వ్యవసాయ మంత్రిత్వ శాఖ

లాక్ డౌన్ సమయంలో తొందరగా పాడైపోయే పోయే వస్తువుల అంతర్ రాష్ట్ర రవాణా కు ఉపయోగపడే విధంగా అఖిల భారత వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కాల్ సెంటర్ నంబర్లు 18001804200 మరియు 14488 ప్రారంభించిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్

Posted On: 15 APR 2020 1:28PM by PIB Hyderabad

ప్రస్తుత కోవిడ్-19 లాక్ డౌన్ పరిస్థితుల్లో తొందరగా పాడైపోయే పోయే వస్తువుల అంతర్ రాష్ట్ర రవాణా కు ఉపయోగపడే విధంగా అఖిల భారత వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కాల్ సెంటర్ ను వ్యవసాయం, రైతుల సంక్షేమశాఖ కేంద్ర మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ఈ రోజు కృషి భావం లో ప్రారంభించారు.  ఈ కాల్ సెంటర్ లో ఏర్పాటు చేసిన 18001804200 మరియు 14488 నంబర్లకు ఏ మొబైల్ లేదా ల్యాండ్ లైన్ ఫోన్  నుండి ప్రతీ రోజు 24 గంటల్లో ఎప్పుడైనా ఫోన్ చేయవచ్చు.

 

 

Description: C:\Users\India\Desktop\PIB\C2.JPG   Description: C:\Users\India\Desktop\PIB\C3.JPG

కూరగాయలు, పండ్లు వంటి తొందరగా పాడై పోయే ఉత్పత్తులతో పాటు, వ్యవసాయానికి వినియోగించే విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల అంతర్ రాష్ట్ర రవాణా కు రాష్ట్రాల మధ్య సమన్వయము కోసం వారంలో ఏడు రోజులూ 24 గంటలూ పనిచేసే అఖిల భారత రవాణా కాల్ సెంటర్ ను భారత ప్రభుత్వ వ్యవసాయం, సహకారం, రైతు సంక్షేమ శాఖ (డి.ఏ.సి.&.ఎఫ్.డబ్ల్యూ.) ఏర్పాటు చేసింది. 

వ్యవసాయ, ఉద్యానవన ఉత్పత్తులతో పాటు లేదా విత్తనాలు, ఎరువులతో పాటు తొందరగా పాడై పోయే వస్తువులను అంతర్ రాష్ట్ర రవాణా చేసేటప్పుడు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి ట్రక్కు డ్రైవర్లు, సహాయకులు, ట్రేడర్లు, చిల్లర వర్తకులు, రవాణా సంస్థలు, రైతులు, ఉత్పత్తిదారులు లేదా ఎవరైనా భాగస్వాములు ఈ కాల్ సెంటర్ కు ఫోన్ చేసి తగిన సహకారం పొందవచ్చు.   కాల్ సెంటర్ లో ఉండే అధికారులు రవాణా వాహనం మరియు కన్ సైన్ మెంట్ వివరాలతో పాటు వారికి అవసరమైన సహాయాన్ని పేర్కొంటూ, సమస్య పరిష్కారం కోసం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తారు. 

హర్యానా, ఫరీదాబాద్ లోని ఇఫ్కో కిసాన్ సంచార్ లిమిటెడ్ (ఐ.కె.ఎస్.ఎల్.) కు చెందిన కార్యాలయాల్లో నెలకొల్పిన కాల్ సెంటర్ లైన్లపై పది మంది కస్టమర్ ఎగ్జిక్యూటివ్ లు 24 గంటలు, షిఫ్ట్ కు 8 గంటల చొప్పున 3 షిఫ్టులు పనిచేస్తారు.  అవసరాన్ని బట్టి ఈ కాల్ సెంటర్ సేవలను 20 సీట్ల పూర్తి సామర్ధ్యానికి పెంచుతారు.  ఈ కాల్ సెంటర్ లో పనిచేసే ఎగ్జిక్యూటివ్ లు సమస్యల వివరాలు నమోదుచేసుకుని, వాటిని వేగంగా పరిష్కరించడానికి కృషి చేస్తారు.  

అఖిల భారత వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కాల్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రులు శ్రీ పురుషోత్తం రూపాలా, శ్రీ కైలాష్ చౌదరి, ఏ.సి.&.ఎఫ్.డబ్ల్యూ. కార్యదర్శి శ్రీ సంజయ్ అగర్వాల్ తో పాటు మంత్రిత్వ శాఖ కు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు. లాక్ డౌన్ సమయంలో క్షేత్రస్థాయిలో రైతులకు, వ్యవసాయ కార్యకలాపాలకు ప్రయోజనం చేకూర్చడం కోసం డి.ఏ.సి.&.ఎఫ్.డబ్ల్యూ. చేపట్టిన అనేక చర్యల్లో భాగంగా ఈ 24 X 7 కాల్ సెంటర్ ను ప్రారంభించారు.  

 

 

 

Description: C:\Users\India\Desktop\PIB\C1.JPG

*****


(Release ID: 1614697)