శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

స‌హ‌జ‌, ఆల్కాహ‌లేత‌ర శానిటైజ‌ర్ త‌యారీకి అంకుర సంస్థ‌కు డీఎస్‌టీ తోడ్పాటు

పర్యావరణ అనుకూలమైనదిగా చర్మంపై తేలికగా ఉంటుందిః డీఎస్‌టీ కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ

Posted On: 10 APR 2020 12:00PM by PIB Hyderabad

దేశంలో కోవిడ్‌-19 వైర‌స్‌ను ఎదుర్కొనే చ‌ర్య‌ల్లో భాగంగా వివిధ అంకుర సంస్థ‌ల‌కు త‌నవంతు స‌హ‌కారాన్ని అందిస్తూ ప్రోత్స‌హిస్తోంది కేంద్రం శాస్త్ర, సాంకేతిక ప‌రిజ్ఙాన‌ శాఖ (డీఎస్‌టీ). ఇందులో భాగంగా మహారాష్ట్రలోని పూణె కేంద్రంగా సేవ‌లందిస్తున్న వ్యవసాయం, ఆహార‌, బయో-టెక్నాలజీ రంగ సంస్థ గ్రీన్ పిరమిడ్ బయోటెక్ (జీపీబీ) ఆల్కహాల్ లేని చేతుల‌పై స‌హ‌జంగా ఉండేలా త‌యారు చేసిన మేటి శానిటైజర్ తయారీకి డీఎస్‌టీ నిధుల‌ను స‌మ‌కూరుస్తోంది. ఉప‌రిత‌లాల‌పై దీర్ఘకాలం ఉండి యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీవైరల్ ప్రభావంతో ప‌ని చేసేలా దీనిని త‌యారు చేస్తున్నారు. కోవిడ్‌-19 అంటువ్యాధిగా మారి నిత్యం
ఉపయోగించే ఉపరితలాలైన‌ టేబుల్స్, కంప్యూటర్లు, కుర్చీ, మొబైల్ ఫోన్లు మరియు తాళాలు వంటి వాటి ద్వారా దీని వ్యాపిస్తున్న సంగ‌తి తెలిసిందే. దీనిని నియంత్రించేందుకు చేతుల‌ను శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ నేప‌థ్యంలో స‌బ్బుతో చేతులను క‌డుక్కోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. అయితే స‌మ‌యానికి స‌బ్బు, నీటి ల‌భ్య‌త అంత విరివిగా ఉండ‌దు కాబ‌ట్టి వైర‌స్ వ్యాప్తిని నియంత్రించేందుకు గాను శానిటైజ‌ర్ కోవిడ్‌పై పోరుతో అత్యావ‌శ్య‌కంగా మారింది.
బయో సర్ఫ్యాక్టెంట్ ఏపీఐల‌తో త‌యారీ..
కోవిడ్‌-19పై పోరుకు ఇది చాలా ప్రభావవంతంగా ప‌ని చేస్తుండ‌డంతో దీని త‌యారి దిశ‌గా డీఎస్‌టీ తోడ్పాటు చ‌ర్య‌లు చేప‌ట్టింది. గ్రీన్ పిరమిడ్ బయోటెక్ అభివృద్ధి చేసిన ఈ శానిటైజర్లో బ్యాక్టీరియా మరియు వైరస్ల నుండి ఎక్కువ స‌మ‌యం రక్షణను అందించేలా బయో సర్ఫ్యాక్టెంట్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్‌గ్రీడియంట్(ఏపీఐ) వాడారు. ఇది వైర‌స్ సంక్రమణ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించడానికి తోడ్ప‌డుతోంది. వ్యాధికారక బాక్టీరియా, శిలీంధ్రాలు మరియు ఎస్ట్ యొక్క విస్తృత శ్రేణికి వ్యతిరేకంగా దీనిని ప్ర‌యోగాత్మక ద‌శ‌లో ప‌రీక్షించారు. ఆల్కాహాల్ లేకుండా స‌హ‌జంగానే చేతులు, వివిధ ఉపరితలాలను శుభ్రం చేయడానికి అనుకూలమైన మరియు ప్రభావవంతమైనదిగా ఈ శానిటైజ‌ర్ ప‌ని చేస్తోంది. దీనిని వివిధ‌ గాయాలను శుభ్రం చేయడంతో పాటు పొడి చర్మంపై క‌లిగే చికాకుల‌ను కూడా నివారిస్తుంది.
ఈ ఉత్పత్తి చర్మానికి ఎలాంటి హానికరం కాదు.
ప‌ర్యావ‌ర‌ణ అనుకూలమైంది..
చ‌ర్మాన్ని ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి కాపాడుకోవ‌డానికి ప‌లు ర‌కాల విధానాలు ఉన్నాయ‌ని డీఎస్‌టీ కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ అన్నారు. ఇందులో స‌బ్బు నీరును ఉప‌యోగించి క‌డుక్కోవ‌డం, ఆల్కాహాల్‌ ఆధారిత సొల్యూష‌న్స్ ఉప‌యోగించి త‌యారు చేసే క్రిమిసంహారకాలతో పాటు ప‌లు ఇత‌ర విధానాలు వాడుకంలో ఉన్నాయ‌ని ఆయ‌న తెలిపారు. వీటి లభ్యత, సందర్భం, పరిస్థితులు, వాటి ప్ర‌యోజ‌నాలను బ‌ట్టి వాటి వాడ‌కం ఉంటుంద‌ని ఆయ‌న వివరించారు. అయితే గ్రీన్ పిరమిడ్ బయోటెక్ అభివృద్ధి చేసిన ఈ శానిటైజర్లో బయో-సర్ఫ్యాక్టెంట్ ఆధారిత క్రిమిసంహారక శానిటైజ‌ర్లు వాడుతున్నార‌ని దీంతో ఇది పర్యావరణ అనుకూలమైనదిగా ఉంటూనే చర్మంపై తేలికగా ఉంటుంద‌ని ఆయ‌న వివ‌రించారు. గ్రీన్ పిరమిడ్ బయోటెక్ సంస్థ పూణె కేంద్రంగా ప‌ని చేస్తున్న సంస్థ. ఇది సీఎస్ఐఆర్- నేషనల్ కెమికల్ లాబొరేటరీకి (పూణె) చెందిన ప్రీమియం పరిశోధనా సంస్థలలో ఒకటి. దీనికి డీఎస్‌టీకి చెందిన సీడ్ సపోర్ట్ సిస్టమ్ ఆఫ్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డ్(టీడీబీ) నుంచి అంకుర సంస్థ‌గా తోడ్పాటు, నిధులు స‌మ‌కూరుతున్నాయి.


(Release ID: 1613018) Visitor Counter : 220