో దేశం ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితులలోలాక్ డౌన్ కారణంగాప్రస్తుతం చాలా మంది యాచన చేసుకొనే పరిస్థితి ఉంది. పనులు లేక ఆకలితో బాధ పడుతూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఈ దృష్ట్యా యాచకులుపనిలేని వారికి ఉచితంగా వండిన ఆహారాన్ని అందించడానికి ఆహార కేంద్రాలను ఏర్పాటు చేయాలని , పది నగరాల మునిసిపల్ కార్పొరేషన్లకు ఆదేశాలు వెళ్లాయి. భవిష్యత్తులో సమగ్ర జాతీయ ప్రాజెక్టు పరిధిలోకి తీసుకురాగల వ్యక్తులను గుర్తించడంలో కూడా ఈ చర్య సహాయపడుతుంది.

 

 

ఆహారాన్ని పొందిన అనాధులు/బిచ్చగాళ్ళు/నిరాశ్రయుల నగరాల వారీ వివరాలు ఇలా ఉన్నాయి:

వరుస సంఖ్య 

నగరం పేరు 

ఉచిత భోజనం పొందిన వారి సంఖ్య (లక్షల్లో)

1.

ఢిల్లీ 

75.0

2.

ముంబయి 

9.8

3.

కోలకతా 

1.3

4.

చెన్నై 

3.5

5.

బెంగళూరు 

14.0

6.

హైదరాబాద్ 

7.0

7.

నాగపూర్ 

0.8

8.

ఇండోర్ 

8.4

9.

లక్నో 

7.0

10.

పాట్నా 

0.5

 

మొత్తం 

127.30

 

image.png

*****


(Release ID: 1614876) Visitor Counter : 192