ఆర్థిక మంత్రిత్వ శాఖ
వెంటిలేటర్లు, పిపిఇలు, కోవిడ్ టెస్ట్ కిట్లు, ఫేస్, సర్జికల్ మాస్కుల దిగుమతిపై బేసిక్ కస్టమ్స్ సుంకం, హెల్త్ సెస్ కు మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వం
Posted On:
09 APR 2020 10:42PM by PIB Hyderabad
దేశంలో ప్రస్తుతం నెలకొన్న కోవిడ్-19 పరిస్థితి కారణంగా రోగుల చికిత్సలో ఉపయోగించే వెంటిలేటర్లు, ఇతర చికిత్సా సాధనాల తక్షణ అవసరాన్ని పరిగణనలోకి తీసుకుని ఆయా పరికరాల దిగుమతులకు బేసిక్ కస్టమ్స్ సుంకం, హెల్త్ సెస్ నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఇది తక్షణం అమలులోకి వస్తుంది. ఈ దిగువ పరికరాలకు ఈ మినహాయింపు వర్తిస్తుంది.
ఎ) వెంటిలేటర్లు
బి) ఫేస్ మాస్క్ లు, సర్జికల్ మాస్క్ లు
సి) వ్యక్తిగత రక్షణ పరికరాలు (పిపిఇ)
డి) కోవిడ్-19 కిట్లు
ఇ) పై వస్తువుల తయారీలో ఉపయోగించే ముడిపదార్ధాలు
2020 సెప్టెంబర్ 30 వవరకు ఈ బేసిక్ కస్టమ్స్ సుంకం మినహాయింపు వర్తిస్తుంది.
(Release ID: 1612789)
Visitor Counter : 168