గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

కరోనా వైరస్ నుండి ప్రాథమిక రక్షణ కోసం ట్రైఫెడ్ పారిశ్రామికులు/స్వయం సహాయక బృందాలు, వన్ ధన్ లబ్దిదారులు మరియు స్వచ్ఛంద సంస్థల వారిచే తయారు చేయబడిన మాస్కుల సరఫరాకు ప్రతిపాదన

Posted On: 11 APR 2020 2:47PM by PIB Hyderabad

గిరిజన మంత్రిత్వ శాఖ వారి పరిధిలోని ట్రైఫెడ్(టిఆర్ఐఎఫ్ఇడి) వారు గిరిజన శ్రామికులతో, స్వయం సహాయక బృందాలు, వన్ ధన్ లబ్దిదారులు మరియు స్వచ్ఛంద సంస్థల వారితో చేనేత, హస్తకళలు మరియు సహజ వస్తువుల ఉత్పత్తులను తయారు చేయించి వారికి మార్కెటింగులో సహాయ సహకారాలను అందిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో వారు తమకు మరియు వారి వర్గాలకు సహాయంగా మాస్కుల తయారీ  చేపట్టారు. వీరిలో కొందరు స్థానిక యంత్రాంగానికి కూడా ఈ మాస్కులను సరఫరా చేస్తున్నారు. వీరు తమ తమ ఇళ్ళ నుండే తయారు చేసే మాస్కులను  వారి ధరలు మరియు సామర్థ్యాన్ని బట్టి ప్రభుత్వానికి సరఫరా చేయడానికి సమ్మతిని తెలిపారు. వారు తయారు చేసే మాస్కుల వలన రక్షణతోపాటు  జీవనాధారం కూడా లభిస్తున్నది. ఈ విపత్కర పరిస్థితుల్లో అదనపు మాస్కుల సరఫరాదారుల కోసం  ట్రైఫెడ్ ప్రయత్నిస్తోంది.

విశ్వమహమ్మారి కొవిడ్-19 దేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను వివిధ స్థాయిల్లో దెబ్బతీస్తున్నది. దీని ప్రతికూల ప్రభావం వ్యాపార మరియు పారిశ్రామిక రంగాలతోపాటు అన్ని రంగాలపై తీవ్రంగా ఉన్నది. పేదలు మరియు మధ్యతరగతి వారు తీవ్ర ప్రభావానికి లోనవుతున్నారు. కాగా వ్యవసాయ రంగంలో ప్రస్తుతం కోతలు, పంటనూర్చే సమయం మరియు అటవీ ఉత్పత్తులు వచ్చే సమయం. కావున  ఆయా రంగాల వారు తమ తమ పనులు చేకుకోవడానికి ప్రాథమికంగా మాస్కుల అవసరం ఎంతైనా ఉంది.


(Release ID: 1613325) Visitor Counter : 206