వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
కరోనా మహమ్మారి కారణంగా ఎగుమతిదారు ఇబ్బందులను తొలగించేందుకు పలు రాయితీలు, వివిధ గడువు తేదీల పొడిగింపునకు అవకాశం కల్పించిన డిపార్టమెంట్ ఆఫ్ కామర్స్
Posted On:
11 APR 2020 6:16PM by PIB Hyderabad
కరోనా మహమ్మారి కారణంగా నెలకొన్ని ఒత్తిడినేపథ్యంలో వ్యాపార వర్గాల వారికి, వ్యక్తులకు ఉపశమనం కలిగించే పలు చర్యలను వాణిజ్యం , పరిశ్రమల మంత్రిత్వశాఖకు చెందిన వాణిజ్య విభాగం పలు రాయితీలను, తమ విభాగానికి సంబంధించి వివిధ పథకాల కింద పాటించాల్సిన గడువు తేదీల పొడిగింపునకు నిర్ణయం తీసుకుంది. డిపార్టమెంట్ ఆఫ్ కామర్స్‌కు సంబంధించిన కీలక మినహాయింపులు కింది విధంగా ఉన్నాయ.ఇ
ఎ. డిజిఎఫ్‌టి చే విదేశీ వాణిజ్య విధానం (ఎఫ్‌టిపి) 2015-20 కింద ఫెసిలిటేషన్
1. 2020 మార్చి 31 తదనంతరం ఎఫ్.టి.పి పొడిగింపు: 2020 మార్చి 31 వరకు అమలులోఉన్న విదేశీ వాణిజ్య విదానం(ఎఫ్.టి.పి) 2015-2020, హ్యాండ్ బుక్ ప్రొసీజర్లను ( హెచ్ బిపి) 2021 మార్చి 31 వ తేదీ వరకు మరో ఏడాది పొడిగిస్తూ నిర్ణయం.
2. అడ్వాన్స్ ఆథరైజేషన్లు, ఇపిసిజి ఆథరైజేషన్లు: ఎగుమతులు చేయాల్సిన బాధ్యతా కాలం పొడిగింపు
i) అడ్వాన్స్ ఆథరైజేషన్, ఇపిసిజి ఆధరైజేషన్ల విషయంలో 2020 ఫిబ్రవరి 1 నుంచి 31 జూలై 2020 మధ్య గడువు తీరిన లేదా గడువు తీరనున్న ఎగుమతి బాధ్యతా కాలాన్ని గడువు తీరిన తర్వాత ఆరు నెలల కాలం పొడిగిస్తూ నిర్ణయం.
ii) దిగుమతి చెల్లుబాటు కాలం గడువు ముగిసిన లేదా 2020 ఫిబ్రవరి 1 నుండి 2020 జూలై 31 మధ్య గడువు ముగిసిన అడ్వాన్స్ ఆథరైజేషన్స్ , ఇపిసిజి ఆథరైజేషన్లకు సంబంధించి, దిగుమతుల చెల్లుబాటు గడువు ముగిసిన తేదీ నుండి మరో ఆరు నెలల వరకు పొడిగించబడింది.
iii) బ్లాక్ వారీగా ఎగుమతి బాధ్యతను నెరవేర్చడానికి బ్లాక్ కాలం గడువు ముగిసిన లేదా 2020 ఫిబ్రవరి 1 నుండి 2020 జూలై 31 మధ్య గడువు ముగిసే ఇపిసిజి అధికారాలకు సంబంధించి, బ్లాక్ వ్యవధి గడువు ముగిసిన తేదీ నుండి మరో ఆరు నెలల వరకు పొడిగించబడింది.
iv) ఇ.పి.సి.జి ఆథరైజేషన్లకు సంబంధించి, సంబంధిత ఆర్ ఎ ముందు ఇన్‌స్టాలేషన్ సర్టిఫికెట్‌ను సమర్పించే గడువు ముగిసిన లేదా 2020 ఫిబ్రవరి 1 నుండి 2020 జూలై 31 మధ్య గడువు ముగిసే వాటి విషయంలో , గడువు ముగిసన తేదీ నుండి మరో ఆరు నెలల వరకు గడువు పొడిగించబడింది..
3. రిజిస్ట్రేషన్ కమ్ మెంబర్‌షిప్ సర్టిఫికేట్ (ఆర్‌సిఎంసి) చెల్లుబాటును మార్చి 31, 2020 అనంతర సమయానికి పొడిగింపు :
2020 సెప్టెంబర్ 30 వరకు ఏదైనా ప్రోత్సాహకం ఆథరైజేషన్ల కోసం దరఖాస్తుదారుల నుండి చెల్లుబాటు అయ్యే ఆర్‌సిఎంసి కోసం డిజిఎఫ్‌టి పట్టుబట్ట రాదని నిర్ణయించారు (2020 మార్చి 31 న లేదా అంతకు ముందే గడువు ముగిసిన సందర్భాలలో )
4.ఇండియా స్కీమ్ నుండి సేవా ఎగుమతులు (SEIS): ఎస్ఇఐఎస్ కింద వార్షిక క్లెయిమ్‌లు సమర్పించడానికి తుది గడువు సంబంధిత క్లెయిమ్ కాలానికి సంబంధించిన ఆర్థిక సంవత్సరం ముగిసినప్పటి నుంచి 12 నెలలు. ఇది 2018-19 సంవత్సర క్లెయిమ్‌లకు తుది గడువు 2020 మార్చి 31. దీనిని 31 డిసెంబర్ 2020 వరకు పొడిగించారు.
5. ఇండియా నుంచి మర్చండైజ్ ఎక్స్‌పోర్ట్స్ పథకం (MEIS) : ఎం.ఇ.ఐ.ఎస్ క్లెయిమ్‌లను దాఖలు చేయడానికి చివరి తేదీ ప్రతి షిప్పింగ్ బిల్లు ఎల్ఇటి ఎక్స్‌పోర్ట్ ఆర్డర్ (LEO) తేదీ నుండి 1 సంవత్సరం, దాని తర్వాత లేట్ కట్‌తో మరో రెండు సంవత్సరాలు, . లేట్‌కట్‌లేకుండా ఎం.ఇఎఐఎస్ క్లెయిమ్‌లు సమర్పించడానికి ఆఖరు తేదీని ప్రారంభ సంవత్సర కాల గడువు ముగిసిన తర్వాత నుంచి మరో మూడు నెలల వరకూ పొడిగించారు. ఫిబ్రవరి 1,2020 న లేదా ఆ తర్వాత గడువు ముగుస్తున్న లేదా 31 మే 2020 న లేదా అంతకు ముందు గడువువ ముగిసే వాటికి ఇది వర్తిస్తుంది.
6. కేంద్ర , రాష్ట్ర పన్నులు, లెవీల రిబేట్ ( ఆర్ ఒ ఎస్‌సిటిఎల్): 30 జూన్ 2020 కి చెందిన, మార్చి 7 నుంచి 31 డిసెంబర్ 2019 మధ్యగల ఎగుమతుల షిప్‌మెంట్ కు సంబంధించి ఆర్.ఒ.ఎస్‌సిటిఎల్ క్లెయిములు దాఖలుకుచివరి తేదీని 31 డిసెంబర్ 2020 కి పొడిగించారు.
7. స్టేటస్ హోల్డర్ : ఐఇసి హోల్డర్‌కు ఎఫ్‌టిపి 2015-20 కింద జారీ చేసిన అన్ని స్టేటస్ సర్టిఫికెట్ల చెల్లుబాటు గడువును 2021 మార్చి 31 వరకు పొడిగించారు.
8. హ్యాండ్ బుక్ ఆఫ్ ప్రొసీజర్ నిబంధనల కింద (హెచ్‌బిపి) రెమిషన్లు :
హ్యాండ్‌బుక్ ఆఫ్ ప్రొసీజర్ (హెచ్‌బిపి) పారా 4.12 (vi) కింద, ధృవీకరించబడిన నిబంధనల చెల్లుబాటును తేదీ 31.3.2020 కి పరిమితం లేదా మూడు సంవత్సరాల కాలం ఏది తరువాత అయితే అది. ఇది విదేశీ వాణిజ్య విధానం పొడిగించిన తేదీ లేదా 3 సంవత్సరాలు, ఏది తరువాత అయితే అది గా కో-టెర్మినస్‌గా సడలించబడింది.
(Release ID: 1613500)
Visitor Counter : 264