మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

శరీరం మొత్తం సానిటైజేషన్ పరికరాన్ని తయారు చేసిన ఐఐటి(భువనేశ్వర్) ఆవిష్కరణ కేంద్రం

Posted On: 10 APR 2020 7:33PM by PIB Hyderabad

కొవిడ్-19 వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ప్రతీ ఒక్కరూ కొరొనాపై పొరాటానికి సిద్ధమయ్యారు, ఇందుకు ఒకటే మార్గం తమకు తాము పరిశుభ్రతను పాటించడంతోపాటు సామాజిక దూరాన్ని పాటించడం. ఐఐటి భువనేశ్వర్ మాలవీయ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్, ఇన్క్యుబేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్(ఎంసిఐఐఇ)కు చెందిన శ్రీ జీతు శుక్లా మొత్తం శరీరాన్ని శుభ్రపరిచే సానిటైజేషన్ పరికరాన్ని కనుగొన్నారు. ఈ పరికరం స్వయంచాలితంగా పనిచేస్తుంది. ఇది సెన్సర్లతో పనిచేస్తున్నందు వలన బయట ఏ ప్రాంతంలోనైనా నెలకొల్పవచ్చు,  ఏ వ్యక్తి అయినా ఈ పరికరానికి ఎదురుగా వచ్చినపుడు ఆ వ్యక్తిపై 10-15మిలీల సానిటైజర్ను 15 సెకండ్ల పాటు చిమ్ముతుంది, తద్వారా ఆ వ్యక్తి  శరీర మంతా, బట్టలు, బూట్లు వంటివి పరిశుభ్రమవుతాయి. ప్రజలు తిరిగే ఏ ప్రదేశంలోనైనా ఈ పరికరాన్ని నెలకొల్పడం ద్వారా పరిశుభ్రమైన తరువాతనే ఆ వ్యక్తా లోనికి రాగలుగుతాడు.

ఈ పరికం ప్రస్తుత పరిస్థితుల అవసరాలకు అనుగుణంగా తయారుచేయబడిందని మాలవీయ మాలవీయ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్, ఇన్క్యుబేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్(ఎంసిఐఐఇ) సమన్వయకర్త ప్రొ.పి.కె. మిశ్రా తెలిపారు. ఈ సానిటైజర్ ఉపయోగించడం మూలంగా వైరస్ బారి నుండి దాదాపుగా కాపాడవచ్చు. దీనికి సంబంధించి  మోతాదు సక్రమత, బహిర్గత పరచే సమయం వంటివి ఇంకా నిర్ధారించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పరికరంతో సానిటైజ్ చేసుకున్నప్పటికీ ప్రతీ వ్యక్తి మాస్కులను తప్పనిసరిగి ధరించడంతోపాటు సామాజిక దూరాన్ని పాటిస్తూ సబ్బుతో చేతులను తరచూ శుభ్రపరచుకోవాలి. 



(Release ID: 1613121) Visitor Counter : 295