కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
కోవిడ్-19పై పోరాటం కోసం పిఎం కేర్స్ నిధికి రూ.28.80 కోట్లు అందించిన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా, ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా
Posted On:
10 APR 2020 9:21AM by PIB Hyderabad
కోవిడ్-19 మహమ్మారిపై పోరాటానికి కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని మూడు వృత్తినిపుణుల సంఘాలు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా, ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా పిఎం కేర్స్ నిధికి రూ.28.80 కోట్లు విరాళంగా అందచేశాయి.
కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో భాగంగా 2020 మార్చి 28వ తేదీన ప్రధానమంత్రి పౌర సహాయ, ఎమర్జెన్సీ సహాయ నిధిని (పిఎం కేర్స్ ఫండ్) ఏర్పాటు చేశారు. కోవిడ్-19 కారణంగా ఎలాంటి అత్యవసర పరిస్థితి లేదా నిరాశాపూరిత పరిస్థితి ఏర్పడినా ఆ విపత్తులో బాధితులకు సహాయం అందించడం ఈ జాతీయ నిధి ప్రాథమిక లక్ష్యం.
వివరాలు ఇలా ఉన్నాయి...
(రూ. కోట్లలో)
క్రమసంఖ్య
|
సంస్థ
|
ఇన్ స్టిట్యూట్ విరాళం
|
సభ్యులు లేదా సిబ్బంది విరాళం
|
మొత్తం
|
1
|
ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా
|
15.00
|
6.00
|
21.00
|
2
|
ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా
|
5.00
|
0.25
|
5.25
|
3
|
ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా
|
2.50
|
0.05
|
2.55
|
మొత్తం
|
|
22.50
|
6.30
|
28.80
|
(Release ID: 1612850)
Visitor Counter : 201