సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 నేపథ్యంలో డి.ఓ.పి.టి., డి.ఏ.ఆర్.పి.జి. & డి.ఓ.పి.పి.డబ్ల్యూ. ల పని తీరును సమీక్షించిన డాక్టర్ జితేంద్ర సింగ్.

12 రోజుల్లో కోవిడ్-19 కు సంబంధించి ఏడు వేలకు పైగా ప్రజా ఫిర్యాదులను పరిష్కరించడం జరిగింది - డాక్టర్ సింగ్.


"డి.ఓ.పి.టి. సే- లెర్నింగ్ ప్లాట్ ఫామ్ ఐ.జి.ఓ.టి." వద్ద ఇంతవరకు 71 వేల మందికి పైగా వ్యక్తులు నమోదు.

Posted On: 13 APR 2020 4:43PM by PIB Hyderabad

కోవిడ్-19 నేపథ్యంలో డి.ఓ.పి.టి., డి.ఏ.ఆర్.పి.జి., డి.ఓ. పి.పి.డబ్ల్యూ. మూడు శాఖలు చేపట్టిన పని గురించి ఈశాన్య ప్రాంత అభివృద్ధి (డి.ఓ.ఎన్.ఈ.ఆర్.), ఎమ్.ఓ.ఎస్. పి.ఎమ్.ఓ., సిబ్బంది, ప్రజా పిర్యాదులు, పింఛన్లు, అణు శక్తి మరియు అంతరిక్ష శాఖల కేంద్ర సహాయ మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్) డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా    సమీక్షా సమీవేశం నిర్వహించారు.  మహమ్మారిపై పోరుకు సంబంధిత శాఖల సంసిద్ధతను సమీక్షించడంతో పాటు, ఈ  సమయంలో  పని అసలు దెబ్బతినకుండా చూడాలని మంత్రి అధికారులనూ,  సిబ్బందినీ కోరారు

.

 

కోవిడ్-19 కు సంబంధించిన ఫిర్యాదులపై స్పందించేందుకు డాక్టర్ జితేంద్ర సింగ్ 2020 ఏప్రిల్ 1వ తేదీన  https://darpg.gov.in. పోర్టల్ పై  నేషనల్ మానిటరింగ్ డాష్ బోర్డు ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.  కోవిడ్సి-19 పై  .పి.జి.ఆర్.ఏ.ఎం.ఎస్. లో దాఖలైన ప్రజా ఫిర్యాదులను ఏ విధంగా పరిష్కరించాలి అనే విషయమై అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు / విభాగాలు మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు సర్క్యూలర్లు జారీ చేయడం జరిగింది.  కోవిడ్-19 పి.జి. కేసులపై రోజువారీ నివేదికలను 2020 ఏప్రిల్ 1వ తేదీ నుండి, సాధికారిక బృందం - 10, ప్రధానమంత్రి కార్యాలయం, మంత్రుల సాధికార బృందం మరియు సిబ్బంది, పి.జి., పింఛన్లు శాఖల సహాయ మంత్రి కి దాఖలు చేయాలి

 

2020 ఏప్రిల్ 12వ తేదీ వరకు ప్రభుత్వం 7,000 కోవిడ్-19 ప్రజా ఫిర్యాదులను (అంటే సరాసరిన 1.57 రోజులకు ఒక పిర్యాదు చొప్పున) పరిష్కరించింది.  ఎక్కువ సంఖ్యలో కోవిడ్-19 ఫిర్యాదులను పరిష్కరించిన మంత్రిత్వ శాఖలు / విభాగాలలో వరుసగా విదేశీ వ్యవహారాల శాఖ (1625 పిర్యాదులు);  ఆర్ధిక మంత్రిత్వ శాఖ (1043 పిర్యాదులు);  కార్మిక శాఖ (751 పిర్యాదులు) ఉన్నాయి.  ఒక రోజులో అత్యధికంగా 2020 ఏప్రిల్ 8 మరియు 2020 ఏప్రిల్ 9 తేదీలలో రోజుకు 1315 ఫిర్యాదుల చొప్పున వచ్చాయి. 

కోవిడ్-19 పై పోరాడేందుకు ఏర్పాటుచేసిన డి.ఓ.పి.టి.సే-లెర్నింగ్ ప్లాట్ ఫార్మ్ (https://igot.gov.in) వద్ద ఇంతవరకు 71,000 మందికి పైగా వ్యక్తులు తమ పేర్లు నమోదు చేసుకున్నందుకు డాక్టర్ జితేంద్ర సింగ్ సంతృప్తి వ్యక్తం చేశారు. గత వారం ప్రారంభించిన ఈ వేదిక నుండి సుమారు 27,000 మంది తమ కోర్స్ పూర్తి చేసుకున్నారు.  ఈ వేదికను ముఖ్యంగా వైద్యులు,నర్సులుపారామెడికల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, సాంకేతిక నిపుణులు, ఏ.ఎన్. ఎమ్. లు., కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పౌర, రక్షణ అధికారులు,  వివిధ పోలీసు సంస్థలు,  నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్.సి.సి.);  నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ (ఎన్.వై.కె.ఎస్.);  నేషనల్ సర్వీస్ స్కీం (ఎన్.ఎస్.ఎస్.); ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (ఐ.ఆర్.సి.ఎస్.);  భారత్ స్కౌట్స్ & గైడ్స్ (బి.ఎస్.జి.);  మరియు ఇతర స్వచ్చంద కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని ఏర్పాటు చేశారు

ఈ వేదిక కోవిడ్-19 కు సంబంధించి నిర్ణీత విషయాన్ని ప్రతి అభ్యర్ధికి అతను పనిచేసే ప్రదేశం లేదా ఇల్లు లేదా అతనికి ఇష్టమైన ప్రదేశంలో ఎక్కడైనా నేర్చుకోడానికి వీలుగా రూపొందించబడింది.  ఎంత ఎక్కువ మందికైనా నేర్పడానికి వీలుగా ఐ-జి.ఓ.టి. రూపొందించబడింది.  వచ్చే మరి కొన్ని వారాల్లో దాదాపు 1.50 కోట్ల మంది కార్మికులుస్వచ్చంద కార్యకర్తలకు శిక్షణ ఇవ్వనున్నారు. ఐ-జి.ఓ.టి. ని ఇప్పుడు తొమ్మిది (9) కోర్సులతో ప్రారంభించడం జరిగింది.  

ఆ కోర్సుల వివరాలు ఇలా ఉన్నాయి

కోవిడ్ గురించి ప్రాధమిక పరిజ్ఞానం;  

ఐ.సి.యు. కేర్ మరియు వెంటిలేటర్ ని ఉపయోగించడం; 

క్లినికల్ యాజమాన్యం; 

వ్యక్తిగత రక్షణ పరికరాల ద్వారా ఇన్ఫెక్షన్ రాకుండా నివారించడం; 

ఇన్ఫెక్షన్ నియంత్రణ మరియు నివారణ; 

క్వారంటైన్ మరియు ఐసోలేషన్; 

ప్రయోగశాల నమూనా సేకరణ మరియు పరీక్ష; 

కోవిడ్-19 కేసుల నిర్వహణ; 

కోవిడ్-19 పై శిక్షణ. 

  

<><><><><> 


(Release ID: 1614091) Visitor Counter : 280