సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

2020 జూన్ 15 వరకూ కొనసాగనున్న జలియన్ వాలాబాగ్ స్మార చిహ్నం సందర్శనల నిలిపివేత

కోవిడ్ -19 నేపథ్యంలో నిలిచిపోయిన స్మారక చిహ్నం పునరుద్ధరణ పనులు

Posted On: 10 APR 2020 2:50PM by PIB Hyderabad

2019 ఏప్రిల్ 13 నుంచి 2020 ఏప్రిల్ 13 వరకూ వందేళ్ళ క్రితం జరిగిన జలియన్ వాలాబాగ్ ఊచకోత అధ్యాయాన్ని యావత్ భారత జాతి జ్ఞాపకం చేసుకుంటోంది. ఈ ఘటనకు గుర్తుగా ఏర్పాటు చేసిన స్మారక చిహ్నం ప్రస్తుతం పునరుద్ధరించబడింది. మ్యూజియం, గ్యాలరీలతో పాటు సౌండ్ మరియు లైటింగ్ షోలతో అనేక కార్యక్రమాలను చేపట్టారు. 2020 మార్చి నాటికి స్మారక నిర్మాణ స్థలంలో పునఃనిర్మాణ పనులు పూర్తి కావలసి ఉంది. ఏప్రిల్ 13 నుంచి ప్రజలకు ఇక్కడ నివాళులు అర్పించే కార్యక్రమాలు మొదలు పెట్టవలసి ఉంది. ఈ స్మారక స్థలానికి వందేళ్ళు పూర్తైన నేపథ్యంలో సందర్శకుల తాకిడి పెరగడం వల్ల నిర్మాణ పనుల కోసం సందర్శనను 2020 ఫిబ్రవరి 15 నుంచి 2020 ఏప్రిల్ 12 వరకూ ఆపాలని నిర్ణయించారు. ఈ మధ్యలో నిర్మాణ పనులు పూర్తి చేయాలని భావించారు. అయితే కోవిడ్ -19 నేపథ్యంలో ఈ పనులకు అంతరాయం కలగడం వల్ల పునఃనిర్మాణ పనులు మరి కొంత కాలం కొనసాగే అవకాశం ఉంది. అందుకే 2020 జూన్ 15 వరకూ ఈ మూసివేత కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు.

*******


(Release ID: 1613023) Visitor Counter : 171