వ్యవసాయ మంత్రిత్వ శాఖ
లాక్ డౌన్ నేపథ్యంలో ఐసిఏఆర్ కార్యకలాపాలను సమీక్ష చేసిన వ్యవసాయ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్
మనుషులపై కోవిడ్-10 పరీక్షలలో నిమగ్నమైన మూడు ఐసిఏఆర్ సంస్థలు
లాక్ డౌన్ లో దేశవ్యాప్తంగా కోట్లాది రైతులకు సహాయకారిగా అనేక చర్యలు చేపట్టిన ఐసిఏఆర్
అన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఆన్ లైన్ లో తరగతులు నిర్వహించవలసిందిగా ఆదేశించిన శ్రీ తోమర్
Posted On:
14 APR 2020 5:46PM by PIB Hyderabad
కోవిడ్-19 వ్యాప్తి చెందడం, దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా ఉన్న సమస్యలను అధిగమించడానికి రైతులకు సహాయపడటంలో తీసుకుంటున్న చర్యలపై కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసిఎఆర్) కార్యకలాపాలను సమీక్షించారు. మూడు ఐసిఎఆర్ సంస్థలు మానవులపై కోవిడ్-19 పరీక్షలో నిమగ్నమై ఉండగా, లాక్ డౌన్ సమయంలో రైతులకు సహాయం చేయడానికి ఐసిఎఆర్ అనేక ప్రయత్నాలు చేపట్టింది. దేశవ్యాప్తంగా కోట్ల మంది రైతులకు సలహాసూచనలు ఇస్తోంది. అన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయాలను ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని శ్రీ తోమర్ ఆదేశించారు.
ఐసిఎఆర్ రైతుల కోసం జాతీయ, రాష్ట్ర-నిర్దిష్ట సలహాలను జారీ చేసిందని, 15 ప్రాంతీయ భాషలలోకి అనువదించిన ఈ సలహాలను డిజిటల్ వేదికల ద్వారా విస్తృతంగా ప్రచారం చేసిందని ఐసిఎఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రిలోచన మోహాపాత్ర సమీక్ష సమావేశంలో వెల్లడించారు. వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలకు ఇచ్చిన మినహాయింపుల గురించి రైతులకు తగిన విధంగా తెలియజేస్తున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమైన వ్యవసాయ కార్యకలాపాల సమయంలో. అన్ని జాగ్రత్తలను అనుసరించాలని ఆయన అన్నారు.
వ్యవసాయ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ఆదేశాల మేరకు ఇప్పటికే 5.48 కోట్లకు పైగా రైతులకు అన్ని రాష్ట్రాలలో 1,126 సలహాసూచనలను ఎం.కిసాన్ పోర్టల్ ఉపయోగించి కృషి విజ్ఞాన కేంద్రాలు (కెవికె) ద్వారా చేరవేశారు. వాట్సాప్ గ్రూపులు (5.75 లక్షల మంది రైతులకు చేరుకునేలా 4893 కెవికె వాట్సాప్ గ్రూపులు), ఇతర డిజిటల్ వేదికలు (8.06 లక్షల మంది రైతులకు చేరుకోవడం) ద్వారా కూడా సలహాసూచనలు విస్తృతంగా చేరాయి. ఈ మేరకు కెవికె జారీ చేసిన 936 ప్రకటనలు వార్తాపత్రికలలో ప్రచురణయ్యాయి. 193 రేడియో చర్చలు, 57 టీవీ కార్యక్రమాల ద్వారా సందేశాలు ప్రసారం చేశారు.
నైపుణ్య వ్యవస్థలు, మొబైల్ యాప్ లతో సహా ఐసిటి సాధనాలను పరిశోధనా సంస్థలు ఉపయోగించాయి. వీటి ద్వారా గోధుమ, వరి, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనె గింజలు, చెరకు, ఫైబర్ పంటలు, మామిడి, సిట్రస్, అరటి, దానిమ్మ, ద్రాక్ష, లిట్చి, సుగంధ ద్రవ్యాలు, పువ్వులు, కూరగాయలు, పుచ్చకాయలు, కొబ్బరి, కోకో, గడ్డ దినుసు పంటలకు సాగు నిర్వహణ సాంకేతికతలను తెలియజేస్తున్నారు.
మత్స్య పరిశ్రమలో నిమగ్నమైన వివిధ భాగస్వాములకు సమాచారం అందించడం ఐసిఎఆర్ ఆధ్వర్యంలోని ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ పలు అంశాలను సిద్ధం చేశాయి.
మానవులలో కొవిడ్-19 పరీక్ష కోసం తమ మూడు పరిశోధనా సంస్థలు ఎన్ఐహెచ్ఎస్ఏడి-భోపాల్, ఐవిఆర్ఐ-ఇజత్నగర్, ఈక్విన్స్పై ఎన్ఆర్సి-హిసార్ ను ఐసిఎఆర్ నోటిఫై చేసింది. పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ ద్వారా జంతుశాలల్లో జంతువుల నుండి నమూనాలను కొవిడ్ పరీక్ష చేయడం కోసం కూడా ఈ సంస్థలను నియమించింది. ఆరోగ్యసేతు యాప్ గురించి సుమారు 25 లక్షల మంది రైతులకు సమాచారం చేరవేస్తే ఇప్పటికే 2.92 లక్షల మంది రైతులు ఆ యాప్ ని డౌన్ లోడ్ చేసుకున్నారు.
****
(Release ID: 1614515)
Visitor Counter : 155