పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా ప్రజలకు నిత్యావసర వైద్య సరఫరాలు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం, విమానయాన పరిశ్రమ కట్టుబాటు

ఈశాన్య భారతంలోను, మారుమూల ప్రాంతాల్లోను నిరంతర సరఫరా కోసం కోవిడ్ పోరాట యోధుల కఠోర శ్రమ కొనసాగింపు

Posted On: 14 APR 2020 7:47PM by PIB Hyderabad

అత్యవసరమైన ఔషధాలను సమర్థరంతంగా, తక్కువ ఖర్చుతో దేశ, విదేశాలకు, మారుమూల ప్రాంతాలకు వాయుమార్గంలో తరలించడం ద్వారా కోవిడ్-19పై భారతదేశం జరుపుతున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, విమానయాన పరిశ్రమ నిర్ణయించాయి. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ దేశంలోను, విదేశాల్లోను అత్యవసర ఔషధాల రవాణా కోసం "లైఫ్ లైన్ ఉడాన్" పేరిట రవాణా విమాన సర్వీసులు నడుపుతోంది.

ఈ లైఫ్ లైన్ ఉడాన్ కింద ఎయిరిండియా, అలయన్స్ ఎ యిర్, ఐఏఎఫ్, ప్రయివేటు విమానయాన సంస్థలు 227 విమానాలు నడుపుతున్నాయి.  వాటిలో 138 విమానాలను ఎయిరిండియా, అలయన్స్ ఎయిర్ లే నడుపుతున్నాయి. ఈ రోజు వరకు 407.40 టన్నుల కార్గో రవాణా చేశాయి. లైఫ్ లైన్ ఉడాన్ కింది ఈ రోజు వరకు నడిచిన వాయుమార్గ దూరం 2,20,129 కిలోమీటర్లుంది. కోవిడ్ వారియర్స్ సరైన సమయానికి మారుమూల ప్రాంతాలకు ఔషధాలు నిరంతరాయంగా సరఫరా చేసేందుకు కఠోర శ్రమను కొనసాగిస్తాయి.

జమ్ము కశ్మీర్, లదాఖ్, దీవులు, ఈశాన్య ప్రాంతాలకు అత్యవసర వైద్య సరఫరాలు పంపడానికి, రోగులను తరలించడానికి పవన్ హాన్స్ సంస్థ హెలీకాప్టర్ సర్వీసులు నడుపుతోంది.
లైఫ్ లైన్ ఉడాన్ తరలించిన అత్యవసర కార్గోలో కోవిడ్-19కి సంబంధించిన రీజెంట్లు, ఎంజైమ్ లు, వైద్యపరికరాలు, టెస్టింగ్ కిట్లు, వ్యక్తిగత రక్షణ పరికరాలు (పిపిఇ), మాస్క్ లు, గ్లవ్ లు; హెచ్ఎల్ఎల్, ఐసిఎంఆర్ కు చెందిన ఇతర పరికరాలు;  రాష్ట్రప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కోరిన వస్తువులు, పోస్టల్ ప్యాకెట్లు ఉన్నాయి.

దేశీయ కార్గో ఆపరేటర్లు స్పైస్ జెట్, బ్లూడార్ట్, ఇండిగో వాణిజ్య ప్రాతిపదికన కార్గో విమానాలు నడుపుతున్నాయి. 2020 మార్చి 24 నుంచి ఏప్రిల్ 13 తేదీల మధ్య కాలంలో స్పైస్ జెట్ 350 కార్గో విమానాలు నడిపి 4,50,139 కిలోమీటర్ల దూరం ప్రయాణించి 2645 టన్నుల కార్గో తరలించింది. వాటిలో 100 అంతర్జాతీయ కార్గో విమానాలున్నాయి. 2020 మార్చి 24 నుంచి ఏప్రిల్ 13 తేదీల మధ్య కాలంలో బ్లూడార్ట్ 104 దేశీయ కార్గో విమానాలు నడిపి 1,01,042 కిలోమీటర్ల దూరం ప్రయాణించి 1636 టన్నుల కార్గోను తరలించింది. 2020 ఏప్రిల్ 3 నుంచి 13 తేదీల మధ్య కాలంలో ఇండిగో విమానయాన సంస్థ 21,906 కిలోమీటర్ల నిడివి గల దూరం 25 కార్గో విమానాలు నడిపి 21.77 టన్నుల కార్గోను తరలించింది. ఇందులో ఉచితంగా తరలించిన ప్రభుత్వం పంపిన వైద్య సరఫరాలు కూడా ఉన్నాయి.

అంతర్జాతీయ గమ్యాలు
ఎయిరిండియా ఏప్రిల్ 13న ముంబై-లండన్ మధ్య తొలి విమానాన్ని నడిపి 28.95 టన్నుల పళ్లు, కూరగాయలు తీసుకువెళ్లి 15.6 టన్నుల సాధారణ కార్గో మెటీరియల్ తో తిరిగి వచ్చింది. ఆయా దేశాల అవసరాలకు అనుగుణంగా అత్యవసర వైద్య సరఫరాలతో ఎయిరిండియా పలు ఇతర దేశాలకు కూడా ప్రత్యేక కార్గో సర్వీసులు నడిపింది. ఒక్క దక్షిణాసియా ప్రాంతంలోనే ఎయిరిండియా 2020 ఏప్రిల్ 7వ తేదీన 9 టన్నుల కార్గో, 2020 ఏప్రిల్ 8వ తేదీన కొలంబోకు  4 టన్నుల కార్గో తరలించింది. 

2020 ఏప్రిల్ 4వ తేదీ నుంచి అత్యవసర ఔషధాలు, వైద్య పరికరాలు, కోవిడ్-19 సహాయ సామగ్రి తరలించేందుకు ఒక గగనతల వారధి ఏర్పాటు చేశారు. రోజువారీగా తరలించిన మెడికల్ కార్గో వివరాలు ఇలా ఉన్నాయి.

 

ప్ర‌యాణించిన‌  మొత్తం కిలోమీట‌ర్లు

2,20,129 కిలోమీట‌ర్లు

12-04-2020 రోజున త‌ర‌లించిన కార్గో  

29.90 ట‌న్నులు

12-04-2020 వ‌ర‌కు త‌ర‌లించిన మొత్తం కార్గో

377.50 + 29.90 = 407.40 ట‌న్నులు

 

 

తేదీల‌వారీగా న‌డిచిన లైఫ్ లైన్ ఉడాన్ విమానాల వివ‌రాలు :

సీరియ‌ల్ నంబ‌ర్‌

తేదీ

ఎయిరిండియా

అల‌య‌న్స్

ఐఏఎఫ్‌

ఇండిగో

స్పైస్ జెట్‌

మొత్తం

1

26.3.2020

2

-

-

-

2

4

2

27.3.2020

4

9

1

-

-

14

3

28.3.2020

4

8

-

6

-

18

4

29.3.2020

4

9

6

-

-

19

5

30.3.2020

4

-

3

-

-

7

6

31.3.2020

9

2

1

-

-

12

7

01.4.2020

3

3

4

-

-

10

8

02.4.2020

4

5

3

-

-

12

9

03.4.2020

8

-

2

-

-

10

10

04.4.2020

4

3

2

-

-

9

11

05.4.2020

-

-

16

-

-

16

12

06.4.2020

3

4

13

-

-

-

13

07.4.2020

4

2

3

-

-

9

14

08.4.2020

3

-

3

-

-

6

15

09.4.2020

4

8

1

-

-

13

16

10.4.2020

2

4

2

-

-

8

17

11.4.2020

5

4

18

-

-

27

18

12.4.2020

2

2

-

-

-

4

19

13.4.2020

3

3

3

 

 

9

 

Total

72

66

81

6

2

227

 


 

సీరియ‌ల్ నంబ‌ర్‌ 

తేదీ 

ఎక్క‌డ నుంచి

మొత్తం ప‌రిమాణం (ట‌న్నులు)

1

04.4.2020

షాంఘై

21

2

07.4.2020

హాంకాంగ్‌

6

3

09.4.2020

షాంఘై

22

4

10.4.2020

షాంఘై

18

  5

11.4.2020

షాంఘై

18

6

12.4.2020

షాంఘై 

24

 

 

మొత్తం

109

 

 

 

 

స్పైస్ జెట్ త‌ర‌లించిన దేశీయ కార్గో (తేదీ 13-04-2020)

తేదీ 

విమానాల సంఖ్య‌

ట‌న్నులు

కిలోమీట‌ర్లు

13-04-2020

10

111.14

9,900

 

 

స్పైస్ జెట్ త‌ర‌లించిన అంత‌ర్జాతీయ కార్గో (తేదీ 13-04-2020)

తేదీ 

విమానాల సంఖ్య‌

ట‌న్నులు

కిలోమీట‌ర్లు

13-04-2020

5

55.86

13,706

 

 

బ్లూడార్ట్ కార్గో (తేదీ 13-04-2020)

తేదీ 

విమానాల సంఖ్య‌

ట‌న్నులు

కిలోమీట‌ర్లు

13-04-2020

10

156.40

8,967.25

 

 

 


(Release ID: 1614616) Visitor Counter : 159