కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 కార్యకలాపాలకు సంబంధించి సి.ఎస్.ఆర్. ఖర్చులకు అర్హత పై ఎమ్.సి.ఏ. తరచుగా అడిగే ప్రశ్నలు.
Posted On:
11 APR 2020 7:07PM by PIB Hyderabad
కోవిడ్-19 కార్యకలాపాలకు సంబంధించి సి.ఎస్.ఆర్. ఖర్చులకు అర్హతపై వివిధ భాగస్వాముల నుండి స్పష్టత కోరుతూ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అనేక సందేహాలు / సూచనలు అందుతున్నాయి.
ఈ విషయమై, తరచుగా అడిగే కొన్ని ప్రశ్నలను (ఎఫ్.ఏ.క్యూ.లు) తగిన వివరణలతో సహా భాగస్వాముల అవగాహన కోసం ఇక్కడ పొందుపరచడం జరిగింది.
క్రమ సంఖ్య |
తరచుగా అడిగే ప్రశ్నలు (ఎఫ్.ఏ.క్యూ.)
|
సమాధానం / వివరణ |
1.
|
"ప్రధానమంత్రి కెర్స్ నిధి" కి ఇచ్చిన విరాళాలు సి.ఎస్.ఆర్. ఖర్చుగా అర్హత పొందుతాయా?
|
కంపెనీల చట్టం, 2013 షెడ్యూల్-VII కి చెందిన ఐటమ్ నెంబరు (viii) కింద ప్రధానమంత్రి కెర్స్ నిధికి ఇచ్చిన విరాళాలు సి.ఎస్.ఆర్.ఖర్చుగా అర్హత పొందుతాయి. మరియు, ఈ విషయం ఆఫీస్ మెమొరాండం : ఎఫ్.నెంబర్: సి.ఎస్.ఆర్.-05/1/2020-సి.ఎస్.ఆర్.-ఎమ్.సి.ఏ., తేదీ 28 మార్చి, 2020 ద్వారా మరింతగా వివరించబడింది.
|
2.
|
"ముఖ్యమంత్రి సహాయ నిధి" కి లేదా "కోవిడ్-19 కోసం రాష్ట్ర
సహాయ నిధి" కి ఇచ్చిన విరాళాలు
సి.ఎస్.ఆర్. ఖర్చుగా
అర్హత పొందుతాయా?
|
"ముఖ్యమంత్రి సహాయ నిధి" కి లేదా "కోవిడ్-19 కోసం రాష్ట్ర సహాయ నిధి"
కి ఇచ్చిన విరాళాలు కంపెనీల చట్టం, 2013 కి చెందిన షెడ్యూల్-VII లో పొందుపరచలేదు. అందువల్ల, ఇటువంటి నిధులకు ఇచ్చే ఏ విరాళాలు సి.ఎస్.ఆర్. ఖర్చుగా అర్హత పొందవు.
|
3.
|
రాష్ట్ర విపత్తు యాజమాన్య సాధికార సంస్థ కు ఇచ్చిన విరాళాలు సి.ఎస్.ఆర్. ఖర్చుగా అర్హత పొందుతాయా?
|
కోవిడ్-19 ను ఎదుర్కోడానికి రాష్ట్ర విపత్తు యాజమాన్య సాధికార సంస్థ కు ఇచ్చిన విరాళాలు కంపెనీల చట్టం, 2013 కి చెందిన షెడ్యూల్-VII లోని ఐటమ్ నెంబరు :(xii) కింద, మరియు జనరల్ సర్కులర్ నెంబర్: 10/2020, తేదీ 23 మర్చి, 2020 ప్రకారం
సి.ఎస్.ఆర్. ఖర్చుగా అర్హత పొందుతాయి.
|
4.
|
కోవిడ్-19 కు సంబంధించిన కార్యకలాపాలకు వినియోగించిన సి.ఎస్.ఆర్.నిధులు సి.ఎస్.ఆర్.ఖర్చుగా అర్హత పొందుతాయా?
|
కోవిడ్-19 కు సంబంధించిన కార్యకలాపాలకు వినియోగించిన సి.ఎస్.ఆర్.నిధులు సి.ఎస్.ఆర్.ఖర్చుగా అర్హత పొందుతాయని - మంత్రిత్వ శాఖకు చెందిన జనరల్ సర్కులర్ నెంబర్: 10/2020 తేదీ 23 మార్చి, 2020 స్పష్టత ఇచ్చింది.
షెడ్యూల్-VII లోని ఐటమ్ నెంబర్లు : (i) & (xii) కింద కోవిడ్-19 కి సంబంధించి ఆరోగ్య సంరక్షణ, పారిశుధ్యం, విపత్తు యాజమాన్యం వంటి ఆరోగ్య పరిరక్షణ కోసం ఖర్చు చేయవచ్చునని కూడా స్పష్టత ఇవ్వడం జరిగింది.
షెడ్యూల్-VII లో సర్కులర్ నెంబర్: 21/2014 తేదీ 18.06.2014 ప్రకారం పేర్కొన్న వస్తువులపై కూడా విస్తృత ప్రయోజనం కోసం ఉదారంగా ఖర్చు చేయవచ్చు.
|
5.
|
లాక్ డౌన్ సమయంలో కాంట్రాక్టు కార్మికులతో సహా ఉద్యోగులకు, కార్మికులకు చెల్లించిన వేతనాలు / జీతాలు సి.ఎస్.ఆర్.ఖర్చు కింద సర్దుబాటు చేయవచ్చా?
|
సాధారణ పరిస్థితుల్లో జీతాలు / వేతనాలు చెల్లించడం కంపెనీ యొక్క ఒప్పంద పరమైన మరియు చట్టపరమైన బాధ్యత.
అదేవిధంగా, లాక్ డౌన్ సమయంలో కూడా వారికి వేరే ప్రత్యామ్నాయ ఉపాధి లేదా జీవనోపాధి అవకాశం ఉండదు కాబట్టి, ఆ సమయంలో కూడా జీతాలు/వేతనాలు చెల్లించడం యజమాని నైతిక బాధ్యతగా భావించాలి.
అందువల్ల, లాక్ డౌన్ సమయంలో ( సామాజిక దూరం పాటించడం వంటి నిబంధనలు పాటిస్తూ) ఉద్యోగులకు చెల్లించిన జీతాలు/వేతనాలు సీ.ఎస్.ఆర్. ఖర్చు కింద అర్హత పొందడం కుదరదు.
|
6.
|
లాక్ డౌన్ సమయంలో తాత్కాలిక / రోజువారీ కార్మికులకు చెల్లించిన జీతాలు సి.ఎస్.ఆర్.ఖర్చు కింద కంపెనీ సర్దుబాటు చేయవచ్చా?
|
లాక్ డౌన్ సమయంలో తాత్కాలిక / రోజువారీ కార్మికులకు జీతాలు చెల్లించడం సంస్థ యొక్క నైతిక / మానవతా / ఒప్పంద పరమైన బాధ్యతలుగా పరిగణించాలి. కంపెనీల చట్టం, 2013 కి చెందిన సెక్షన్ 135 కింద సి.ఎస్.ఆర్. కంట్రిబ్యూషన్ కోసం చట్టపరమైన బాధ్యత ఉన్నా లేకపోయినా అన్ని కంపెనీలకు ఇది వర్తిస్తుంది.
అందువల్ల, లాక్ డౌన్ సమయంలో తాత్కాలిక / రోజువారీ కార్మికులకు చెల్లించిన జీతాలు సి.ఎస్.ఆర్.ఖర్చు కింద సర్దుబాటు చేయకూడదు.
|
7.
|
తాత్కాలిక / రోజువారీ కార్మికులకు చెల్లించిన ఎక్స్-గ్రేషియా మొత్తం సి.ఎస్.ఆర్. ఖర్చు కింద అర్హత పొందుతుందా?
|
తాత్కాలిక / రోజువారీ కార్మికులకు వారికి చెల్లించే జీతాలకు అదనంగా, ప్రత్యేకంగా కోవిడ్-19 పై పోరాటానికి సంబంధించి చెల్లించిన ఎక్స్-గ్రేషియా మొత్తాన్ని సి.ఎస్.ఆర్. ఖర్చుగా ఆమోదించవచ్చు. అయితే, ఇది ఒక సారి మాత్రమే చెల్లించే మొత్తంగా కంపెనీ బోర్డు నుండి స్పష్టమైన ప్రకటన చేయడంతో పాటు, దీన్ని స్టాట్యూటరీ ఆడిటర్ ధృవీకరించవలసి ఉంటుంది.
|
****
(Release ID: 1613489)
Visitor Counter : 303