ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ప్రతి కారుచీకటిలో ఒక కాంతి రేఖ : డాక్టర్ హర్షవర్దన్
భారతీయ పరిశ్రమల సమాఖ్య పెద్దలతో సమావేశమైన డాక్టర్ హర్షవర్ధన్
Posted On:
14 APR 2020 9:31PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ , వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 50 మంది భారత పరిశ్రమ నాయకులతో సమావేశం నిర్వహించారు. దీనిని భారతీయ పరిశ్రమల సమాఖ్య(సిఐఐ) ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా ఆయన సిఐఐ అధ్యక్షుడు శ్రీ విక్రమ్ కిర్లోస్కర్, ప్రెసిడెంట్ డిజిగ్నేట్ సిఐఐ ఉదయ్ కోటక్, సిఐఐ డైరక్టర్ జనరల్ శ్రీ చంద్రజిత్ బెనర్జీ, సిఐఐ నేషనల్ హెల్త్‌కేర్ కౌన్సిల్,సిఎండి, మెదాంత ఛైర్మన్ డాక్టర్ నరేష్ టెహరాన్, హీరో ఎంటర్ ప్రైజెస్ శ్రీ సునీల్ కాంత్ ముంజాల్, గ్లోబల్ అలయెన్స్ ఫర్ ఇంప్రూవ్డ్ న్యూట్రిషన్ (జిఎఐన్) మాజీ ఛైర్మన్ వినీతా బాలి, మహీంద్రా, మహీంద్రా లిమిటెడ్‌కు చెందిన డాక్టర్ పవన్ గోయంకా, ఆర్.సి.బి కన్సల్టింగ్ ఛైర్మన్ ఆర్.సి.భార్గవ, సిఐఐ నేషనల్ కమిటీ ఆన్ బయోటెక్నాలజీ ,ఫౌండర్ లతో సమావేశమయ్యారు.
కోవిడ్ -19 పై పోరాటంలొ భాగంగా ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ సహాయక చర్యలపై డాక్టర్ హర్ష్ వర్ధన్ పరిశ్రమ వర్గాలకు వివరించారు. వారితో మాట్లాడుతున్నప్పుడు, సరఫరా వ్యవస్థలో ఏర్పడే అంతరాయాలతో పాటు ఆరోగ్య సంరక్షణ రంగం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై మంత్రి స్పందించారు.
కోవిడ్ -19 కి వ్యతిరేకంగా పోరాటంలో ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనానికి తీసుకుంటున్న చర్యలు, పరీక్షా సదుపాయాల లభ్యత, క్వారంటైన్ సౌకర్యాలు, ఔ షధ పరిశ్రమకు ముడి పదార్థాల సరఫరా, వ్యాధి పర్యవేక్షణ, టెలిమెడిసిన్ సౌకర్యాల వాడకం, నివారణ, ఆరోగ్య సంరక్షణ మొదలైన వాటికి సంబంధించి వారి భయాలను ఆయన తొలగించారు. ప్రతి చీకటి మేఘం చివర మెరిసే వెండి కిరణంలా మన స్ఫూర్తిని ఉన్నతస్థాయిలో ఉంచుకోవాలి. అప్పడే మనం దీనినుంచి బయటపడగలం. అని ఆయన అన్నారు. ఆధునిక ప్రపంచ చరిత్రలో ఇది అత్యంత చీకటి అధ్యాయం . మానవజాతి దీనినుంచి బయటపడవలసి ఉంది. దీనినుంచి మంచి విషయాలను మనం స్వీకరించాలి.
కోవిడ్ -19 కారణంగా ఎదురైన పరిస్థితులను దృష్టిలోఉంచుకుని , మేక్ ఇన్ ఇండియా అవకాశాలను బాగా ఉపయోగించుకోవాలని , మరింత ఉత్సాహంగా ముందుకు పోవాలని డాక్టర్ హర్ష్ వర్ధన్ వారికి సూచించారు. , తద్వారా ఈ మహమ్మారిపై పోరాటంలో ఆరోగ్య సంరక్షణ పరికరాలను అందించడంలో దేశం మరంతి బలపడి, స్వావలంబన సాధించగలదన్నారు. "పారిశ్రామిక కార్యకలాపాలను దశలవారీగా సురక్షితమైన రీతిలో ఎలా ప్రారంభించాలో" ప్రభుత్వం చర్చలు జరుపుతోందని ఆయన వారికి తెలియజేశారు.
ప్రస్తుత సంక్లిష్ట సమయంలో ప్రభుత్వానికి అండగా నిలిచిన,ఈ సమావేశంలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ మహమ్మారి కారణంగా పారిశ్రామిక రంగం పెద్ద కుదుపునకు లోనైందని ఆయన అన్నారు. రాగల రోజులలో తిరి పారిశ్రామికరంగాన్ని పూర్వపు స్థితికి తీసుకురావడానికి తీసుకోవలసిన చర్యలపై ప్రభుత్వం మేథోమథనం చేస్తోందని ఆయన అన్నారు.
భారతదేశం విశాలమైన దేశమని , దాని ప్రగతి గాథలో పారిశ్రామిక రంగం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. మేక్ ఇన్ ఇండియాకు ఆరోగ్య సంరక్షణ రంగం అనేక అవకాశాలను అందిస్తోందని, ఇందులో పాల్గొనాలని ఆయన పరిశ్రమ వర్గాలను కోరారు. కోవిడ్ మహమ్మారి కారణంగా ఎదురైన తీవ్ర పరీక్షా సమయంలో దేశం కోసం ఇది సాకారమయ్యేలా చూడాలని ఆయన పరిశ్రమ వర్గాలను కోరారు..
(Release ID: 1614617)
Visitor Counter : 157