రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

స్ర్కీనింగ్, ఐసొలేషన్, క్వారంటైన్ కోసం రెండు బెడ్ల టెంట్లు తయారుచేసిన ఒఎఫ్ బి;

అరుణాచల్ ప్రదేశ్ కు 50 టెంట్ల సరఫరా

Posted On: 11 APR 2020 9:28AM by PIB Hyderabad

కరోనా వైరస్ పై (కోవిడ్-19) పోరాటంలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు (ఒఎఫ్ డి) చురుకైన పాత్ర పోషిస్తోంది. కరోనా మహమ్మారిపై పోరాటంలో వారం రోజుల కాలంగా ఒఎఫ్ బి చేస్తున్న అవిశ్రాంత కృషికి సంబంధించిన వివరాలు...
 
రెండు బెడ్ల టెంట్లు
స్ర్కీనింగ్, ఐసొలేషన్, క్వారంటైన్ వసతులు, వైద్యపరికరాలతో కూడిన రెండు బెడ్ల టెంట్లతో కూడిన ఐసొలేషన్ వార్డుల తయారీ అత్యంత చవుకైన పరిష్కారంగా ఒఎఫ్ బి ముందుకు తెచ్చింది. మెడికల్ ఎమర్జెన్సీ, మెడికల్ స్క్రీనింగ్, హాస్పిటల్ చికిత్స, క్వారంటైన్ వసతులకు ఈ ప్రత్యేక టెంట్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. 9.55 చదరపు మీటర్ల విస్తీర్ణం గల ఈ మాస్క్ లను వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్, తేదీక పాటి స్టీల్, అల్యూమినియం అల్లాయ్ తో తయారుచేశారు.

ఏ ప్రాంతంలో అయినా, ఎలాంటి కష్టమైన ప్రదేశాల్లో అయినా అతి తక్కువ సమయంలో ఈ టెంట్లు ఏర్పాటు చేసి సాంప్రదాయిక అస్పత్రులకు భిన్నంగా అదనపు వైద్య వసతులు కల్పించవచ్చు. కాన్పూర్ లోని ఆర్డినెన్స్ పరికరాల ఫ్యాక్టరీ వీటిని తయారుచేసింది. అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి ఇప్పటికే అలాంటివి 50 టెంట్లు సరఫరా చేశారు.

హ్యాండ్ శానిటైజర్లు, ఫేస్ మాస్క్ లు
ఒఎఫ్ బికి అనుబంధ విభాగం అయిన డెహ్రాడూన్ లోని ఆప్టో ఎలక్ర్టానిక్ ఫ్యాక్టరీ 2020 ఏప్రిల్ 6వ తేదీన ఉత్తరాఖండ్ గవర్నర్ కు 2500 బాటిళ్ల (ఒక్కోటి 100 ఎంఎల్) హ్యాండ్ శానిటైజర్లు, 1000 ఫేస్ మాస్క్ లు విరాళంగా అందించింది.
 
అలాగే ఒఎఫ్ బి అనుబంధ విభాగం అయిన అరువంకడులోని కార్డైట్ ఫ్యాక్టరీ తమిళనాడులోని నీలగిరి జిల్లా పోలీసు అధికారులకు 2020 ఏప్రిల్ 8వ తేదీన 100 లీటర్ల శానిటైజర్లు అందచేసింది.

పూణేలోని హై ఎక్స్ ప్లోజివ్స్ ఫ్యాక్టరీ (హెచ్ఇఎఫ్) 2020 ఏప్రిల్ 9వ తేదీన బెల్గావిలోని హెచ్ఎల్ఎల్ కు తొలి బ్యాచ్ గా 2500 లీటర్ల శానిటైజర్ పంపింది.

ఫ్యూమిగేషన్ చాంబర్ 
నాగపూర్ లోని అంబాఝరి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ శానిటైజేషన్ అవసరాల కోసం ఒక ఫ్యూమిగేషన్ చాంబర్ తయారుచేసింది. ఎక్కడకు కావాలంటే అక్కడకు తేలిగ్గా తరలించుకుపోగల వెసులుబాటు దానికి ఉంది. ఒఫాజ్ హాస్పిటల్ ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద దాన్ని ఏర్పాటు చేశారు.

హ్యాండ్ వాషింగ్ వ్యవస్థ 
దేశీయంగా అభివృద్ధి చేసిన, పెడల్ పై ఏ ప్రాంతానికైనా తొక్కుకుంటూ తీసుకుపోగల, సోప్ డిస్పెన్సర్ కూడా అందుబాటులో ఉండే హ్యాండ్ వాషింగ్ వ్యవస్థను డెహ్రాడూన్ లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ 2020 ఏప్రిల్ 7వ తేదీన పోలీసు అధికారులకు అందచేసింది. 

పూణెలోని దెహూ రోడ్ లో ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ 2020 ఏప్రిల్ 6వ తేదీన కార్మికులకు ఆహార కిట్లు పంపిణీ చేసింది.



(Release ID: 1613253) Visitor Counter : 242