రైల్వే మంత్రిత్వ శాఖ
పార్సిల్ రైళ్ల ద్వారా రైల్వేస్ కి ప్రారంభమైన ఆదాయం; లాక్ డౌన్ సమయంలో 20,400 సరకుల రవాణా; రూ.7.54 కోట్ల ఆదాయం
లాక్ డౌన్ సమయంలో సరఫరా గొలుసు వ్యవస్థకు అనుబంధంగా చిన్న పరిమాణాలలో నిత్యావసర వస్తువుల పార్సిళ్ళు- త్వరగా రవాణా చేయడానికి భారత రైల్వేస్ పార్శిల్ వ్యాన్లు అందుబాటులోకి
ప్రస్తుతం 65 రూట్లలో నడిచిన రైళ్లు; ఏప్రిల్ 14 వరకు 507 రైళ్లలో ఈ సరకు రవాణా
Posted On:
15 APR 2020 3:46PM by PIB Hyderabad
కోవిడ్-19 లాక్ డౌన్ సమయంలో చిన్న పరిమాణంలో వైద్య సామాగ్రి, వైద్య పరికరాలు, ఆహారం మొదలైన ముఖ్యమైన వస్తువుల పార్సిళ్లను రవాణా చేయడం అన్నది చాలా ముఖ్యం. ఈ కీలకమైన అవసరాన్ని తీర్చడానికి, ఇ-కామర్స్ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలతో సహా ఇతర వినియోగదారులకు సంబంధించిన సరకు రవాణా చేయడానికి భారత రైల్వే- రైల్వే పార్శిల్ వ్యాన్లను అందుబాటులోకి తెచ్చింది. నిత్యావసర వస్తువుల నిరంతరాయ సరఫరా చేయడానికి, ఎంపిక చేసిన మార్గాల్లో సమయ-పట్టిక అనుసరించి ప్రత్యేక పార్సిల్ రైళ్లను నడపాలని రైల్వేస్ నిర్ణయించింది. ఈ ప్రత్యేక పార్సిల్ రైళ్ల కోసం జోనల్ రైల్వేలు క్రమం తప్పకుండా రూట్లను గుర్తించి నోటిఫై చేశాయి.
i) దేశంలోని ప్రధాన నగరాలు, ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ మధ్య రెగ్యులర్ కనెక్టివిటీ
ii) రాష్ట్ర రాజధానులు / ముఖ్యమైన నగరాల నుండి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ
iii) ఈశాన్య ప్రాంతాలకు కనెక్టివిటీ
iv) మిగులు సరుకు ఉన్న ప్రాంతాల (గుజరాత్, ఎపి) నుండి అధిక డిమాండ్ ఉన్న ప్రాంతాలకు పాలు, పాల ఉత్పత్తుల సరఫరా
v) ఉత్పత్తి చేసే ప్రాంతాల నుండి ఇతర ప్రాంతాలకు అవసరమైన వస్తువుల (వ్యవసాయ అవసరాలు, మందులు, వైద్య పరికరాలు మొదలైనవి) సరఫరా
ఏప్రిల్ 14వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఉన్న లెక్కల ప్రకారం మొత్తం వివిధ మార్గాల్లో పార్సిళ్ల రవాణాకు 77 రైళ్లు నడిచాయి. వాటిలో 75 రైళ్లు నిర్ధిష్ఠ టైమ్-టేబుల్ ప్రకారం నడిచిన పార్సెల్ స్పెషల్ రైళ్లు. మొత్తం 1835 టన్నుల సామగ్రిని లోడ్ చేయడం ద్వారా ఒకే రోజు రైల్వేకు రూ.63 లక్షల ఆదాయం సమకూరింది.
అదే కాలానికి మొత్తం నడిచిన రైళ్ల సంఖ్య 522 అయితే అందులో నిర్దిష్ట టైం-టేబుల్ ప్రకారం 458 రైళ్లు నడిచి 20,474 టన్నుల సరకులను లోడ్ చేశాయి, వాటి ద్వారా మొత్తం ఆదాయం సుమారు రూ.7.54 కోట్లుగా తేలింది.
*****
(Release ID: 1614759)
Visitor Counter : 214
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada